
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మోనిక
సాక్షి, శిడ్లఘట్ట(కర్ణాటక): ప్రియునికి కాబోయే భార్యపై హత్యాయత్నం చేసిన యువతి జైలుపాలైంది. శిడ్లఘట్ట తాలూకా ఆనేమడుగు గ్రామానికి చెందిన గంగోత్రి (20), మోనిక (19) అనే ఇద్దరు అమ్మాయిలు స్నేహితులు. వీరిద్దరిని గంగరాజు (20) అనే యువకుడు గుట్టుగా ప్రేమించాడు. అయితే ఇటీవల మోనిక– గంగరాజుకు వివాహం నిశ్చయమైంది.
ఇది తట్టుకోలేని గంగోత్రి ఆదివారం తెల్లవారుజామున చాకుతో దాడి చేయడంతో మోనిక చేతికి, మెడకు గాయాలయ్యాయి. దిబ్బూరహళ్లి పోలీసులు గంగోత్రిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment