fiancee
-
కాబోయే భర్తతో కలిసి డిన్నర్‌కు వెళ్లిన పీవీ సింధు... ఫొటోలు చూశారా?
-
అక్కడ మాత్రం రాక్షసుడే : జెఫ్ బెజోస్పై ప్రియురాలి వ్యాఖ్యలు
ప్రపంచ రెండో అత్యంత ధనవంతుడు, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్పై అతని కాబోయే భార్య లారెన్ శాంచెజ్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఇటీవల ఘనంగా ఎంగేజ్మెంట్ చేసుకున్న వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఈ క్రమంలో తాజాగా శాంచెజ్ బెజోస్ ఫిట్నెస్ గురించి మాట్లాడింది. వోగ్‌తో మాట్లాడిన శాంచెస్ తరచూ తామిద్దరం కలిసే ఈ జంట తరచుగా కలిసి వ్యాయామం చేస్తామని చెప్పింది. అయితే రోజువారి రొటీన్ లైఫ్ మాత్రం డిఫరెంట్‌గా ఉంటుందని కానీ దాన్ని గోప్యంగా ఉంచడమే తనకిష్టమని వెల్లడించింది. జిమ్‌లో ఇద్దరమూ ఒకే తరహా ఎక్స్‌ర్‌సైజ్ చేయలేం.. కానీ తనతో పోలిస్తే బెజోస్ పూర్తిగా భిన్నం.. ఒక విధంగా చెప్పాలంటే జిమ్‌లో రాక్షసుడే అంటూ కాబోయే భర్త ఫిట్నెస్ కమిట్మెంట్పై ప్రశంసలు కురిపించింది. ఫిట్నెస్ ఫ్రీక్‌గా జెఫ్ బెజోస్ అమెజాన్ సీఈవోగా తప్పుకున్నప్పటినుంచి బెజోస్ ఫిట్‌నెస్‌పై మరింత దృష్టిపెట్టాడు. వ్యాయాయంతోపాటు, ఆహారంపై కూడా శ్రద్ధ ఎక్కువే. కొవ్వు, మాంసకృత్తులలో కూడిన బలమైన ఆహారాన్ని తీసుకుంటాడు. ముఖ్యంగా ప్రతీరాత్రి ఎనిమిది గంటల నిద్రే తన సక్సెస్‌కు కారణమని గతంలోనే చెప్పాడు బెజోస్. అంతేకాదు ఫిట్నెస్ కోసం స్టెరాయిడ్స్, హ్యూమన్ గ్రోత్ హార్మోన్లను ఉపయోగిస్తాడనే వాదనలను కూడా ఖండించాడు జెఫ్ బెజోస్. 59 ఏళ్ల లేటు వయసులో గర్ల్ ఫ్రెండ్ లారెన్ శాంచెజ్‌ను త్వరలోనే పెళ్లాడనున్నాడు. -
అద్దె భవనంలో ప్రపంచ కుబేరుడు 'జెఫ్ బెజోస్' - రీజన్ తెలిస్తే షాక్ అవుతారు!
ప్రపంచ కుబేరుల జాబితాలో ఒకరైన అమెజాన్ ఫౌండర్ 'జెఫ్ బెజోస్' (Jeff Bezos) ఇటీవల తన ప్రియురాలు లారెన్ శాంచెజ్‌తో ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు ఇతడు వేలకోట్ల ఆస్తిని పక్కన పెట్టి నెలకు సుమారు రూ. 5 కోట్లు రెంట్ చెల్లిస్తూ అద్దె ఇంట్లో ఉన్నట్లు తెలిసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనల్లో తెలుసుకుందాం. దాదాపు రూ. 12 లక్షల కోట్ల కంటే ఎక్కువ సంపద కలిగిన జెఫ్ బెజోస్ కాబోయే భార్యతో కలిసి కాలిఫోర్నియాలోని మాలిబు మాన్షన్‌లో ఉన్నట్లు సమాచారం. హాలీవుడ్ మ్యుజిషియన్ కెన్నీ జీ (Kenny G)కి చెందిన ఈ భవనం 5500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఈ భవనంలో రికార్డింగ్ స్టూడియో, స్విమ్మింగ్ పూల్ వంటి అనేక లగ్జరీ సదుపాయాలు ఉన్నాయి. దీనికి నెలకు 600000 డాలర్లు (ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ. 5 కోట్లు) అద్దె చెల్లిస్తున్నారు. ఇదీ చదవండి: లాంచ్‌కి ముందే 'సైబర్‌ట్రక్' డ్రైవ్ చేసిన మస్క్ - ఫోటో వైరల్ సముద్ర తీరంలో ఉన్న ఈ భవనంలో గత మార్చి నుంచి వీరిరువురు ఉంటున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా బెజోస్ ప్రస్తుతం ఒక విశాలమైన భవనం నిర్మించుకుంటున్నట్లు సమాచారం. అది పూర్తి కావడానికి ఇంకా కొంత సమయం పట్టే అవకాశం ఉంది. అప్పటివరకు అద్దె భవనంలోనే ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. నిజానికి జెఫ్ బెజోస్ 2018లో తన మాజీ భార్య 'మెకంజీ స్కాట్'కి విడాకులిచ్చి, పెద్ద మొత్తంలో భరణం కూడా చెల్లించాడు. ఆ తరువాత లారెన్ శాంచెజ్‌తో డేటింగ్ చేస్తున్నారు. కాగా వీరికి ఇప్పటికే నిశ్చితార్థం కూడా జరిగింది. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. పెళ్లి తరువాత కొత్తగా నిర్మించుకున్న భవనంలోకి మారనున్నట్లు సమాచారం. -
మాజీ ప్రియురాలు పెళ్లి చేసుకుంటుందన్న కోపంతో...ఆమె కాబోయే భర్తకి..
తన మాజీ ప్రియురాలు మరోకర్నీ పెళ్లి చేసుకుంటుందన్న కోపంతో ఆమె కాబోయే భర్త ఇంటికి నిప్పంటించాడు. ఈ ఘటన సింగపూర్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...సింగపూర్‌లోని భారత సంతతికి చెందిన వ్యక్తి సురెంధిరన్ సుగుమారన్ తన మాజీ ప్రియురాలు వేరొకరిని పెళ్లి చేసుకోబోతుందని ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలుసుకున్నాడు. దీంతో అసూయతో, కోపంతో రగిలిపోయి.. ఆమె కాబోయే భర్త ఇంటికి వెళ్లి నిప్పంటించాడు. మరుసటి రోజు పెళ్లి ఉందనంగా ఈ ఘటనకు పాల్పడ్డాడు సుగుమారన్. ఐతే అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాల్లో ఇదంతా రికార్డు అయ్యింది. ఈ ఘటనకు పాల్పడినప్పుడూ...తనను గుర్తుపట్టకుండా ఉండేలా నల్లటి ముసుగు ధరించాడు. అలాగే ఫ్లాట్ నుంచి బయటకు రాకుండా ఉండేలా గేటుకి తాళం వేశాడు. ఆ తర్వాత ఫ్లాట్ కాలిపోయింది అని నిర్ధారించుకున్నాక పోలీసులకు కాల్ చేసి సమాచారం అందించాడు.ఐతే పోలీసులు వెంటనే కేసును చేధించి నిందితుడు సుగుమారన్ని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నేరాన్ని అంగీకరించడమే కాకుండా కేసు నుంచి తప్పించుకునేందుకే మెట్లమార్గం గుండా వెళ్లినట్లు చెప్పాడు. ఈ మేరకు పోలీసులు అతన్ని కోర్టులో హాజరుపర్చగా...జిల్లా జడ్జీ యూజీన్ టీయో..ఇలాంటి ఘటనలు పక్క ఫ్లాట్‌లో ఉండే వారికి అత్యంత ప్రమాదకరమని అన్నారు. ఈ నేరాన్ని ఏ పరిస్థితుల్లో చేసినప్పటికీ, ఇతరులకు ప్రమాదం అని తెలిసి కూడా ఆస్తులను ధ్వంసం చేయడమనేది తీవ్రమైన నేరంగా పరిగణిస్తున్నట్లు తెలిపారు. ఆస్తులకు నష్టం కలుగుతుంది అని తెలిసి కూడా ఈ ఘటనలకు పాల్పడిన వారికి సుమారు ఏడేళ్లు జైలు శిక్ష, జరిమాన విధించబడుతుందని పేర్కొన్నారు. (చదవండి: చమురు విషయంలో పాక్‌కి గట్టి షాక్ ఇచ్చిన రష్యా) -
