rented house
-
సెకండ్ హ్యాండ్ సంపన్నులు!
ఆర్థిక స్థోమతతో సంబంధం లేకుండా ఆడంబర జీవనశైలికి అలవాటుపడి అప్పులపాలైన వాళ్లను ఎంతోమందిని చూస్తుంటాం. అయితే దీనికి భిన్నంగా ఆర్థిక స్థోమత హైలెవెల్లో ఉన్నప్పటికీ నిరాడంబరశైలిని అనుసరించే ధోరణి సంపన్నులలో పెరుగుతోంది. దీనికి ఉదాహరణ షాంగ్ సావెద్ర, అనీ కోల్... మిలియనీర్లు అయిన సావెద్ర, ఆమె భర్త ఇంద్రభవనంలాంటి ఇళ్లెన్నో నిర్మించుకునే ఆర్థిక స్థోమత ఉంది. అయినా సరే ఆ దంపతులు లాస్ ఏంజిల్స్‌లో అద్దె ఇంట్లో ఉంటున్నారు. వారికి విడి విడిగా కార్లు లేవు. ఇద్దరూ కలిసి సెకండ్ హ్యాండ్ కారును ఉపయోగించుకుంటారు.పిల్లలు సెకండ్‌హ్యాండ్ బొమ్మలతో ఆడుకుంటారు. వృథా ఖర్చుకు దూరంగా ఉంటారు. ‘అఫ్కోర్స్, నేను కూడా లగ్జరీ ఐటమ్స్ చూసి టెంప్ట్ అవుతుంటాను. అయితే తొందరపడకుండా కొద్దిసేపు ఆలోచిస్తాను. వెంటనే కొనేయాలనే ఆలోచన నుంచి బయటపడతాను. మనసు పడ్డాం కాబట్టి కొనడం కాకుండా ఆ వస్తువు నిజంగా మనకు ఎంత అవసరమో అని ఆలోచిస్తే సమస్య ఉండదు’ అంటుంది షాంగ్ సావెద్ర.రీసెర్చర్, పర్సనల్ ఫైనాన్స్ కోచ్ అనీ కోల్ మిలియనీర్. అయితే ఆమె సంపాదనతో పోల్చితే చేసే ఖర్చు చా... లా తక్కువ! ఎన్నో సంవత్సరాల క్రితం కారును అమ్ముకుంది. ఇంట్లో పనివాళ్లు అంటూ ఎవరూ ఉండరు. వంట చేయడం నుంచి జుత్తు కత్తిరించుకోవడం వరకు తానే చేస్తుంది! సెలవు రోజుల్లో ఎంజాయ్ చేయడానికి ఖర్చు అవసరం లేని ఫ్రీ యాక్టివిటీలకు ప్రాధాన్యత ఇస్తుంది. పొదుపునకు ప్రాధాన్యత ఇచ్చే జీవనశైలిని అనుసరిస్తోంది. దుస్తుల నుంచి వస్తువుల వరకు సెకండ్ హ్యాండ్ వాటికి ప్రాధాన్యత ఇస్తోంది. ఈ సంపన్నులది పీనాసితనంగా అనిపించవచ్చుగానీ.. కొద్దిగా ఆలోచించినా అర్థమవుతుంది వారి ఆచరణ ఎంత అనుసరణీయమో. -
అద్దిల్లా..? సొంతిల్లా..?
చాలా మంది తేల్చుకోలేని అంశం.. అద్దె ఇంట్లో ఉండడం నయమా? లేక సొంతిల్లు సమకూర్చుకోవడం బెటరా? అని. ఈ రెండింటిలో ఆర్థికంగా ఏది లాభదాయకమో నిపుణులను అడిగితే చెబుతారు. కానీ, ఇల్లు అన్నది భావోద్వేగాలు, సామాజిక గుర్తింపు, మానసిక ప్రశాంతత తదితర ఎన్నో అంశాలతో ముడిపడి ఉంటుంది. అద్దె ఇల్లు ఆర్థిక భారం లేనిది. సొంతిల్లు ఆర్థిక బాధ్యతను తెచి్చపెడుతుంది. ఒకటి రెండు నెలల అడ్వాన్స్ ఉంటే నిమిషాల్లో అద్దె ఇంట్లో దిగిపోవచ్చు. కానీ, సొంతింట్లో కుడి కాలు మోపాలంటే భారీ మొత్తం కావాలి. లేదంటే బ్యాంక్ తలుపు తట్టాలి. అద్దె ఇంట్లో మనకు నచ్చకపోయినా, ఇంటి యజమానికి గిట్టకపోయినా మరో గూడు వెతుక్కోవాల్సిందే. సొంతింట్లో ఎవరికి వారే రారాజు. ఇలా నాణేనికి రెండువైపులా లాభనష్టాలున్నాయి. తమకు ఏది అనుకూలమో ఎవరికి వారు తేల్చుకోవాల్సిందే. ఈ దిశగా అవగాహన కలి్పంచి, సులువుగా నిర్ణయం తీసుకోవ డానికి దారి చూపించేదే ఈ వారం ‘ప్రాఫిట్ ప్లస్’ కథనం. ఆర్థిక కోణం... ఇంటి విషయంలో ముందుగా తమ ప్రాధాన్యతలు ఏంటన్నవి ముఖ్యం. మెట్రో నగరాల్లో ఇంటి ధరలు చూస్తే చుక్కల్లో కనబడుతున్నాయి. కనుక అక్కడ సొంతిల్లు చాలా మందికి సాధ్యపడకపోవచ్చు. అలాంటి చోట అద్దె ఇల్లే ఆర్థి కంగా సౌకర్యం. ఇంటి కొనుగోలుతో పోలిస్తే అద్దే తక్కువగా ఉంటుంది. ఇంటి కొనుగోలుకు సరిపడా ఆర్థిక స్థోమత ఉన్న వారి విషయంలో అంత గందరగోళం అక్కర్లేదు. వృత్తి/ఉద్యోగ/వ్యాపార రీత్యా తరచూ ప్రాంతాలు మారే అవసరం లేకపోతే నిశి్చంతగా సొంతింటికి మొగ్గు చూపొచ్చు. కానీ, నగరాలు, పట్టణాల్లో రుణంపై ఇంటిని సమకూర్చుకోవాలని భావించే వారు అక్కడి రెంటల్ ఈల్డ్స్ (ప్రాపర్టీ విలువపై అద్దె రాబడి), ప్రాపర్టీ విలువ పెరుగుదల శాతం ఏ మేరకు ఉంది, తదితర అంశాలను తప్పకుండా పరిగణనలోకి తీసుకోవాలి. మన దేశంలోని చాలా పట్టణాల్లో రుణంపై ఇల్లు కొనుగోలు చేసి చెల్లించే ఈఎంఐతో పోలి్చతే.. చాలా తక్కువకే అద్దె ఇల్లు వచ్చేస్తుంది. పట్టణాల్లో ఇంటిని కొనుగోలు చేయడం మంచి ఆప్షనే. కాలం గడిచే కొద్దీ దాని విలువ పెరుగుతూ వెళ్తుంది. కానీ, దాన్ని సమకూర్చుకునేందుకు సరిపడా పెట్టుబడి కావాలి. పెట్టుబడి కోసం అయితే కొత్తగా అభివృద్ధిలోకి వస్తున్న నగర, పట్టణ శివారు ప్రాంతాల్లో ఇల్లు కొనుగోలు చేసుకోవడం వల్ల.. తక్కువ కాలంలోనే ఎక్కువ విలువ సమకూరుతుంది.