అద్దె భవనంలో ప్రపంచ కుబేరుడు 'జెఫ్‌ బెజోస్‌' - రీజన్ తెలిస్తే షాక్ అవుతారు! | Jeff Bezos Paying Rs 5 Crore Monthly Rent To This Musician - Sakshi
Sakshi News home page

అద్దె భవనంలో ప్రపంచ కుబేరుడు 'జెఫ్‌ బెజోస్‌' - రెంట్ ఎన్ని కోట్లో తెలిస్తే షాక్ అవుతారు!

Published Sat, Aug 26 2023 6:42 PM | Last Updated on Sat, Aug 26 2023 6:59 PM

Jeff Bezos paying rs 5 crore per month Kenny G house - Sakshi

ప్రపంచ కుబేరుల జాబితాలో ఒకరైన అమెజాన్ ఫౌండర్ 'జెఫ్‌ బెజోస్‌' (Jeff Bezos) ఇటీవల తన ప్రియురాలు లారెన్ శాంచెజ్‌తో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు ఇతడు వేలకోట్ల ఆస్తిని పక్కన పెట్టి నెలకు సుమారు రూ. 5 కోట్లు రెంట్ చెల్లిస్తూ అద్దె ఇంట్లో ఉన్నట్లు తెలిసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనల్లో తెలుసుకుందాం.

దాదాపు రూ. 12 లక్షల కోట్ల కంటే ఎక్కువ సంపద కలిగిన జెఫ్‌ బెజోస్‌ కాబోయే భార్యతో కలిసి కాలిఫోర్నియాలోని మాలిబు మాన్షన్‌‌‌‌‌‌‌‌లో ఉన్నట్లు సమాచారం. హాలీవుడ్ మ్యుజిషియన్ కెన్నీ జీ (Kenny G)కి చెందిన ఈ భవనం 5500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఈ భవనంలో రికార్డింగ్ స్టూడియో, స్విమ్మింగ్ పూల్ వంటి అనేక లగ్జరీ సదుపాయాలు ఉన్నాయి. దీనికి నెలకు 600000 డాలర్లు (ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ. 5 కోట్లు) అద్దె చెల్లిస్తున్నారు.

ఇదీ చదవండి: లాంచ్‌కి ముందే 'సైబర్‌ట్రక్‌' డ్రైవ్ చేసిన మస్క్ - ఫోటో వైరల్

సముద్ర తీరంలో ఉన్న ఈ భవనంలో గత మార్చి నుంచి వీరిరువురు ఉంటున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా బెజోస్ ప్రస్తుతం ఒక విశాలమైన భవనం నిర్మించుకుంటున్నట్లు సమాచారం. అది పూర్తి కావడానికి ఇంకా కొంత సమయం పట్టే అవకాశం ఉంది. అప్పటివరకు అద్దె భవనంలోనే ఉండే సూచనలు కనిపిస్తున్నాయి.

నిజానికి జెఫ్‌ బెజోస్‌ 2018లో తన మాజీ భార్య 'మెకంజీ స్కాట్'కి విడాకులిచ్చి, పెద్ద మొత్తంలో భరణం కూడా చెల్లించాడు. ఆ తరువాత లారెన్ శాంచెజ్‌తో డేటింగ్ చేస్తున్నారు. కాగా వీరికి ఇప్పటికే నిశ్చితార్థం కూడా జరిగింది. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. పెళ్లి తరువాత కొత్తగా నిర్మించుకున్న భవనంలోకి మారనున్నట్లు సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement