కోరుట్ల : జగిత్యాలలోని విరూపాక్షి గార్డెన్స్‌లో ఈనెల20వ తేదీన జరిగే బీసీల చైతన్య సదస్సును విజయవంతం చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకుడు ముల్క ప్రసాద్, మండల అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ అన్నారు. శనివారం విలేకరులతో మాట్లాడారు. సదస్సుకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ .కృష్ణయ్య, రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ హాజరవుతారన్నారు.
కోరుట్ల : జగిత్యాలలోని విరూపాక్షి గార్డెన్స్‌లో ఈనెల20వ తేదీన జరిగే బీసీల చైతన్య సదస్సును విజయవంతం చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకుడు ముల్క ప్రసాద్, మండల అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ అన్నారు. శనివారం విలేకరులతో మాట్లాడారు. సదస్సుకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ .కృష్ణయ్య, రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ హాజరవుతారన్నారు. బీసీ సంఘం ప్రతినిధులు, బీసీలు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు. సమావేశంలో నాంతాబాద్ రాకేశ్, సురేందర్, నవీన్, గంగాదర్, శ్రీనివాస్, మనోహర్, ప్రశాంత్ పాల్గొన్నారు.