అద్దె రాబడి తక్కువ... మన దేశంలో ఇంటిపై సగటు రాబడి 2.9 శాతంగా ఉంది. ప్రపంచంలో ఇక్కడే తక్కువ. అదే యూఎస్, కెనడా, దుబాయిలోని పట్టణాల్లో ఇంటిపై అద్దె రాబడి 5–6 శాతంగా ఉంది. అద్దె రాబడి 4 శాతాన్ని మించినప్పుడు రుణంపై ఇంటిని కొనుగోలు చేసుకోవడం అత్యుత్తమమని ఆర్థిక గణాంకాలు చెబుతున్నాయి. మీరు ఉండాలనుకుంటున్న ప్రాంతంలో ప్రస్తుత రెంటల్ ఈల్డ్ (అద్దెకు ఇస్తే వచ్చే రాబడి) (ప్రాపర్టీ విలువతో పోలిస్తే చెల్లించే అద్దె రేటు), ఏటా ఎంత చొప్పున పెరుగుతుందన్నది తెలుసుకోవాలి. వీటి ఆధారంగా అద్దె/ఈఎంఐ రేషియో ఎంతో తేల్చుకోవాలి. రియల్ ఎస్టేట్ పరిశోధనా సంస్థ ‘లైసస్ ఫొరాస్’ ఇందుకు సంబంధించి విలువైన గణాంకాలు రూపొందించింది. దీని ప్రకారం 100 శాతం అంతకంటే తక్కువ నిష్పత్తి ఉన్న పట్టణాల్లో అద్దె ఇంట్లో ఉండడమే లాభం. ఈ రేషియో 100 దాటిన చోట సొంతిల్లు సమకూర్చుకోవడం లాభం.విశ్లేషణ విశాఖలో రెంటల్ ఈల్డ్ ప్రాపర్టీ విలువపై 2 శాతంగా ఉంది. ఇది ఏటా 5 శాతం పెరుగుతూ పోతే రెంటల్/ఈఎంఐ రేషియో 57 శాతం అవుతుంది. ఏటా 10 శాతం పెరిగితే ఈ రేషియో 84 శాతంగా ఉంటుంది. 11 శాతం పెరిగితే రేషియో 93గా ఉంటుంది. అదే హైదరాబాద్‌లో రెంటల్ ఈల్డ్ 2.5 శాతం.. ఏటా 9 శాతం వరకు పెరిగితే రెంట్/ఈఎంఐ రేషియో 94గా ఉంటుంది. ఒకవేళ ఏటా 10 శాతం పెరిగితే ఈ రేషియో 104కు వెళుతుంది. హైదరాబాద్‌లో ఏటా 10 శాతం చొప్పున అద్దెలు పెరిగేట్టు అయితే అప్పుడు రుణంపై ఇల్లు కొనుగోలు చేసి, ఈఎంఐలు కట్టుకోవడమే ప్రయోజనకరం. అద్దె పెరుగుదల 10 శాతంలోపే ఉంటే కిరాయికి తీసుకోవడం ఆర్థికంగా ప్రయోజనకరం. ఒకవేళ మీరు ఎంపిక చేసుకున్న ప్రాంతంలో ప్రస్తుత రెంటల్ ఈల్డ్ ప్రాపర్టీ విలువపై 4 శాతం అంతకంటే ఎక్కువే ఉండి, ఏటా అద్దె 5 శాతం పెరిగినా సరే.. అక్కడ రుణంపై ఇల్లు కొనుగోలు చేసి ఈఎంఐ కట్టుకోవడమే లాభం.లాభాలుఈ అంశాలు గమనించాలి.. ఆర్బీఐ డేటా ప్రకారం 2010–11 నుంచి 2017–18 మధ్య కాలంలో (రియల్ ఎస్టేట్ రంగ నియంత్రణ సంస్థ (రెరా) రాక ముందు) ప్రాప ర్టీల ధరలు ఏటా 15 శాతం చొప్పున పెరిగాయి. 2018–19 నుంచి 2022–23 కాలంలో (రెరా వచ్చిన తర్వాత) ఏటా 3 శాతం పెరిగాయి. చారిత్రకంగా చూస్తే దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణం కంటే రెట్టింపు స్థాయిలో ప్రాపరీ్టల ధరలు పెరిగినట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఈ రకంగా చూస్తే ప్రాపర్టీ కొనుగోలు లాభదాయకమే. 30 ఏళ్ల కాలానికి రుణం తీసుకుని ఇల్లు కొనుగోలు చేస్తే, ప్రతి నెలా చెల్లించాల్సిన ఈఎంఐ, ఇంటి అద్దె కంటే రెట్టింపు ఉంటుంది. కానీ, 15–17 ఏళ్లు గడిచే సరికి ఇంటి అద్దె ఏటా పెరుగుతూ రుణ ఈఎంఐకి చేరువ కావచ్చు.సొంతిల్లు→ ఒకే చోట స్థిరపడిన వారు శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోవడాన్ని పరిశీలించొచ్చు. మన దేశంలో పట్టణీకరణ వేగంగా జరుగుతోంది. ఇది ఇళ్లు, స్థలాల విలువలకు దన్నుగా నిలుస్తుంది. కనుక ఇంటిపై పెట్టుబడి దీర్ఘకాలంలో సంపదకు దారితీస్తుంది. → సొంతిల్లుతో వచ్చే ప్రశాంతతను వెలకట్టలేం. భద్రతకు హామీనిస్తుంది. ఖాళీ చేయాల్సిన అనిశ్చితి ఉండదు. ఎవరికీ సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉండదు. గోపత్య ఉంటుంది. ఇంటిని ఎలా వినియోగించుకోవాలనే విషయంలో పరిమితులు ఉండవు. నచ్చినట్టుగా ఇంటిని మార్చుకోవచ్చు. రాజీపడాల్సిన అవసరం ఉండదు. → అద్దెకు బదులు ఈఎంఐ కట్టుకుంటే స్థిరాస్తి సమకూరుతుంది. రుణంపై ఇంటిని సమకూర్చుకోవడం వల్ల దీర్ఘకాలంలో దాని విలువ పెరగడమే కాదు.. పన్ను రూపంలోనూ ఎంతో ఆదా అవుతుంది. ఇంటి రుణ ఈఎంఐలో అసలు (ప్రిన్సిపల్), వడ్డీ అని రెండు భాగాలుంటాయి. అసలుకు చెల్లించే మొత్తం గరిష్టంగా ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షలపై సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు పొందొచ్చు. అలాగే, సెక్షన్ 24 కింద ఇంటి రుణంపై ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ. 2 లక్షల వడ్డీ భాగంపై పన్ను లేకుండా చూసుకోవచ్చు. ఒకవేళ రుణంపై కొనుగోలు చేసిన ఇంటిని అద్దెకు ఇచ్చినట్టయితే అప్పుడు వడ్డీ ఒక ఆర్థిక సంవత్సరంలో ఎంత ఉన్నా, ఆ మొత్తంపై పన్ను మినహాయింపు ప్రయోజనం ఉంది. → సొంతింటితో అనుబంధం విడదీయరానిది. అదే అద్దె ఇంట్లో ఉండి, చుట్టుపక్కల వారితో మంచి సంబంధాలు ఏర్పడిన తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోవడం కష్టమనిపిస్తుంది. ఉన్నట్టుండి ఇల్లు ఖాళీ చేయాల్సిన అగత్యం ఏర్పడదు. సొంతిల్లు వ్యక్తిగత హోదాను పెంచుతుంది. సామాజిక గుర్తింపును తెస్తుంది. → చివరిగా సొంతిల్లు ఉంటే.. విశ్రాంత జీవనంలో స్థిరమైన ఆదాయాన్నిచ్చే బంగారు బాతు అవుతుంది. రివర్స్ మార్ట్‌గేజ్‌తో ప్రతి నెలా స్థిరమైన ఆదాయాన్ని బ్యాంక్ నుంచి పొందొచ్చు. అద్దె ఇల్లుళీ అద్దె ఇంటితో ఉండే అత్యంత అనుకూలత.. నచి్చన ప్రాంతంలో ఉండొచ్చు. సొంతిల్లు అయితే మారకుండా ఎప్పటికీ ఒకేచోట ఉండిపోవాల్సి వస్తుంది. → ప్రతికూల ఆర్థిక పరిస్థితుల్లో, ఉద్యోగం కోల్పోయి ఖాళీగా ఉండాల్సి వస్తే, తక్కువ అద్దె ఇంటికి వెళ్లి సర్దుకోవచ్చు. సొంతిల్లు అయితే వ్యక్తిగత కష్టాలతో సంబంధం లేకుండా ఈఎంఐ కట్టాల్సిందే. → అద్దె ఇల్లు అయితే ఇంటి నిర్వహణ భారం తమ మీద పడదు. వాటర్ ట్యాంక్‌లు, నీటి మోటార్ల నిర్వహణ, రిపేర్లు, పెయింట్స్ తదితర బాదర బం«దీలు ఉండవు. వీటి రూపంలో ఆర్థిక భారం పడదు. ఇంటి పన్నుల బాధా ఉండదు. → రుణంపై ఇల్లు కొనుగోలు చేయాలంటే.. మొత్తం విలువలో 20 శాతం డౌన్ పేమెంట్ కింద సమకూర్చుకోవాలి. అదే అద్దె ఇంటి విషయంలో ఈ అవసరం ఉండదు. కొద్ది నెలల అద్దెకు సరిపడా రిఫండబుల్ డిపాజిట్ చెల్లిస్తే సరిపోతుంది.వేతన జీవులకు రియల్టీ ఆస్తివేతన జీవులకు రియల్ ఎస్టేట్ ఒక ఆస్తిగా మారుతుంది. నీవు ప్రతి నెలా అద్దె కింద రూ.లక్ష చెల్లిస్తుంటే, దానికి అదనంగా రూ.50,000–60,000 చెల్లించేట్టు అయితే సొంతిల్లు దక్కుతుంది. పదేళ్ల పాటు ఇదే అద్దెను చెల్లించడం వల్ల ఎలాంటి ఆస్తి సమకూరదు. కనుక ఈఎంఐతో ఒక ఆస్తిని సమకూర్చుకోవచ్చు. – అజితేష్ కొరుపూలు, అశోక బిల్డర్స్ (రియల్ ఎస్టేట్ కంపెనీ) సీఈవోతెలివైన నిర్ణయం కాదు!గురుగ్రామ్‌లో నేను ఉండే ఇంటికి ప్రతి నెలా రూ.1.5 లక్షలు అద్దె, మెయింటెనెన్స్‌తో కలిపి రూ.1.65 లక్షలు చెల్లిస్తున్నా. అది గోల్ఫ్‌కోర్స్‌తో కూడిన ఖరీదైన ప్రాంతం. నేను ప్రస్తుతం అద్దెకు ఉంటున్న అపార్ట్మెంట్ ఖరీదు రూ.7.5–8 కోట్లు. దీన్ని కొనుగోలు చేయాలంటే 70 శాతం మేర రూ.6 కోట్లు రుణం తీసుకోవాలి. దీనికి ప్రతి నెలా రూ.6–7 లక్షల ఈఎంఐ చెల్లించాలి. అంటే నేను ప్రస్తుత ఇంటికి చెల్లిస్తున్న అద్దెకంటే ఈఎంఐ నాలుగు రెట్లు అధికం. కనుక ఇల్లు కొనుగోలు చేయడం నాకు తెలివైన నిర్ణయం కాబోదు. ఇల్లు అనేది లిక్విడిటీ (కోరుకున్న వెంటనే సొమ్ము చేసుకోగల) ఉన్న ఆస్తి కాదు. కనుక నేను అదే రూ.6 లక్షలను పబ్లిక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేస్తాను. పైగా అద్దె ఇల్లు తీసుకోవడంలో కొంత స్వేచ్ఛ ఉంటుంది. 15 రోజుల్లోనే చిన్న సైజు నుంచి పెద్ద సైజు ఇంటికి మారొచ్చు. నేను నా పిల్లలు, తల్లిదండ్రులతో కలసి ఉంటే తప్ప ఇంటి విషయంలో నా ఆలోచన ఇదే. – శంతను దేశ్‌పాండే, బోంబే షేవింగ్ కంపెనీ ఫౌండర్హాస్యాస్పదంప్రస్తుత వేల్యూషన్ల వల్లే నేను రియల్ ఎస్టేట్‌ను కొనుగోలు చేయలేదు. నా వరకు ఈ వేల్యూషన్లు నిజంగా హాస్యాస్పదం. వడ్డీ రేట్ల కంటే ఇంటిపై రాబడులు తక్కువ. ఇళ్లు, ఆఫీస్‌ల ధరలు పెరుగుతాయని కొనుగోలు చేయడం తెలివైన నిర్ణయం అనిపించడంలేదు. పెట్టుబడులపై 10–12 శాతం రాబడులు సంపాదించుకోలిగినప్పుడు, 3 శాతానికే (ప్రాపర్టీ విలువలో) వచ్చే అద్దె ఇల్లు తీసుకోవడమే మంచిది. పెట్టుబడులపై వచ్చే రాబడి కంటే రెంటల్ ఈల్డ్ చాలా తక్కువ. నా తల్లిదండ్రులు నివసించిన ఇల్లు ఒక్కటే నాకు ఉంది. దానికి కూడా భావోద్వేగ పరమైన కారణాలున్నాయి. – నిఖిల్ కామత్, జెరోదా కో–ఫౌండర్ ఆఫీసుకు దగ్గరుంటే.. తమ కార్యాలయాలకు దగ్గరగా లేదా వ్యాపార సంస్థలకు సమీపంలో ఉండాలనుకుంటే ఇంటిని అద్దెకు తీసుకోవడమే లాభం. అలాంటి చోట సొంతిల్లు సమకూర్చుకోవడానికి భారీ పెట్టుబడి కావాలి. దాంతో పోలిస్తే చాలా తక్కువకే అద్దె ఇల్లు వచ్చేస్తుంది. పైగా రోజూ ఇంటి నుంచి వెళ్లి వచ్చేందుకు ఎక్కువ సమయం పట్టదు. ఇంధన వ్యయాల భారం ఉండదు. విలువైన సమయం, వనరుల ఆదా అవుతాయి. సెలబ్రిటీలు ఇలా..సెలబ్రిటీలు మాధురి దీక్షిత్, కృతి సనన్ సొంతింటికి బదులు అదంట్లో ఉండడానికే ప్రాధాన్యమిస్తున్నారు. అభిషేక్ బచ్చన్ ముంబైలో ఒకే ప్రాజెక్టులో 6 అపార్ట్మెంట్లు కొన్నారు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
రెండుసార్లు ఎమ్మెల్యే అయినా అద్దె ఇంట్లోనే..
సాక్షి,యాదాద్రి: ఓ దఫా కౌన్సిలర్‌గా గెలిస్తే చాలు.. రూ.కోట్లు కూడగట్టేసుకుంటున్న నేటి రోజుల్లో ఏకంగా రెండుసార్లు ఎమ్మెల్యేగా చేసినా సొంతిల్లు కూడా కూడగట్టుకోలేని నిజాయితీకి నిలువుటద్దం కొమ్మిడి నర్సింహారెడ్డి. సర్పంచ్‌గా ప్రజా జీవితం ప్రారంభించి, సమితి ప్రెసిడెంట్‌గా, భువనగిరి ఎమ్మెల్యేగా రెండు దఫాలు సేవలందించిన కొమ్మిడి ప్రజా సమస్యలే ఎజెండాగా ఎంచుకున్న నిస్వార్థ రాజకీయనాయకుడు. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్నా మర్రి చెన్నారెడ్డి లాంటి వారి కోటరీలో ఉన్నా తనకంటూ ప్రత్యేకంగా ఆస్తిపాస్తులు సంపాదించుకోలేదు. చివరకు అద్దె ఇంట్లో ఉంటూ సాధారణ జీవితం గడుపుతున్న కొమ్మిడి ఆదర్శ ప్రస్థానం ఓసారి చూద్దాం రండి. ఎన్టీఆర్ ప్రభంజనాన్నీ ఎదుర్కొని గెలిచి.. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన కొమ్మిడి నర్సింహారెడ్డి భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో రెండు సార్లు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1962 నుంచి 1970 వరకు బ్రాహ్మణపల్లి గ్రామ సర్పంచ్‌గా పనిచేశారు. తొలిదశ తెలంగాణ పోరాటసమయంలో 1969లో బ్రాహ్మణ పల్లి సర్పంచ్‌గా ఉన్నారు. అనంతరం 1978 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ› నుంచి భువనగిరి ఎమ్మెల్యేగా గెలుపొందారు.1983లో ఎన్టీ.రామారావు టీడీపీ ప్రభంజనంలో కూడా ఆయన రెండవ సారి భువన గిరి ఎమ్మెల్యేగా గెలుపొందారు. డబ్బులు లేవని పోటీకి దూరం 1985 మధ్యంతర ఎన్నికల్లో కొమ్మిడి నర్సింహారెడ్డి ఎమ్మెల్యే ఎన్నికల నుంచి తప్పుకున్నారు. 1978 ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఆయన ఎన్నికల ఖర్చు సుమారు రూ.7 వేలు కాగా, రెండోసారి ఎన్నికల నాటికి ఆ ఖర్చు రూ.2 లక్షలకు పెరిగింది. మూడోసారి పోటీ చేసే అవకాశం ఉన్నా.. డబ్బు లేదని పోటీ నుంచి స్వచ్ఛందంగా విరమించుకున్నారు. ఆ ఎన్నికల్లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పోటీ చేయమని కోరినా కొమ్మిడి నర్సింహారెడ్డి సున్నితంగా తిరస్కరించారు. అప్పటి నుంచి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. పరిహారం వస్తే ఇల్లు కట్టుకుంటా నా సొంత భూమి బొల్లేపల్లి కాల్వ తవ్వడం కోసం ప్రభుత్వం తీసుకుంది. తీసుకున్న భూమికి పరిహారం డబ్బులు వస్తే ఇల్లు కట్టుకుంటా. ప్రస్తుతం అద్దె ఇంట్లో ఉంటున్నా. సీఎం, ఎమ్మెల్యేలు, కలెక్టర్లను కలిసి వినతి పత్రాలు ఇచ్చినా పరిహారం డబ్బులు అందడం లేదు. ప్రభుత్వం స్పందించి భూ పరిహారం డబ్బులు ఇప్పించాలి. – కొమ్మిడి నర్సింహారెడ్డి, మాజీ ఎమ్మెల్యే భూములను పేదలకు పంచారు బీబీనగర్ మండలం బ్రాహ్మణపల్లిలో తన వాటాగా వచ్చిన సాగు భూమిని నర్సింహారెడ్డి పేదలకు పంచారు. 83 సంవత్సరాల వయసులో సైతం ఆయన ఇప్పటికీ దీర్ఘకాలిక ప్రజా సమస్యలపై పోరాడుతున్నారు. భువనగిరి ప్రాంత సమస్యలతో పాటు రాష్ట్ర స్థాయి సమస్యలను ఎజెండాగా చేసుకుని పోరాటం కొనసాగిస్తున్నారు. గోదావరిపై ఇచ్చంపల్లి వద్ద బ్యారేజీ నిర్మాణం చేపట్టి భువనగిరి, ఆలేరు ప్రాంతాలకు సాగు నీరు అందించాలని ఆయన ఎన్నో పోరాటాలు చేశారు. గోదావరి నదీ జలాల సాధన, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లోని మూసీ పరీవాహక ప్రాంతంలో కాలుష్యం నివారణ, నిమ్స్, సీసీఎంబీ కోసం గతంలో ఆమరణ దీక్ష చేశారు. గతంలో స్కూటర్‌పైనే ప్రయాణం నిత్యం ప్రజా సమస్యలపై పోరాడే నర్సింహారెడ్డి వాహనం బజాజ్ చేతక్‌ను ఉపయోగించేవారు. వృద్ధాప్యం వల్ల ప్రస్తుతం స్కూటర్‌ను వాడడం లేదు. అప్పట్లో అసెంబ్లీ, సీఎం ఇల్లు, సచివాలయం, అధికారుల వద్దకు ఎక్కడికి వెళ్లినా ఆయన తన స్కూటర్ పైనే వెళ్లేవారు. జాతీయ స్థాయి నాయకుల నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు ఎందరితోనో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నప్పటికీ.. ఎప్పుడు తాను నమ్మిన సిద్ధాంతాన్ని వీడలేదు. తన ప్రజాసమస్యల పోరాట నావను ఆపలేదు. -
అద్దె భవనంలో ప్రపంచ కుబేరుడు 'జెఫ్ బెజోస్' - రీజన్ తెలిస్తే షాక్ అవుతారు!
ప్రపంచ కుబేరుల జాబితాలో ఒకరైన అమెజాన్ ఫౌండర్ 'జెఫ్ బెజోస్' (Jeff Bezos) ఇటీవల తన ప్రియురాలు లారెన్ శాంచెజ్‌తో ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు ఇతడు వేలకోట్ల ఆస్తిని పక్కన పెట్టి నెలకు సుమారు రూ. 5 కోట్లు రెంట్ చెల్లిస్తూ అద్దె ఇంట్లో ఉన్నట్లు తెలిసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనల్లో తెలుసుకుందాం. దాదాపు రూ. 12 లక్షల కోట్ల కంటే ఎక్కువ సంపద కలిగిన జెఫ్ బెజోస్ కాబోయే భార్యతో కలిసి కాలిఫోర్నియాలోని మాలిబు మాన్షన్‌లో ఉన్నట్లు సమాచారం. హాలీవుడ్ మ్యుజిషియన్ కెన్నీ జీ (Kenny G)కి చెందిన ఈ భవనం 5500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఈ భవనంలో రికార్డింగ్ స్టూడియో, స్విమ్మింగ్ పూల్ వంటి అనేక లగ్జరీ సదుపాయాలు ఉన్నాయి. దీనికి నెలకు 600000 డాలర్లు (ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ. 5 కోట్లు) అద్దె చెల్లిస్తున్నారు. ఇదీ చదవండి: లాంచ్‌కి ముందే 'సైబర్‌ట్రక్' డ్రైవ్ చేసిన మస్క్ - ఫోటో వైరల్ సముద్ర తీరంలో ఉన్న ఈ భవనంలో గత మార్చి నుంచి వీరిరువురు ఉంటున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా బెజోస్ ప్రస్తుతం ఒక విశాలమైన భవనం నిర్మించుకుంటున్నట్లు సమాచారం. అది పూర్తి కావడానికి ఇంకా కొంత సమయం పట్టే అవకాశం ఉంది. అప్పటివరకు అద్దె భవనంలోనే ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. నిజానికి జెఫ్ బెజోస్ 2018లో తన మాజీ భార్య 'మెకంజీ స్కాట్'కి విడాకులిచ్చి, పెద్ద మొత్తంలో భరణం కూడా చెల్లించాడు. ఆ తరువాత లారెన్ శాంచెజ్‌తో డేటింగ్ చేస్తున్నారు. కాగా వీరికి ఇప్పటికే నిశ్చితార్థం కూడా జరిగింది. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. పెళ్లి తరువాత కొత్తగా నిర్మించుకున్న భవనంలోకి మారనున్నట్లు సమాచారం. -
ఇల్లు కొనాలా.. అద్దెకు ఉండాలా..? దేనివల్ల అధిక ప్రయోజనం
సొంతంగా ఇల్లు సమకూర్చుకోవాలా..? లేదంటే అద్దె ఇంట్లో ఉంటే ప్రయోనమా? ఈ విషయంలో చాలా మంది అయోమయాన్ని ఎదుర్కొంటూ ఉంటారు. నిజానికి గణాంకాల సహితంగా తెలుసుకుంటే కానీ, తీరే సందేహం కాదు ఇది. అప్పు తీసుకుని అయినా ఇల్లు సమకూర్చుకోవాలని, అదే లాభదాయకమని కొందరు బలంగా నమ్ముతుంటారు. భూ మి ధర ఎప్పటికైనా పెరిగేదే కదా, దీనితో ఆస్తి విలువ ఇతోధికం అవుతుందని భావిస్తుంటారు. కానీ, గతంలో ఉన్నంతగా భూమి విలువ వృద్ధి ఇక ముందూ ఉంటుందని చెప్పలేం. అలాగే, సొంతిల్లు పనిచేస్తున్న ప్రదేశానికి సమీపంలో ఉంటుందని కూడా చెప్పలేం. ఇదే నిజమైతే కార్యాలయానికి వచ్చి వెళ్లేందుకు రోజూ అదనపు సమయం, ఇంధనం రూపేణా అధికంగా ఖర్చు చేయాల్సి వస్తుంది. అయినా కానీ, ఇల్లంటే నాలుగు గోడలు కాదు.. ఎన్నో జ్ఞాపకాలు, కలల నిలయం అని ఎక్కువ మంది చెబుతారు. కనుక సొంతింటి కలను రుణం రూపంలో నెరవేర్చుకుంటే లేదా అద్దె ఇంట్లో ఉంటే పన్ను కోణంలో ఉండే లాభ, నష్టాలను తెలుసుకుందాం. సొంతింటి కల.. రుణంపై సొంత ఇంటిని సమకూర్చుకుంటే మంచి పన్ను ఆదా ప్రయోజనాలు ‘ఆదాయపన్ను పాత విధానం’లో ఉన్నాయి. నెలవారీ చెల్లించే ఈఎంఐ మొత్తంలో అసలు, వడ్డీ రెండు భాగాలు. ఈఎంఐలో భాగంగా చెల్లించే రుణం అసలును సెక్షన్ 80సీ కింద క్లెయిమ్ చేయొచ్చు. అలాగే, ఇంటి కొనుగోలుకు చెల్లించిన స్టాంప్ డ్యూటీ చార్జీలు, రిజిస్ట్రేషన్ ఫీజులను కూడా సంబంధిత ఆర్థిక సంవత్సరంలో సెక్షన్ 80సీ కింద చూపించి పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని పొందొచ్చు. వడ్డీ విషయానికొస్తే.. కొనుగోలు చేసిన ఇంట్లోనే నివాసం ఉండేవారు ఇంటి రుణంపై చెల్లించే వడ్డీ భాగం ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ.2 లక్షల మొత్తంపై పన్ను చెల్లించక్కర్లేదు. అంటే ఆదాయంలో రూ.2 లక్షల మేర గృహ రుణానికి చెల్లిస్తున్న వడ్డీ కింద మినహాయింపు చూపించుకోవచ్చు. ఒకవేళ ఇంటిని అద్దెకు ఇచ్చినట్టయితే.. ఆ ఇంటి రుణానికి ఒక ఆర్థిక సంవత్సరంలో చెల్లించే వడ్డీతోపాటు ఆ ఇంటికి చెల్లించే మున్సిపల్ ట్యాక్స్, అద్దె ఆదాయంలో 30 శాతాన్ని స్టాండర్డ్ డిడక్షన్ కింద క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇక మొదటిసారి ఇంటిని కొనుగోలు చేసిన వారు అదనంగా రూ.1.5 లక్షల వడ్డీ చెల్లింపులను సెక్షన్ 80ఈఈఏ కింద పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. కాకపోతే సదరు రుణం 2019 ఏప్రిల్ 1 నుంచి 2022 మార్చి 31 మధ్య కాలంలో మంజూరై ఉండాలి. ఇంటి స్టాంప్ డ్యూటీ విలువ రూ.45లక్షలు మించకూడదన్నది షరతు. ఇప్పటి వరకు చెప్పుకున్న ప్రయోజనాలు ఆదాయపన్ను కొత్త విధానంలో లేవు. సెటాఫ్, క్యారీఫార్వార్డ్ రుణంపై కొనుగోలు చేసిన ఇంటిలో సొంతంగా నివసించే వారు అద్దె రూపంలో ఎలాంటి ఆదాయం లేనట్టయితే.. ఇంటి రుణంపై చెల్లించే వడ్డీని నష్టంగా చట్టం పరిగణిస్తుంది. దీన్ని వేతనం, ఇతర రూపాల్లో వచ్చే ఆదాయం కింద సర్దుబాటు చేసుకోవచ్చు. గరిష్టంగా రూ.2లక్షల మొత్తంపై పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. వడ్డీ మొత్తం ఇంతకంటే ఎక్కువ ఉంటే, ఆ నష్టాన్ని తదుపరి ఎనిమిది ఆర్థిక సంవత్సరాల్లో (క్యారీ ఫార్వార్డ్) ఇతర ఆదాయంతో సర్దుబాటు చేసుకునేందుకు అవకాశం ఉంది. ఒక వ్యక్తి రెండు కంటే ఎక్కువ ఇళ్లు కలిగి ఉంటే నోషనల్ రెంట్ అంశం తెరపైకి వస్తుంది. రెండు ఇళ్లనూ సొంతానికి వినియోగించుకుంటున్నారని అనుకుంటే, మిగిలిన ఇళ్లను అద్దెకు ఇచ్చినా ఇవ్వకపోయినా.. చట్టం కింద ఇచ్చినట్టుగానే పరిగణిస్తారు. మార్కెట్లో ఉన్న సగటు అద్దె ధరలపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అనుకూలతలు: అద్దె ఇంటితో పోలిస్తే సొంతిల్లు తీసుకోవడం వల్ల ఆస్తి సమకూరుతుంది. ఇంటి రుణానికి చేసే అసలు, వడ్డీ చెల్లింపులపై పన్ను మినహాయింపు ప్రయోజనాలు పొందొచ్చు. ప్రతికూలతలు: రుణంపై తీసుకున్నప్పటికీ, పన్ను చెల్లింపుదారుడు డౌన్ పేమెంట్ కింద తన వంతు వాటా కట్టాల్సి ఉంటుంది. ప్రాపర్టీ ట్యాక్స్‌లను ఏటా చెల్లించాలి. రిజిస్ట్రేషన్, స్టాంప్‌డ్యూటీ చార్జీలు అదనం. ఇంటికి మరమ్మతుల కోసం వెచ్చించాలి. విక్రయించాలంటే వెంటనే అమ్ముడుపోకపోవచ్చు. అంటే లిక్విడిటీ తక్కువ. ప్రాపర్టీ ధర పెరుగుతుందని, గణనీయంగా పెరుగుతుందని కచ్చితంగా చెప్పలేం. ఉద్యోగం లేదా ఆదాయం నిలిచిపోయినా రుణం, దానిపై వడ్డీ చెల్లించాల్సిందే. చిన్న ఇంటికి వెళ్లి అద్దె భారం తగ్గించుకునే అవకాశం ఉండదు. అద్దె ఇంట్లో ఉండే వారికి కంపెనీలు తమ ఉద్యోగులకు హౌస్ రెంట్ అలవెన్స్ (హెచ్ఆర్ఏ) ని వేతనంలో భాగంగా ఇస్తుంటాయి. ఈ భాగానికి పన్ను ప్రయోజనం ఉంటుంది. స్థూల పన్ను వేతనంలో గరిష్టంగా రూ.5,000 వరకు ఉంటుంది. కాకపోతే హెచ్ఆర్ఏకి పన్ను మినహాయింపు పొందాలంటే పనిచేస్తున్న కార్యాలయం ప్రాంతంలోనే సొంత ఇల్లు కలిగి ఉండకూడదనేది షరతు. పన్ను ప్రయోజనాలు: అద్దె ఇంట్లో ఉండేవారు, వేతనంలో భాగంగా పొందిన హెచ్ఆర్ఏపై పన్ను మినహాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చు. కాకపోతే, హెచ్ఆర్ఏపై పన్ను మినహాయింపునకు కొన్ని షరతులు ఉన్నాయి. మూల వేతనం, కరువు భత్యం మొత్తంలో 10 శాతం. లేదంటే ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నైలో నివసించే వారు వేతనంలో 50 శాతం, మిగిలిన పట్టణాల్లో నివసించే వారు 40 శాతాన్ని హెచ్ఆర్ఏ పన్ను మినహాయింపు కింద చూపించుకోవచ్చు. లేదా అసలు హెచ్ఆర్ఏ రూపంలో తీసుకున్న మొత్తం.. ఈ మూడింటిలో తక్కువ మొత్తంపైనే పన్ను మినహాయింపును క్లెయిమ్ చేసుకోవడానికి ఆదాయపన్ను చట్టం అనుమతిస్తుంది. అనుకూలతలు: రుణంతో ఇల్లు కొనుగోలు చేస్తే చెల్లించాల్సిన ఈఎంఐ కంటే, అద్దె ఇంటి కోసం చెల్లించే మొత్తం తక్కువగా ఉంటుంది. అద్దె ఇల్లు అయితే పనిచేసే ప్రాంతానికి అతి సమీపంలో లేదా కావాల్సిన చోట ఉండొచ్చు. సొంతిల్లు అయితే అందుబాటు ధర కోసం, పట్టణానికి వెలుపలి ప్రాంతాల్లో కొనుగోలు చేయాల్సి (ఎక్కువ మంది విషయంలో) వస్తుంది. అద్దె ఇ్లలు అయితే కోరుకున్నప్పుడు ఇల్లు మారిపోవడం సులభం. చెల్లించే అద్దెపై పన్ను మినహాయింపు తీసుకోవచ్చు. ప్రతికూలతలు: అద్దె ఇంట్లో ఉంటే ఆస్తి సమకూరదు. ఏటా అద్దె పెరుగుతూ ఉంటుంది. నచ్చినట్టుగా ఇంటిని నిర్మించుకోలేరు. ఇంటి యజమానికి నచ్చకపోయినా ఖాళీ చేయాల్సి వస్తుంది. ఎవరికి ఎలా ప్రయోజనం..? ఎక్స్ అనే వ్యక్తి స్థూల వార్షిక ఆదాయం రూ.20లక్షలు. నెలవారీగా అద్దె కింద రూ.30వేలు చెల్లిస్తున్నాడు. వై అనే వ్యక్తి వార్షిక ఆదాయం కూడా రూ.20 లక్షలే. కానీ, అతడు సొంత ఇంట్లో నివసిస్తున్నాడు. ఇంటి రుణంపై ఏటా రూ.3 లక్షలు వడ్డీ కింద, రూ.1.5 లక్షలు అసలు కింద చెల్లిస్తున్నాడు. ఇప్పుడు వీరికి నికర పన్ను భారం (ఆదాయపన్ను పాత విధానం కింద) ఎలా ఉంటుందని చూస్తే.. (పక్క బాక్స్‌లో) -
కరోనా ఎఫెక్ట్: ఆ కేటగిరి అద్దె ఇళ్లకు ఫుల్ డిమాండ్.. టూ కాస్ట్లీ గురూ!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఏడు పెద్ద పట్టణాల్లో ఖరీదైన ఇళ్ల అద్దెలు గడిచిన రెండేళ్లలో 8–18 శాతం మేర పెరిగాయని ప్రాపర్టీ కన్సల్టెంట్ అనరాక్ తెలిపింది. ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై మెట్రో పాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్), హైదరాబాద్, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, పుణె పట్టనాల్లో లగ్జరీ ఇళ్ల కొనుగోలు, అద్దెకు డిమాండ్ పెరిగినట్టు వెల్లడించింది. అత్యధికంగా ముంబైలోని వర్లి ప్రాంతంలో అద్దె 18 శాతం పెరిగింది. 2000 చదరపు అడుగుల విస్తీర్ణం గల ఖరీదైన భవంతి అద్దె 2020లో నెలవారీగా రూ.2 లక్షలు ఉంటే, అది రూ.2.35 లక్షలు అయింది. బెంగళూరు జేపీ నగర్లో అద్దె రెండేళ్లలో 13 శాతం పెరిగి రూ.52,000 అయింది. రాజాజీ నగర్లో కిరాయి 16 శాతం పెరిగి రూ.65,000కు చేరింది. ప్రముఖ లగ్జరీ హౌసింగ్ మార్కెట్లలో అద్దెలు గత రెండేళ్లలో రెండంకెల్లో పెరిగినట్టు అనరాక్ చైర్మన్ అనుజ్‌పురి తెలిపారు. కరోనా రెండో విడత తర్వాత పెద్ద సైజు ఇళ్లకు ప్రాధాన్యాత పెరిగినట్టు చెప్పారు. చెన్నైలోని అన్నా నగర్లో సగటు నెలవారీ అద్దె 13 శాతం పెరిగి రూ.63,000 అయింది. కొట్టు పురంలో 14 శాతం పెరిగి రూ.84,000కు చేరింది. హైదరాబాద్‌లో 15 శాతం భాగ్యనగరంలోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో 2,000 చదరపు అడుగుల ఇంటి నెలవారీ అద్దె రెండేళ్లలో 15 శాతం పెరిగి రూ.62,000 అయింది. ఇదే సమయంలో చదరపు అడుగు ధర 6 శాతం పెరిగి రూ.7,400కు చేరింది. హైటెక్ సిటీ ప్రాంతంలో సగటు నెలవారీ అద్దె 11 శాతం పెరిగి రూ.59,000 అయింది. చదవండి: భారీ నౌక, రూ.8,318 కోట్ల ఖర్చు.. తొలి ప్రయాణం కూడా కాకముందే తునాతునకలు! -
హైదరాబాద్‌లో దారుణం.. ఇల్లు అద్దెకు ఇస్తానంటూ యువతిని బంధించి..
సాక్షి, హైదరాబాద్: నగరంలోని చాదర్‌ఘాట్‌లో దారుణం చోటు చేసుకుంది. ఇంటి అద్దె పేరుతో యువతిపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఇల్లు అద్దెకు ఇస్తానంటూ ఇంట్లోకి తీసుకెళ్లిన యువకుడు.. యువతిని నగ్నంగా బంధించాడు. ప్రతిఘటించిన ఆ యువతి.. గట్టిగా కేకలు వేసింది. అరిస్తే లైంగిక దాడి చేస్తానంటూ యువకుడు బెదిరింపులకు దిగాడు. చాదర్ ఘాట్ పోలీస్ స్టేషన్లో బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: హైదరాబాద్: చికెన్ బిర్యానీలో బల్లి.. కంగుతున్న కార్పొరేటర్ -
‘ఇల్లు అద్దెకు ఇస్తే నన్నే బయటికి గెంటేశారు’
అనంతపురం రూరల్: నమ్మి ఇల్లు బాడుగకు ఇస్తే ఖాళీ చేయకుండా తననే బయటికి గెంటేశాడని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. రుద్రంపేటకు చెందిన జమ్మటపాటి శాంతమ్మ తనకు జరిగిన అన్యాయాన్ని ఆదివారం విలేకరులకు వెల్లడించింది. ఆమె తెలిపిన వివరాల మేరకు.. రుద్రంపేట గ్రామ సర్వే నెంబర్ 82–3బీలోని 3 సెంట్లలో శాంతమ్మకు రేకుల షెడ్డు ఉంది. 2002లో సూర్యనారాయణరెడ్డి అనే వ్యక్తి కుటుంబంతో కలసి ఇంటిని బాడుగకు తీసుకున్నాడు. ఇటీవల సూర్యనారాయణరెడ్డి తీరుపై శాంతమ్మ కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి ఇల్లు ఖాళీ చేయాలని కోరారు. అయితే, ‘ఈ ఇంటికీ మీకు ఎలాంటి సంబంధమూ లేదు, నా పేరు పైనే కరెంట్ మీటర్ ఉంది, ఇంటి పన్ను చెల్లిస్తున్నా, సర్వ హక్కులు నాకే ఉన్నాయి మీకు ఇష్టం వచ్చింది చేసుకోండి.. ఖాళీ చేసే ప్రసక్తే లేద’ని తెగేసి చెప్పాడు. దీంతో శాంతమ్మ కుటుంబసభ్యులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. స్థలాల ధరలు పెరగడంతో తమకు తెలియకుండానే నకిలీ పత్రాలు సృష్టించి కరెంట్ మీటర్ ఏర్పాటు చేసుకోవడంతో పాటు ఇతరులకు సంబంధించిన డోర్ నెంబర్‌పై పన్ను కడుతున్నాడని శాంతమ్మ ఆరోపించింది. పంచాయతీ అధికారులను సంప్రదిస్తే నకిలీ డోర్ నెంబర్ పై పన్ను చెల్లిస్తున్నాడని వారు తేల్చారంది. స్థలంపై ఆశలు వదులుకోకపోతే అంతు చూస్తానని బెదిరిస్తున్నాడని, ఉన్నతాధికారులైనా స్పందించి న్యాయం చేయాలని కోరుతోంది. -
అడ్డగోలు ఇల్లు కిరాయి.. వారం రోజులకే రూ.10 వేలు..అయినా కష్టమే?