కాబోయే భర్తతో హన్సిక పర్సనల్ ఫొటో లీక్.. స్పందించిన హీరోయిన్
హీరోయిన్ హన్సిక త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. తన స్నేహితుడు, వ్యాపార భాగస్వామి సోహెల్ ఖతూరియాతో డిసెంబర్లో ఏడడుగులు వేయబోతోంది. ఇటీవల హన్సిక కాబోయే భర్తను కూడా పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ప్యారిస్‌లో ఈఫిల్ టవర్ వద్ద రొమాంటిక్ డేట్లో ప్రియుడు ప్రపోజ్ చేసిన ఫొటోలను తన ఇన్స్టాగ్రామ్ షేర్ చేసి తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చింది. ఇక అప్పటి నుంచి హన్సిక, ఆమె కాబోయే భర్త గురించిన పలు ఆసక్తిక విషయాలు వార్తల్లో నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి హన్సిక ఆమె ప్రియుడు వార్తల్లోకెక్కారు. వీరిద్దరి పర్సనల్ ఫొటో ఒకటి తాజాగా లీకైంది. చదవండి: చివరి రోజుల్లో ‘మహానటి’ సావిత్రికి సెట్లో అవమానం, అన్నం కూడా పెట్టకుండా.. దీంతో ఈ ఫొటో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. వీరిద్దరూ బోట్లో సరదాగా షికారుకు వెళ్తూ కనిపించారు. hansika.officiaal అనే పేరుతో ఉన్న ఇన్స్టాగ్రామ్ ఖాతా నుంచి ఈ ఫొటోను షేర్ చేశారు. దీనిపై హన్సిక స్పందిస్తూ ఇది తన అకౌంట్ కాదని, ఫేక్ అకౌంట్ అని క్లారిటీ ఇచ్చింది. అంతేకాదు ఈ ఫొటో తను షేర్ చేసింది కాదని కూడా స్పష్టం చేసింది. దీంతో ఆమె ఫాలోవర్స్, నెటిజన్లు హన్సిక, సోహెల్ పిక్‌పై క్యూట్ కపుల్ అంటూ రకరకాల కామెంట్స్‌తో స్పందిస్తున్నారు. కాగా రాజస్థాన్ జైపూర్‌లోని ఓ రాజకోటలో డిసెంబర్ 4న వీరి వివాహం అంగరంగ వైభవంగా జరగనుంది. డిసెంబర్ 2 నుంచి వివాహ వేడుకలు ప్రారంభం కానున్నాయి. చదవండి: రెండు ఓటీటీల్లోకి రానున్న ఊర్వశివో రాక్షసివో, స్ట్రీమింగ్ అప్పుడే View this post on Instagram A post shared by 👑 👑 👑 HANSU IS MY WORLD 👑 👑 👑 (@hansika.officiaal) -
హన్సిక పెళ్లాడబోయే వ్యక్తికి ఇదివరకే పెళ్లయిందా?
దేశ ముదురు సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన బ్యూటీ హన్సిక మోత్వాని. తొలి సినిమాతోనే ఊహించని క్రేజ్‌ను దక్కించుకున్న హన్సిక త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనుంది. ముంబైకి చెందిన సోహెల్ ఖతురియాతో కొంతకాలంగా ప్రేమలో మునిగి తేలుతున్న ఈ బ్యూటీ డిసెంబర్లో వివాహ బంధంలోకి అడుగుపెట్టనుంది. ఈ మేరకు కాబోయే భర్తతో కలిసి దిగిన అందమైన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. దీంతో అసలు హన్సిక పెళ్లి చేసుకోబోయేది ఎవరు? అతను ఏం చేస్తుంటాడన్నది తెలుసుకునేందుకు నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సోహెల్‌కు సంబంధించి పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. సోహెల్ ముంబైకి చెందిన ఓ ప్రముఖ వ్యాపారవేత్త. ఎప్పటినుంచో వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. బిజినెస్లోఊ ఇద్దరూ పార్ట్‌నర్స్‌గా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే సోహెల్‌కు ఇది రెండో పెళ్లి. 2016లో రింకీ అనే అమ్మాయితో ఇదివరకే అతనికి పెళ్లయిందట. అయితే తర్వాత విభేదాల కారణంగా వీరు విడాకులు తీసుకున్నారు. మరో విశేషం ఏంటంటే.. రింకీ హన్సికకు బెస్ట్‌ఫ్రెండ్ అట. రింకీ పెళ్లి వేడకలోనూ హన్సిక పాల్గొంది. దీనికి సంబంధించన ఓల్డ్ వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది.ఇప్పుడు ఆ బెస్ట్‌ఫ్రెండ్ మాజీ భర్తనే హన్సిక పెళ్లాడబోతుంది. డిసెంబర్ 4న రాజస్థాన్‌లోని ఓ ప్రముఖ ప్యాలెస్‌లో అంగరంగ వైభవంగా హన్సిక-సోహెల్ పెళ్లి వేడకకు కుటుంబసభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
హన్సిక కాబోయే భర్త ఎవరు, ఏం చేస్తుంటాడో తెలుసా?
