Who Is Actress Hansika Fiance Sohail Kathuria, Know Intersting Things About Him - Sakshi
Sakshi News home page

Hansika And Sohel Khaturiya Marriage: హన్సిక కాబోయే భర్త ఎవరు, ఏం చేస్తుంటాడో తెలుసా?

Published Thu, Nov 3 2022 11:26 AM | Last Updated on Thu, Nov 3 2022 12:12 PM

Who is Sohail Kathuria Actress Hansika Motwani Getting Marriage With Him - Sakshi

హీరోయిన్‌ హన్సిక త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు కొద్ది రోజులుగా వార్తలు వినిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు వరుడు ఎవరన్నది క్లారిటీ లేదు. సినీ ఇండస్ట్రీకి చెందినవాడా? కాదా? ఇంకేవరంటూ అందరిలో సందేహం నెలకొంది. ఈ క్రమంలో తన కాబోయే భర్తను పరిచయం చేసి అందరి సందేహాలు తీర్చింది ఈ భామ. వరుడి పేరు సోహెల్‌ ఖత్తూరియా అని కూడా వెల్లడించింది. ప్యారిస్‌లో ఈఫిల్‌ టవర్‌ వద్ద రొమాంటిక్‌ డేట్‌లో ప్రియుడు ప్రపోజ్‌ చేసిన ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌ షేర్‌ చేసింది.

చదవండి: తమన్నాకు చెస్‌ ఆట నేర్పిస్తున్న ప్రభాస్‌, వైరల్‌గా త్రోబ్యాక్‌ వీడియో

‘ఐ లవ్‌ యూ సోహెల్‌ ఖత్తూరియా.. నౌ ఫరెవర్‌’ అంటూ రాసుకొచ్చింది.  దీంతో హన్సిక్‌ పెళ్లి ఎవరిని చేసుకొనున్నది అనే దానిపై క్లారిటీ వచ్చేసింది. ఇదిలా ఉంటే ఇప్పుడు సోహైల్‌ ఏం చేస్తుంటాడనేది ఆసక్తిని సంతరించుకుంది. అంతేకాదు అతను ఎవరు, ఎక్కడి వాడు అంటూ హన్సిక్‌ ఫ్యాన్స్‌ ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో సోహెల్‌కు సంబంధించిన ఓ అప్‌డేట్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కాగా సోహెల్‌ ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అని తెలుస్తోంది. సోహెల్‌, హన్సిక మంచి స్నేహితులు.

చదవండి: రాజీవ్‌ వల్ల నా కెరీర్‌ నాశనమైంది.. భర్త వేధింపులపై తొలిసారి నోరు విప్పిన నటి

అదే స్నేహంతో సోహెల్‌, హన్సికను తన బిజినెస్‌ పార్ట్‌నర్‌గా చేసుకున్నట్లు సమాచారం. వీరిద్దరు కలిసి పలు ఈవెంట్స్‌ను ఆర్గనైజ్‌ చేశారట. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మంచి సన్నిహిత్యం పెరిగిందని, అదే ప్రేమగా మారిందని తెలుస్తోంది. కొంతకాలం డేటింగ్‌లో ఉన్న ఈ జంట ఇప్పుడు పెళ్లికి రెడీ అయ్యారు. ఇదే విషయాన్ని ఇంట్లో చెప్పడంతో ఇరు కుటుంబ సభ్యులు పెళ్లికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని సన్నిహితవర్గాల నుంచి సమాచారం. కాగా వీరి పెళ్లి డిసెంబర్‌ 4వ తేదీన రాజస్థాన రాష్ట్రం జైపూర్‌ నగరంలోని ప్రాచీన ప్యాలెస్‌లో అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఇరు కుటుంబ సభ్యులు సన్నాహాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement