online works
-
భవనం నుంచి పడి సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి
మియాపూర్: ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ ప్రమాదవశాత్తు ఐదో అంతస్తు టెర్రస్‌పై నుంచి పడి మృతి చెందాడు. ఈ సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. విజయవాడకు చెందిన నాగ సందీప్(32), భార్య సింధూజ, కూతురుతో కలిసి దీప్తీశ్రీనగర్‌లోని విశ్వం ఎలైట్స్ అపార్ట్మెంట్లో నివాసముంటున్నారు. నాగ సందీప్ దుబయ్‌లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. 15 రోజుల క్రితం కూతురు పుట్టిన రోజు సందర్భంగా నగరానికి వచ్చాడు. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం సోదరుడు కార్తీక్ ఇంటికి వెళ్లాడు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో తిరిగి అపార్ట్మెంట్లోకి వచ్చి ఇంట్లోకి వెళ్లకుండా ఐదు అంతస్తుల టెర్రస్‌పైకి వెళ్లి కూర్చొని ఆన్లైన్ వర్క్ చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు ల్యాప్‌టాప్‌తో సహా కిందపడ్డాడు. రాత్రి కావడంతో ఎవరూ గమనించలేదు. ఉదయం 5.30 గంటల సమయంలో తండ్రి సుబ్రమణ్యం రక్తపు మడుగులో పడి ఉన్న సందీప్‌ను గమనించాడు. స్థానికుల సహాయంతో దగ్గర్లో ఉన్న ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్ నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడు సోదరుడు కార్తీక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాపు ్తచేస్తున్నట్లు తెలిపారు. (చదవండి: కదం తొక్కిన కార్మికులు) -
ఆర్టీఏ ఆన్లైన్ సేవలపై సదస్సు
ఖిలావరంగల్ : జిల్లాల పునర్విభజనలో భాగంగా వరంగల్ ఆర్టీఏ కార్యాలయంలో డిప్యూటీ ట్రాన్స్‌ఫోర్టు కమిషనర్(డీటీసీ) శివలింగయ్య ఆధ్వర్యంలో శనివారం నాలుగు జిల్లాల అధికారులు, సిబ్బందికి ఆన్లైన్ సేవలపై అవగాహన సదస్సు జరిగింది. ప్రత్యేక పోగ్రాం అధికారి ప్రసన్న నేతృత్వంలో వరంగల్, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్ ఆర్టీఏ కార్యాలయ అధికారులకు ఆన్లైన్ సేవలు, నూతన సాంకేతిక పరిజ్ఞానం, కొత్త జిల్లాల అనుగుణంగా ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం రవాణాశాఖలో తీసుకువచ్చిన నూతన విధానాలపై అవగాహన పెంచుకుని వాహనదారులకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఏ మాధవరావు, ఖమ్మం ఆర్టీఓ ఎండీ.అబ్ధుల్‌మోయిన్, కరీంనగర్ ఆర్టీఓ వినోద్‌కుమార్, పరిపాలన అధికారులు, ఎంవీఐలు, ఏఎంవీఐలు, వరంగల్ ఎంవీఐలు సత్యనారాయణ, రాంచందర్, ఏఎంవీఐలు ఫహీమాసుల్తానా, సిబ్బంది పాల్గొన్నారు.