హీరోయిన్ హన్సిక త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు కొద్ది రోజులుగా వార్తలు వినిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు వరుడు ఎవరన్నది క్లారిటీ లేదు. సినీ ఇండస్ట్రీకి చెందినవాడా? కాదా? ఇంకేవరంటూ అందరిలో సందేహం నెలకొంది. ఈ క్రమంలో తన కాబోయే భర్తను పరిచయం చేసి అందరి సందేహాలు తీర్చింది ఈ భామ. వరుడి పేరు సోహెల్ ఖత్తూరియా అని కూడా వెల్లడించింది. ప్యారిస్‌లో ఈఫిల్ టవర్ వద్ద రొమాంటిక్ డేట్లో ప్రియుడు ప్రపోజ్ చేసిన ఫొటోలను తన ఇన్స్టాగ్రామ్ షేర్ చేసింది. చదవండి: తమన్నాకు చెస్ ఆట నేర్పిస్తున్న ప్రభాస్, వైరల్‌గా త్రోబ్యాక్ వీడియో ‘ఐ లవ్ యూ సోహెల్ ఖత్తూరియా.. నౌ ఫరెవర్’ అంటూ రాసుకొచ్చింది. దీంతో హన్సిక్ పెళ్లి ఎవరిని చేసుకొనున్నది అనే దానిపై క్లారిటీ వచ్చేసింది. ఇదిలా ఉంటే ఇప్పుడు సోహైల్ ఏం చేస్తుంటాడనేది ఆసక్తిని సంతరించుకుంది. అంతేకాదు అతను ఎవరు, ఎక్కడి వాడు అంటూ హన్సిక్ ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో సోహెల్‌కు సంబంధించిన ఓ అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కాగా సోహెల్ ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అని తెలుస్తోంది. సోహెల్, హన్సిక మంచి స్నేహితులు. చదవండి: రాజీవ్ వల్ల నా కెరీర్ నాశనమైంది.. భర్త వేధింపులపై తొలిసారి నోరు విప్పిన నటి అదే స్నేహంతో సోహెల్, హన్సికను తన బిజినెస్ పార్ట్నర్గా చేసుకున్నట్లు సమాచారం. వీరిద్దరు కలిసి పలు ఈవెంట్స్‌ను ఆర్గనైజ్ చేశారట. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మంచి సన్నిహిత్యం పెరిగిందని, అదే ప్రేమగా మారిందని తెలుస్తోంది. కొంతకాలం డేటింగ్లో ఉన్న ఈ జంట ఇప్పుడు పెళ్లికి రెడీ అయ్యారు. ఇదే విషయాన్ని ఇంట్లో చెప్పడంతో ఇరు కుటుంబ సభ్యులు పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సన్నిహితవర్గాల నుంచి సమాచారం. కాగా వీరి పెళ్లి డిసెంబర్ 4వ తేదీన రాజస్థాన రాష్ట్రం జైపూర్ నగరంలోని ప్రాచీన ప్యాలెస్‌లో అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఇరు కుటుంబ సభ్యులు సన్నాహాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) -
ప్రియునికి కాబోయే భార్యపై ప్రియురాలి దాడి..
సాక్షి, శిడ్లఘట్ట(కర్ణాటక): ప్రియునికి కాబోయే భార్యపై హత్యాయత్నం చేసిన యువతి జైలుపాలైంది. శిడ్లఘట్ట తాలూకా ఆనేమడుగు గ్రామానికి చెందిన గంగోత్రి (20), మోనిక (19) అనే ఇద్దరు అమ్మాయిలు స్నేహితులు. వీరిద్దరిని గంగరాజు (20) అనే యువకుడు గుట్టుగా ప్రేమించాడు. అయితే ఇటీవల మోనిక– గంగరాజుకు వివాహం నిశ్చయమైంది. ఇది తట్టుకోలేని గంగోత్రి ఆదివారం తెల్లవారుజామున చాకుతో దాడి చేయడంతో మోనిక చేతికి, మెడకు గాయాలయ్యాయి. దిబ్బూరహళ్లి పోలీసులు గంగోత్రిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. -
మూడోసారి పెళ్లికొడుకైన బ్రిటన్ ప్రధాని
-
ప్రియురాలిని పెళ్లాడిన బ్రిటిష్ ప్రధాని
లండన్: బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ (56) తన ప్రియురాలు క్యారీ సైమండ్స్ (33)ను పెళ్లాడారు. లండన్‌లోని రోమన్ క్యాథలిక్ వెస్ట్‌మినిస్టర్ క్యాథెడ్రల్ చర్చిలో శనివారం మధ్యాహ్నం నిరాడంబరంగా ఈ వివాహం జరిగినట్లు అధికార వర్గాలు ఆదివారం తెలిపాయి. వధూవరుల కుటుంబ సభ్యులు, మిత్రులు అతికొద్ది మంది మాత్రమే హాజరయ్యారని వెల్లడించాయి. రానున్న వేసవిలో బంధుమిత్రులతో కలిసి వివాహ సంబరాలు ఘనంగా జరుపుకోనున్నారని పేర్కొన్నాయి. బోరిస్ జాన్సన్, క్యారీ సైమండ్స్ చాలాకాలంగా సహజీవనం చేస్తున్నారు. వారికి 2020 ఏప్రిల్‌లో కుమారుడు విల్ఫ్రెడ్ క్యారీ నికోలస్ జాన్సన్ జన్మించాడు. సైమండ్స్‌కు ఇది మొదటి పెళ్లి కాగా, జాన్సన్‌కు మూడో వివాహం. తాము కలిసి జీవిస్తున్నామని, ఎంగేజ్మెంట్ సైతం చేసుకున్నామని వారిద్దరూ 2020లో ఫిబ్రవరిలో బహిర్గతం చేశారు. క్యారీ సైమండ్స్ అప్పటికే గర్భవతి అనే విషయాన్ని కూడా బయటపెట్టారు. గత 200 సంవత్సరాల్లో పదవిలో ఉండగా పెళ్లి చేసుకున్న మొదటి బ్రిటన్ ప్రధానమంత్రిగా బోరిస్ జాన్సన్ రికార్డుకెక్కడం విశేషం. ప్రియురాలితో బోరిస్ జాన్సన్ చివరిసారిగా 1822లో అప్పటి ప్రధాని రాబర్ట్ బ్యాంక్స్ జెంకిన్సన్ పదవిలో ఉండగా వివాహం చేసుకున్నారు. బోరిస్ జాన్సన్ తొలుత 1987లో కళాకారిణి, జర్నలిస్టు అలెగ్రా మోస్టిన్ ఓవెను, తర్వాత 1993లో భారత సంతతికి చెందిన న్యాయవాది, జర్నలిస్టు మెరీనా వీలర్‌ను పెళ్లాడారు. 25 ఏళ్ల వైవాహిక జీవితం అనంతరం తాము విడాకులు తీసుకుంటున్నట్లు జాన్సన్, వీలర్ 2018లో ప్రకటించారు. 2020లో ఈ విడాకుల తంతు పూర్తయ్యింది. క్యారీ సైమండ్స్ 1988 మార్చి 17న జన్మించారు. ఆమె తండ్రి మాథ్యూ సైమండ్స్ ‘ద ఇండిపెండెంట్’ పత్రిక సహ వ్యవస్థాపకుడు. తల్లి జోసెఫైన్ లాయర్. క్యారీ సైమండ్స్ 2010లో కన్జర్వేటివ్ పార్టీ ప్రెస్ ఆఫీసులో చేరారు. రెండేళ్ల తర్వాత బోరిస్ జాన్సన్ ప్రచార బృందంలో చేరారు. ఆయన రెండోసారి లండన్ మేయర్‌గా ఎన్నిక కావడం వెనుక ఆమె కృషి ఉందని అంటుంటారు. 2018లో కన్జర్వేటివ్ పార్టీ కమ్యూనికేషన్ల విభాగం బాధ్యతలు చేపట్టారు. ప్రధాని అధికారిక నివాసమైన 10 డౌనింగ్ స్ట్రీట్‌లో పెళ్లికాకుండానే ప్రధానితో కలిసి జీవనం సాగించిన తొలి మహిళగా క్యారీ సైమండ్స్ పేరుగాంచారు. -
కాబోయే భర్తతో కలిసి బాస్‌ను హత్యచేసిన మహిళ
సాక్షి, ఢిల్లీ: కాబోయే భర్తతో కలిసి ప్రియుడ్ని హత్యచేసిందో మహిళ. ఢిల్లీలో నీరజ్ గుప్తా అనే వ్యాపారవేత్త వాయువ్య ఢిల్లీలో ఆదర్శ్ నగర్లో ఉంటున్నాడు. అయితే అతను తప్పిపోయినట్లు భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. కొన్ని రోజులుగా తన భర్త కనిపించడం లేదని, ఈ ఘటన వెనుక ఫైజల్ అనే మహిళ ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొంది. ఈ కోణంలో విచారించగా గుప్తాను హత్య చేసినట్లు తేలింది. ఇందులో పైజల్ హస్తం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసుల దర్యాప్తులో ఫైసల్ గుప్తా దగ్గర పనిచేసేదని, గత 10 సంవత్సరాలుగా అతనితో వివాహేతర సంబంధం కలిగి ఉందని వెల్లడైంది.చదవండి:(భర్త దోపిడీ వెనుక భార్య.. ఐదుకోట్లు స్వాహా) వివరాల్లోకి వెళితే.. పైజల్‌కు జుబేర్ అనే వ్యక్తితో నిశ్చితార్థం కాగా, ఆ విషయాన్ని నీరజ్ గుప్తాకు తెలిపింది. అయితే వివాహానికి గుప్తా అభ్యంతరం తెలపడంతో నవంబరు 13న ఆదర్శ్ నగర్ లో కేవాల్ పార్క్ ఎక్స్టెన్షన్లో పైజల్ అద్దె ఇంటికి వచ్చి తల్లి, జుబెర్, తీవ్ర వాగ్వాదానికి దిగాడు. వారి మధ్య వాగ్వాదం తీవ్ర కావడంతో ఫైజల్ కాబోయే భర్త గుప్తా తలపై ఇటుకతో కొట్టి , కడుపులో పొడిచిన తరువాత అతని గొంతును కోశారు. మృతదేహాన్ని తరలించడంలో పైజల్. ఫైజల్ తల్లి జుబెర్‌కు సహయాన్ని అందించారు.అతని మృతదేహాన్ని సూట్‌కేస్‌లో ఉంచి రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో తీసుకెళ్లారు. గుజరాత్ భరూచ్ సమీపంలో రైలు నుంచి బయటకు విసిరేశారు. హత్య చేసిన నిందితులు పైజల్ (29), ఆమె తల్లి షాహీన్ నాజ్ (45), కాబోయే భర్త జుబెర్ (28)ను అరెస్టు చేసినట్లు నార్త్‌వెస్ట్ జోన్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ విజయంత ఆర్య తెలిపారు. -
ఇడియట్ అన్నందుకు రూ. 4 లక్షల ఫైన్
అబు దాబి : కాబోయే భార్యను ఇడియట్ అని పిలిచినందుకు గాను ఓ వ్యక్తికి 20 వేల దీరామ్ల జరిమానతో పాటు 60 రోజుల జైలు శిక్ష విధించారు. వివరాలు.. ఖలీజ్ టైమ్స్ ప్రకారం ఓ వ్యక్తి తనకు కాబోయే భార్యను ఉద్దేశిస్తూ వాట్సాప్‌లో ‘ఇడియట్’ అని మెసేజ్ పెట్టాడు. కేవలం సరదాగా చేసిన ఈ పనికి అతడు భారీ మూల్యాన్నే చెల్లించుకోవాల్సి వచ్చింది. ఇడియట్ అని పిలవడంతో ఆగ్రహించిన అతని ఫియాన్సి ఈ విషయం గురించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దాంతో అతడు సరదాగా చేసిన పనికి గాను దాదాపు 4 లక్షల రూపాయల జరిమానా చెల్లించడమే కాక ఆరు నెలల జైలు జీవితం గడపబోతున్నాడు. మన దగ్గర ఇలాంటి విషయాలను పెద్దగా పట్టించుకోరు కానీ.. అరబ్ దేశాల్లో మాత్రం సోషల్ మీడియాలో ఇలాంటి పదాలను, నేర పూరిత పదాలను వాడటాన్ని సైబర్ నేరంగా పరిగణిస్తారు. ఈ ఏడాది జనవరిలో కూడా ఇలాంటి సంఘటనే ఒకటి చోటు చేసుకుంది. దుబాయ్‌లో ఉంటున్న బ్రిటిష్ సిటిజన్ ఒకరు కార్ డీలర్‌ని తిడుతూ మెసేజ్ చేశాడు. దాంతో అతన్ని జైలు పంపించారు. -
కాబోయే భార్యకు నగలు కొనేందుకు..
బనశంకరి: కాబోయే భార్యకు నగలు కొనేందుకు ఓ యువకుడు జేబుదొంగగా మారి చివరకు కటకటాలపాలయ్యాడు. వివరాలు... భట్కళ నివాసి షహీంపిర్జాదే ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల భట్కళ ప్రాంతానికి చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. కాబోయే భార్యకు బంగారు ఆభరణాలు, స్కూటర్ కొనిపెట్టడానికి తనకు వచ్చే సంపాదన సరిపోదని భావించి జేబుదొంగతనాలకు శ్రీకారం చుట్టాడు. భట్కళ నుంచి బెంగళూరు నగరానికి బస్సుల్లో ప్రయాణిస్తూ ప్రయాణికుల జేబులు కొట్టేవాడు. ప్రగతి, శ్రీకుమారట్రావెల్స్ బస్సుల్లో కూడా మహిళల బ్యాగులు, పర్సులను దొంగలించాడు. పసిగట్టిన ట్రావెల్స్ యజమాని జేసీ.నగర పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు గురువారం షహింపిర్జాదేను అరెస్ట్ చేశారు. ఇతడి వద్ద నుంచి 310 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉంది. -
ప్రభాస్ ఫియాన్సీ ఆమెనా.. కాదా?
'బాహుబలి' ప్రభాస్ పెళ్లికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న 'బాహుబలి: ది కన్‌క్లూజన్' సినిమా పూర్తవ్వగానే ఈ యంగ్ రెబల్ స్టార్ పెళ్లిపీటలు ఎక్కుతాడని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఓ అమ్మాయి ఫొటో ఆన్లైన్లో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. ప్రభాస్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఈమేనంటూ ఈ ఫొటో సోషల్ మీడియాలో దర్శనమివ్వడంతో ఒక్కసారిగా ఇది వైరల్ గా మారిపోయింది. అయితే ఈ వార్త ఎంతవరకు నిజమన్నది మాత్రం ఇంకా కన్ఫర్మ్ కాలేదు. గులాబీ రంగు చీర కట్టుకొని ఓ భారీ వస్త్రనిలయంలో ఈ అమ్మాయి ఉన్నట్టు ఫొటోలో కనిపిస్తోంది. పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన ఈ అమ్మాయి ప్రస్తుతం బీటెక్ చదువుతున్నదని, 2016లో ఆమె గ్రాడ్యుయేషన్ పూర్తవుతుందని అంటున్నారు. అయితే, ప్రభాస్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే మిత్రులు మాత్రం ఈ కథనాలను కొట్టిపారేస్తున్నారు. ప్రభాస్‌కు కాబోయే వధువు అంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఫొటో నకిలీదని, ఆ వార్తలను నమ్మవద్దని చెబుతున్నారు.