
తిరువొత్తియూరు( చెన్నై): కడలూరు జిల్లా విరుదాచలంలో ఓ ప్రేమజంట కన్నబిడ్డ సాక్షిగా పోలీసుల సమక్షంలో ఒక్కటైంది. విరుదాచలం సమీపంలోని ముదనై గ్రామానికి చెందిన వేల్‌మురుగన్ (36), అదే ప్రాంతానికి చెందిన సత్య (27) నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో వేల్‌మురుగన్ పెళ్లి చేసుకుంటానని సత్యను లోబరుచుకున్నాడు. దీంతో ఆమె గర్భందాల్చింది.
ఆమెను పెళ్లి చేసుకునేందుకు వేల్‌మురుగన్ నిరాకరించాడు. ఈ నేపథ్యంలో సత్య విరుదాచలం ప్రభుత్వ ఆస్పత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డకు బర్త్ సర్టిఫికెట్ ఇచ్చే క్రమంలో సత్యకు జరిగిన మోసాన్ని తెలుసుకున్న ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళం పోలీసుల విచారణలో వేల్‌మురుగన్ సత్యను పెళ్లి చేసుకునేందుకు అంగీకరించాడు. విరుదాచలం కొలంజియం అమ్మన్ ఆలయంలో శుక్రవారం వారికి పెళ్లి చేశారు. వేల్‌మురుగన్ తాళిని తన కొడుకు చేతికి తాకించి సత్య మెడలో కట్టాడు.
చదవండి: పెళ్లైన ఏడాదికే దారుణం.. భార్య, భర్త ఇద్దరూ ఆత్మహత్య
Comments
Please login to add a commentAdd a comment