సాక్షి, కరీంనగర్: హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచారంతో అద్దెకుండే వారికి ఇళ్లు కరువయ్యాయి. కళాకారులు, కార్యకర్తలు, నేతలు, అనుచరులు ఉండేందుకు ఇళ్లకు విపరీత డిమాండ్ పెరిగింది. పోలింగ్ ముందు వరకు ఉండేందుకు కేవలం వారం రోజుల వ్యవధికే రూ.10వేల కిరాయి చెల్లిస్తున్నారు. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులతో పాటు ఇతర వర్గాలంతా ఇక్కడే బస చేస్తుండటంతో ఒక్కసారిగా గృహ యజమానులకు డిమాండ్ ఏర్పడింది. హుజూరాబాద్ పట్టణంలో ఇళ్లు దొరకకపోవడంతో ఇప్పల నర్సింగపూర్, సింగపూర్ గ్రామాల్లో అద్దె ఇళ్ల కోసం అన్వేషిస్తున్నారు. చదవండి: సెక్షన్ 49 పీ: మీ ఓటును మరెవరైనా వేశారా? వెంటనే ఇలా చేయండి.. కాగా మరో ఏడు రోజుల్లో అంటే ఈ నెల 30 న హుజురాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ జరుగనుంది. నవంబర్2న ఓట్లు లెక్కించి ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ ఎన్నికలో ప్రముఖంగా మూడు పార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ హోరాహోరీగా ప్రచారం కొనసాగిస్తున్నాయి. ఇక బీజేపీ నుంచి ఈటల రాజేందర్, టీఆర్ఎస్ నుంచి గెల్లు శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ నుంచి బల్మూరి వెంకట్లో బరిలో నిలిచిన విషయం తెలిసిందే. చదవండి: అనగనగా.. ఓ ఈవీఎం.. దీని జీవితకాలమెంతో తెలుసా? -
Covid-19 : 'అద్దె ఇంట్లో ఉండలేం బాబోయ్..సొంతిల్లే కొనుక్కుంటాం'
కరోనాకి ముందు సొంత ఇళ్లను కొనుగోలు చేసే సాహసం చేయలేదు.కానీ ఈ మహమ్మారి దెబ్బకు యువతరం మునుపెన్నడూ లేనంతగా సొంత ఇంటి కొనుగోలువైపు మొగ్గుచూపుతున్నారు. సొంత ఇల్లు కొనే స్థోమత లేక అద్దె ఇంట్లో కాలం వెళ్లదీస్తున్న చాలామంది సొంతంగా ఇల్లు కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నట్లు ప్రాపర్టీ కన్సల్టెంట్ సంస్థ అనరోక్ వెల్లడించింది. ఆ సంస్థ విడుదల చేసిన నివేదిక ఆధారంగా.. 2018 కంటే 2019 మొదటి మూడు త్రైమాసికాలలో 7నగరాల్లో దాదాపు 2.02లక్షల యూనిట్ల ఇళ్లు అమ్మకాలు జరిగి, దీంతో ఇళ్ల అమ్మకాలు 13% పెరిగాయి. 2016 లో ఇది 2.07లక్షల యూనిట్లుగా ఉందని అనరోక్ తన నివేదికలో పేర్కొంది. కరోనా కారణంగా అన్ని వ్యాపారాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. కానీ అనూహ్యంగా రియల్ ఎస్టేట్ రంగం నెలల్లోనే పుంజుకుందని, మొదటి అన్ లాక్ చేసిన కొద్ది నెలల్లోనే అమ్మకాలు సాధారణ స్థాయికి చేరుకున్నట్లు తెలుస్తోంది. మహమ్మారి విజృంభించినా 2020 సెప్టెంబరులో భారత గృహనిర్మాణ రంగం 65% నుంచి 79% వరకు పుంజుకుందని అనరోక్ ప్రతినిధులు వెల్లడించారు. "కరోనావైరస్ మహమ్మారి అమ్మకాలు కేవలం 12,730 యూనిట్లకు తగ్గిందని, అయితే ఇది మునుపటి త్రైమాసికంతో పోలిస్తే అమ్మకాలు గణనీయంగా పెరిగాయని తెలిపింది. కరోనా కారణంగా అద్దె ఇంట్లో నివసించేవారు అనేక సవాళ్లను ఎదుర్కొన్నారని, దీంతో అద్దె ఇల్లు కంటే సొంత ఇల్లే మంచిదనే నిర్ణయానికి వచ్చినట్లు అనరోక్ నివేదికలో తేల్చింది. ఇక్కడ విచిత్రం ఏంటంటే మహమ్మారి దేశాన్ని వణికిస్తున్నా పెద్ద ఇళ్లకు, 3 బీహెచ్ కే ఇళ్లకు భారీగా డిమాండ్ పెరిగింది. కరోనా వల్ల ఎక్కువ మందికి ఇండ్లకే పరిమితం అవుతున్నారు. ఆఫీస్ వర్క్, లేదంటే కుటుంబసభ్యులతో గడపడం, వ్యాయామాలు ఇలా ఇతరాత్ర కారణాల వల్ల పెద్ద ఇళ్లను కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నట్లు తెలుస్తోంది. మరో ప్రాపర్టీ సంస్థ ప్రాప్‌టైగర్ డేటా ల్యాబ్స్ ప్రకారం.. 2020 మొదటి త్రైమాసికంలో 3 బీహెచ్ కే కేటగిరీలోని 15,998 యూనిట్లు అమ్ముడు కాగా ఆ సంఖ్య కాస్త పెరిగి 2021 మొదటి త్రైమాసికంలో 17,200 యూనిట్లకు అమ్ముడైనట్లు ప్రాప్ టైగర్ డేటా ల్యాబ్స్ నివేదికలో తేలింది. చదవండి : రియల్టీ @ లక్ష కోట్ల డాలర్లు -
షాకింగ్: ఇంట్లో పాములు.. అద్దెకే దిక్కులేదన్న ఓనర్!
టిబిలిసి: సాధారణంగా ఇంట్లో బల్లులో, బొద్దింకలో కనిపిస్తేనే భయపడిపోతాం. అలాంటిది.. ఇంటి సీలింగ్‌పై నుంచి పాములు వేలాడుతూ కనిపిస్తే ఎలా ఉంటుంది?. గుండె జల్లుమంటుంది. జార్జీయాకు చెందిన హ్యారీ పగ్లీస్ అనే వ్యక్తి ఓ అద్దె ఇంట్లో భార్య, పిల్లలతో నివసిస్తున్నాడు. అయితే వర్షం పడిన ప్రతిసారి వాన నీరు ఇంట్లో కురిసేది. అదే విషయాన్ని ఇంటి యజమానికి చెప్పాడు. కానీ ఇంటి యజమానురాలు పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో హ్యారీ ఇంట్లో ఉండగా వర్షం పడి ఇంటి పెచ్చులూడి కిందపడిపోయాయి. పెచ్చులూడిన ప్రాంతం నుంచి ఎలుకలో, బల్లులో కనిపిస్తే పట్టించుకోనే వాడు కాదేమో. కానీ పాములు వేలాడుతూ కనిపించడంతో ప్రాణ భయంతో పరిగెత్తుకుంటూ ఆ ఇంటి ఓనర్‌తో మొరపెట్టుకున్నాడు. ‘మేడమ్ ఇంటి సీలింగ్ ఊడింది. ఇంట్లో పాములు వేలాడుతున్నాయి. వెంటనే ఆ పాముల్ని తీయించండి’ అని కోరాడు. అందుకు ఆ ఇంటి యజమానురాలు.. ఆ పాముల్ని అక్కడి నుంచి తీయాలంటే సంబంధిత అధికారుల అనుమతి తీసుకోవాల్సి ఉందని చెప్పింది. దీంతో హ్యారీ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అధికారులు బాధితుడి ఇంట్లో పాముల్ని తీసేందుకు సిద్దమయ్యారు. అందుకు ఆ ఇంటి యజమానురాలు ఒప్పుకోలేదు. ‘హ్యారీ ఇంటి అద్దెకే దిక్కులేదు నీకు. రెండు నెలల నుంచి అద్దె కట్టడం లేదు. ఇంటి అద్దె కడితే పాముల్ని అక్కడి నుంచి తీయించేస్తా’ అని ఆమె తెగేసి చెప్పింది. అలాగే రెండు రోజుల పాటు కంటి మీద కునుకు లేకుండా గడిపాడు. చివరికి ఇంటి యజమానురాలి తీరుతో ఏం చేయాలో పాలుపోని బాధితుడు హ్యారీ తనకు జరిగిన అన్యాయాన్ని నెటిజన్లతో పంచుకున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చదవండి : లక్షలతో కాదు, ఒక్క ఫోన్ కాల్ తో కరోనా పేషెంట్లను బ్రతికిస్తున్నాడు SNAKES IN THE ROOF! A LaFayette man says there are snakes in his rental home. Harry Pugliese says problems have persisted at this house on East Villanow Street since February, but the landlord won't fix them. pic.twitter.com/ukVUOStzUm — Bliss ZechmanNC9 (@BlissZechman) May 25, 2021 -
చనిపోతే అరిష్టమని..
