sadassu
-
బినామీలతో విద్యా వ్యాపారం
అవగాహనా సదస్సును అడ్డుకున్న విద్యార్థి సంఘాల నాయకులు అనంతపురం న్యూటౌన్ : ప్రభుత్వ పెద్దలే బినామీలతో విద్యా వ్యాపారం చేస్తున్నారంటూ విద్యార్థి సంఘాల నా యకులు స్థానిక ఆర్‌్ట్స కళాశాలలో నిర్వహిస్తున్న అవ గాహన సదస్సును అడ్డుకున్నారు. దీంతో సదస్సు అర్ధంతరంగా ముగిసింది. వివరాలిలా ఉన్నాయి. పదవ తరగతి విద్యార్థులకు గుంటూరుకు చెందిన అభ్యాస్ జూనియర్ కళాశాల వారు ఆదివారం ఆర్ట్స్ కళాశాలలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు బీవీ పట్టాభిరామ్ విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. విద్యార్థులు రాణించేందుకు సలహాలు సూచ లను అందజేస్తుండగా విద్యార్థిసంఘాల నాయకులు అడ్డుకున్నారు. బీవీ పట్టాభిరామ్, అభ్యాస్ కళాశాల కరస్పాండెంట్ లక్ష్మణరావు తో వాగ్వాదానికి దిగారు. విద్యార్థి నాయకులు మాట్లాడుతూ విద్యా అవగాహన సదస్సుల పేరుతో ఎక్కడో వచ్చిన ర్యాంకులు చూపించి విద్యార్థుల తల్లిదండ్రులను వంచిస్తున్నారని విమర్శించారు. స్పీకర్ కోడెల శివప్రసాద్‌కు చెందిన అభ్యాస్ కార్పొరేట్ కళాశాల వారు కేవలం ధనవంతుల పిల్లలను టార్గెట్ చేశారన్నారు. పదవ తరగతి పూర్తి కాకుండానే ఇంటర్ అడ్మిషన్ల కోసం వచ్చే ప్రతి కళాశాలను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. సదస్సు గందరగోâýæంగా మారడంతో హాజరైన విద్యార్థులు వెళ్లిపోగా, కార్యక్రమాన్ని అర్ధంతరంగా ముగించారు. నిరసన కార్యక్రమంలో వైఎస్సార్సీపీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు బండి పరుశురామ్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర నాయకులు సాకే నరేష్, ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు జాన్స¯ŒS, ఐక్య విద్యార్థి సంఘం నేతలు రవికుమార్, సురేష్ తదితరులున్నారు. -
ఆర్టీఏ ఆన్లైన్ సేవలపై సదస్సు
ఖిలావరంగల్ : జిల్లాల పునర్విభజనలో భాగంగా వరంగల్ ఆర్టీఏ కార్యాలయంలో డిప్యూటీ ట్రాన్స్‌ఫోర్టు కమిషనర్(డీటీసీ) శివలింగయ్య ఆధ్వర్యంలో శనివారం నాలుగు జిల్లాల అధికారులు, సిబ్బందికి ఆన్లైన్ సేవలపై అవగాహన సదస్సు జరిగింది. ప్రత్యేక పోగ్రాం అధికారి ప్రసన్న నేతృత్వంలో వరంగల్, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్ ఆర్టీఏ కార్యాలయ అధికారులకు ఆన్లైన్ సేవలు, నూతన సాంకేతిక పరిజ్ఞానం, కొత్త జిల్లాల అనుగుణంగా ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం రవాణాశాఖలో తీసుకువచ్చిన నూతన విధానాలపై అవగాహన పెంచుకుని వాహనదారులకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఏ మాధవరావు, ఖమ్మం ఆర్టీఓ ఎండీ.అబ్ధుల్‌మోయిన్, కరీంనగర్ ఆర్టీఓ వినోద్‌కుమార్, పరిపాలన అధికారులు, ఎంవీఐలు, ఏఎంవీఐలు, వరంగల్ ఎంవీఐలు సత్యనారాయణ, రాంచందర్, ఏఎంవీఐలు ఫహీమాసుల్తానా, సిబ్బంది పాల్గొన్నారు. -
20న బీసీ చైతన్య సదస్సు
కోరుట్ల : జగిత్యాలలోని విరూపాక్షి గార్డెన్స్‌లో ఈనెల20వ తేదీన జరిగే బీసీల చైతన్య సదస్సును విజయవంతం చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకుడు ముల్క ప్రసాద్, మండల అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ అన్నారు. శనివారం విలేకరులతో మాట్లాడారు. సదస్సుకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ .కృష్ణయ్య, రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ హాజరవుతారన్నారు. బీసీ సంఘం ప్రతినిధులు, బీసీలు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు. సమావేశంలో నాంతాబాద్ రాకేశ్, సురేందర్, నవీన్, గంగాదర్, శ్రీనివాస్, మనోహర్, ప్రశాంత్ పాల్గొన్నారు.