పురుగుల మందు తాగే ముందు సెల్ఫీ వీడియోలో మాట్లాడుతున్న యువతి
సాక్షి,కదిరి: ఓ ప్రేమ జంట బుధవారం కదిరి ప్రాంతంలో ఆత్మహత్యాయత్నం చేసింది. ఇందుకు సంబంధించిన సెల్ఫీ వీడియో సామాజిక మాధ్యమాల్లో పోస్టు కావడంతో అప్రమత్తమైన ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప ఆదేశాల మేరకు కదిరి డీఎస్పీ భవ్యకిశోర్, పోలీసులు వారి ఆచూకీ కనుగొని పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో వారు పురుగుల మందు కలిపిన స్ప్రైట్ బాటిల్ పడేసి, పోలీసులకు చిక్కకుండా పారిపోయారు. సామాజిక మాధ్యమాల్లో ప్రేమజంట పోస్టు చేసిన వివరాలు పోలీసులు వెల్లడించారు. ‘నా పేరు శివప్రత్యూష, నాకు 18 ఏళ్లు. చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి గ్రామం. నా ప్రియుడితో కలిసి నేను ఇల్లు వదిలి వచ్చినప్పుడు నాకు 18 ఏళ్లకు రెండు నెలలు తక్కువగా ఉండేది.
అప్పుడు మేము పెళ్లి చేసుకోవడానికి నా వయసు అడ్డంకిగా మారింది. అందుకే మా తల్లిదండ్రులు అక్కడ నన్ను ఎవరో కిడ్నాప్ చేశారంటూ కేసు పెట్టినట్లు తెలిసింది. ఇప్పుడు మేము పెళ్లి చేసుకుని ఇంటికి వెళ్లినా మళ్లీ మా తల్లిదండ్రులు మమ్మల్ని విడదీయడం ఖాయం. అందుకే స్ప్రైట్ బాటిల్‌లో పురుగుల మందు కలుపుకుని తాగేసి చచ్చిపోవాలని డిసైడ్ అయిపోయాం’ అంటూ ఆ యువతి మాట్లాడుతుంటే... ఇరువురూ కనబడే విధంగా ఆ బాటిల్‌ని పైకెత్తి గుటగుట తాగడం ఆమె ప్రియుడు సెల్ఫీ వీడియో తీసి సామాజిక మా«ధ్యమాల్లో పోస్టు చేశారు. అజ్ఞాతంలో ఉన్న వారి కోసం సీఐ నిరంజన్‌రెడ్డి, సిబ్బంది గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment