Software Engineer Dies In Accidental Fall From Building In Hyderabad - Sakshi
Sakshi News home page

భవనం నుంచి పడి సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ మృతి

Published Fri, Jun 24 2022 8:06 AM | Last Updated on Fri, Jun 24 2022 9:34 AM

Software Engineer killed After Falling From Building - Sakshi

మియాపూర్‌: ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ప్రమాదవశాత్తు ఐదో అంతస్తు టెర్రస్‌పై నుంచి పడి మృతి చెందాడు. ఈ సంఘటన మియాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. విజయవాడకు చెందిన నాగ సందీప్‌(32), భార్య సింధూజ, కూతురుతో కలిసి దీప్తీశ్రీనగర్‌లోని విశ్వం ఎలైట్స్‌ అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్నారు. నాగ సందీప్‌ దుబయ్‌లోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. 15 రోజుల క్రితం కూతురు పుట్టిన రోజు సందర్భంగా నగరానికి వచ్చాడు.

ఈ క్రమంలో బుధవారం సాయంత్రం సోదరుడు కార్తీక్‌ ఇంటికి వెళ్లాడు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో తిరిగి అపార్ట్‌మెంట్‌లోకి వచ్చి ఇంట్లోకి వెళ్లకుండా ఐదు అంతస్తుల టెర్రస్‌పైకి వెళ్లి కూర్చొని ఆన్‌లైన్‌ వర్క్‌ చేసుకుంటున్నాడు.  ఈ క్రమంలో ప్రమాదవశాత్తు ల్యాప్‌టాప్‌తో సహా కిందపడ్డాడు. రాత్రి కావడంతో ఎవరూ గమనించలేదు. ఉదయం 5.30 గంటల సమయంలో తండ్రి సుబ్రమణ్యం రక్తపు మడుగులో పడి ఉన్న సందీప్‌ను గమనించాడు.

స్థానికుల సహాయంతో దగ్గర్లో ఉన్న ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్‌ నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడు సోదరుడు కార్తీక్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మియాపూర్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాపు ్తచేస్తున్నట్లు తెలిపారు.   

(చదవండి: కదం తొక్కిన కార్మికులు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement