బినామీలతో విద్యా వ్యాపారం | Binamilato Education Business | Sakshi
Sakshi News home page

బినామీలతో విద్యా వ్యాపారం

Published Mon, Nov 14 2016 12:32 AM | Last Updated on Fri, Nov 9 2018 4:10 PM

బినామీలతో విద్యా వ్యాపారం - Sakshi

బినామీలతో విద్యా వ్యాపారం

అవగాహనా సదస్సును అడ్డుకున్న  విద్యార్థి సంఘాల నాయకులు 
అనంతపురం న్యూటౌన్ : ప్రభుత్వ పెద్దలే బినామీలతో విద్యా వ్యాపారం చేస్తున్నారంటూ విద్యార్థి సంఘాల నా యకులు  స్థానిక ఆర్‌్ట్స కళాశాలలో నిర్వహిస్తున్న అవ గాహన సదస్సును అడ్డుకున్నారు. దీంతో సదస్సు అర్ధంతరంగా ముగిసింది. వివరాలిలా ఉన్నాయి. పదవ తరగతి విద్యార్థులకు గుంటూరుకు చెందిన అభ్యాస్‌ జూనియర్‌ కళాశాల వారు ఆదివారం ఆర్ట్స్‌ కళాశాలలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు.  ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు బీవీ పట్టాభిరామ్‌ విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. విద్యార్థులు రాణించేందుకు సలహాలు సూచ లను అందజేస్తుండగా విద్యార్థిసంఘాల నాయకులు అడ్డుకున్నారు. బీవీ పట్టాభిరామ్, అభ్యాస్‌ కళాశాల కరస్పాండెంట్‌ లక్ష్మణరావు తో వాగ్వాదానికి దిగారు. విద్యార్థి నాయకులు మాట్లాడుతూ విద్యా అవగాహన సదస్సుల పేరుతో  ఎక్కడో వచ్చిన ర్యాంకులు చూపించి విద్యార్థుల తల్లిదండ్రులను వంచిస్తున్నారని విమర్శించారు. స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌కు చెందిన అభ్యాస్‌  కార్పొరేట్‌ కళాశాల వారు కేవలం ధనవంతుల పిల్లలను టార్గెట్‌ చేశారన్నారు. పదవ తరగతి పూర్తి కాకుండానే ఇంటర్‌ అడ్మిషన్ల కోసం వచ్చే ప్రతి కళాశాలను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. సదస్సు గందరగోâýæంగా మారడంతో  హాజరైన విద్యార్థులు వెళ్లిపోగా, కార్యక్రమాన్ని అర్ధంతరంగా ముగించారు. నిరసన కార్యక్రమంలో  వైఎస్సార్‌సీపీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు బండి పరుశురామ్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర నాయకులు  సాకే నరేష్, ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా నాయకులు జాన్స¯ŒS,  ఐక్య విద్యార్థి సంఘం నేతలు రవికుమార్, సురేష్‌ తదితరులున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement