ఆర్టీఏ ఆన్‌లైన్‌ సేవలపై సదస్సు | rda online sevalapi sadassu | Sakshi
Sakshi News home page

ఆర్టీఏ ఆన్‌లైన్‌ సేవలపై సదస్సు

Published Sun, Oct 9 2016 12:10 AM | Last Updated on Mon, Sep 4 2017 4:40 PM

rda online sevalapi sadassu

ఖిలావరంగల్‌ : జిల్లాల పునర్విభజనలో భాగంగా వరంగల్‌ ఆర్టీఏ కార్యాలయంలో డిప్యూటీ ట్రాన్స్‌ఫోర్టు కమిషనర్‌(డీటీసీ) శివలింగయ్య ఆధ్వర్యంలో శనివారం నాలుగు జిల్లాల అధికారులు, సిబ్బందికి ఆన్‌లైన్‌ సేవలపై అవగాహన సదస్సు జరిగింది. ప్రత్యేక పోగ్రాం అధికారి ప్రసన్న నేతృత్వంలో వరంగల్, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్‌ ఆర్టీఏ కార్యాలయ అధికారులకు ఆన్‌లైన్‌ సేవలు, నూతన సాంకేతిక పరిజ్ఞానం, కొత్త జిల్లాల అనుగుణంగా ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం రవాణాశాఖలో తీసుకువచ్చిన నూతన విధానాలపై అవగాహన పెంచుకుని వాహనదారులకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఏ మాధవరావు, ఖమ్మం ఆర్టీఓ ఎండీ.అబ్ధుల్‌మోయిన్, కరీంనగర్‌ ఆర్టీఓ వినోద్‌కుమార్, పరిపాలన అధికారులు, ఎంవీఐలు, ఏఎంవీఐలు, వరంగల్‌ ఎంవీఐలు సత్యనారాయణ, రాంచందర్, ఏఎంవీఐలు ఫహీమాసుల్తానా, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement