
నదిలో దూకుతున్న రాము
దొడ్డబళ్లాపురం: స్నేహితుల మాటకు కట్టుబడి ఒక వ్యక్తి నిండి ప్రవహిస్తున్న నదిలో దూకిన సంఘటన హొళేనరసీపురలో చోటుచేసుకుంది. హొళేనరసీపురకు చెందిన రాము అనే వ్యక్తి ఈ సాహసానికి పూనుకున్నాడు. ఆదివారం తన పిల్లలు, స్నేహితులతో కలిసి రాము కావేరి నది పరివాహక ప్రదేశానికి వెళ్లాడు. ఈ సందర్భంగా స్నేహితులతో 17 ఏళ్ల క్రితం ఇదే విధంగా పొంగి ప్రవహిస్తున్న నదిలో దూకి అవతలి వైపు ఒడ్డును చేరుకున్న సంఘటనను గుర్తు చేసాడు.
దీంతో స్నేహితులు సరదాగా అయితే ఇప్పుడు చేసి చూపించు అంటూ ఎగతాళి చేశారు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న రాము పిల్లలతో ఈతకొట్టి చూపిస్తాను చూడండంటూ చెప్పి అమాంతం నదిలో దూకి అవతలి ఒడ్డుకు చేరుకున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment