రక్షణ కోరేందుకు వచ్చిన ప్రేమజంట
సాక్షి, మదనపల్లె : తమ పెద్దల నుంచి ప్రాణహాని ఉందని శనివారం మదనపల్లె ఒకటో పట్టణ పోలీసులను ఓ ప్రేమజంట ఆశ్రయించింది. వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని రంగారెడ్డి వీధిలో కాపురం ఉంటున్న విజయ్‌కుమార్ కొడుకు పి.కృషవ్ (27) బెంగళూరులోని ఓ ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. అదే కంపెనీలోనే పనిచేస్తున్న గుజరాత్‌కు చెందిన బహదూర్ సింగ్ కుమార్తె శివాని (25), కృషవ్ గత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.
వీరి ప్రేమ వ్యవహారం ఇద్దరి ఇళ్లలో కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిళ్లు అధికమయ్యాయి. దీంతో ఆ ప్రేమికులు రెండు రోజుల క్రితం బెంగళూరు నుంచి వచ్చి కురబలకోట మండలం చేనేతనగర్‌లో ఉండే ఓ ఆలయంలో స్నేహితుల సహకారంతో వివాహం చేసుకున్నారు. ఇద్దరు మేజర్లు కావడంతో పోలీసులు వారికి రక్షణ కల్పించారు.
చదవండి: పట్టాలెంబడి పాదయాత్రగా తిరిగి వస్తుండగా ఢీకొన్న రైలు
Comments
Please login to add a commentAdd a comment