కాజీపేట: తన ఇంట్లో అద్దెకు ఉన్న ఓ వృద్ధురాలు చనిపోతే అరిష్టమని భావించి ఓ యజమానురాలు బయటకు గెంటేసింది. తీవ్ర ఒత్తిడికి గురైన వృద్దురాలు రోడ్డుపైనే తనువు చాలించింది. ఈ సంఘటన వరంగల్ అర్బన్ జిల్లా ధర్మసాగర్ మండలం పెద్దపెండ్యాల గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. రసూల్‌బీ (67) కొన్నేళ్లుగా పెద్దపెండ్యాలలోని అద్దె ఇంట్లో ఉంటోంది. వారం క్రితం అస్వస్థతకు గురైన ఆమె ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. అయితే ఇంట్లో చనిపోతే అరిష్టంగా భావించిన ఇంటి యజమానురాలు.. రసూల్‌బీని మంచంతో సహా బయట పడేసింది. ఈ విషయం తెలుసుకున్న సహృదయ ఆశ్రమ నిర్వాహకులు యాఖూబీ, ఛోటులు వృద్ధురాలిని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించడానికి అంబులెన్స్‌ను సిద్ధం చేస్తున్న క్రమంలో రసూల్‌బీ తుది శ్వాస విడిచింది. ఆమెకు ఎవరూ లేకపోవడంతో శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆశ్రమ నిర్వాహకురాలు తెలిపారు. -
అద్దె ఇంటి నుంచి సీఎం బంగ్లాలోకి...
ఛంఢీఘడ్: అద్దె ఇంటిలో నుంచి సీఎం బంగ్లాలోకి హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టార్ అడుగుపెట్టనున్నారు. ఇప్పటి వరకు హర్యానాలోని కర్నల్ పట్ఠణంలోని న్యూ ప్రేమ్ నగర్ లో ఓ అద్దె ఇంటిలో నివాసం ఉంటున్నారు. తమ మధ్య ఉంటున్న వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం న్యూ ప్రేమ్ నగర్ వాసుల్ని ఆశ్చర్యానికి, ఆనందానికి గురిచేస్తోంది. హర్యానా రాష్ట్రానికి 10వ ముఖ్యమంత్రిగా ఆదివారం పదవీ స్వీకారం చేసిన మనోహర్ లాల్ ఖట్టార్ అవివాహితుడు. న్యూ ప్రేమ్ నగర్ లోని మూడు పడకల ఫ్లాట్ లో నివాసముంటున్న ఖట్టార్ త్వరలోనే చంఢీఘడ్ లోని సెక్టర్ 3 లో అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లున్న బంగ్లాలోకి మారనున్నారు. ఎన్నికల అఫిడవిట్ లో తాను ట్యూషన్ వర్క్, వ్యవసాయం చేస్తున్నట్టు ఆయన దాఖలు చేశారు. ఆదాయపు పన్ను రిటర్న్ ప్రకారం ఖట్టార్ ఆదాయం 273,315 రూపాయలుగా వెల్లడించారు. -
హమ్మయ్య... ఇల్లు దొరికింది!!
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్‌కు ఎట్టకేలకు ఓ ఇల్లు దొరికింది. అద్దె ఇంటి కోసం ఆయన గత కొన్నాళ్లుగా తీవ్రంగా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఉత్తర ఢిల్లీలోని సివిల్ లైన్స్ ఏరియాలో ఆయనకు ఇప్పుడు ఓ ఇల్లు దొరికింది. దీంతో వచ్చే నెల మొదటివారంలోనే ఆయన తన అధికారిక నివాసమైన తిలక్ లేన్ ఇంటిని ఖాళీ చేస్తారని తెలుస్తోంది. నరేన్ జైన్ అనే ఆయన తనకు ఇల్లు ఇచ్చారని, అందుకు ఆయనకు కృతజ్ఞతలని కేజ్రీవాల్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలిపారు. కాంగ్రెస్ మాజీ ఎంపీ భుకు రాం జైన్ కుమారుడే ఈ నరేన్ జైన్. ఈయనకు ఢిల్లీలో అనేక ఆస్తులున్నాయి. వాటిని అద్దెలకు ఇస్తూ ఉంటారు. ఈ ఇంటిని అద్దెకు ఇవ్వాల్సిందిగా తన బ్రోకర్‌కు చెప్పానని, చివరకు అది కేజ్రీవాల్‌కే వెళ్లిందని నరేన్ జైన్ తెలిపారు. ఈ ఇంట్లో నాలుగు బెడ్రూంలు, నాలుగు బాత్రూంలు, ఒక కిచెన్, డైనింగ్ రూం, హాలు ఉన్నాయి. ఇంటిముందు, వెనక భాగాల్లో చిన్న చిన్న తోటలు కూడా ఉన్నాయి. వాస్తవానికి ఇది ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీ తండ్రిది. కానీ, ఆయన 1960లలోనే అమ్మేశారు. తర్వాత 2005లో జైన్ దీన్ని కొన్నారు. సాధారణంగా అయితే ఈ ఇంటికి నెలకు 50 వేల నుంచి 60 వేల వరకు అద్దె ఉంటుందని జైన్ చెప్పారు. అయితే, గత తొమ్మిదేళ్లుగా ఇది ఖాళీగా ఉన్నందున చాలా మరమ్మతులు చేయాల్సి ఉందని, వాటికి కనీసం 15 రోజులు పడుతుందని అన్నారు. I have finally decided upon a house offered by Sh Naren Jain in Civil Lines area. Thanks Naren ji. — Arvind Kejriwal (@ArvindKejriwal) June 20, 2014 -
విజ్ఞాన భాండాగారాలైన గ్రంథాలయాలు
ఒంగోలు కల్చరల్, న్యూస్‌లైన్: విజ్ఞాన భాండాగారాలైన గ్రంథాలయాలు సమస్యల నిలయాలుగా మారుతున్నాయి. అద్దె భవనాల్లో.. అరకొర వసతుల మధ్య కునారిల్లుతున్నాయి. జిల్లాలోని గ్రంథాలయాల స్థితిగతులను ‘న్యూస్‌లైన్’ బృందం ఆదివారం పరిశీలించింది. జిల్లాలో పెరుగుతున్న పాఠకుల సంఖ్యకు తగినట్లుగా కొత్త గ్రంథాలయాలు ఏర్పాటుకావడంలేదు. గ్రంథాలయాల వల్ల ఆదాయం లేకపోవడంతో ప్రభుత్వం కూడా వీటి అభివృద్ధిపై ఉదాసీనత కనబరుస్తోంది. తగినంతమంది సిబ్బంది లేకపోవడం, నూతన నియామకాలకు ప్రభుత్వం అనుమతి అంతగా ఇవ్వకపోవడం వంటి కారణాల వల్ల సిబ్బంది కొరత ఏర్పడి పలు గ్రంథాలయాలు మూతపడుతున్నాయి. పేరుకుపోతున్న పన్ను బకాయిలు: గ్రంథాలయాలు నడవడానికి పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల నుంచి వచ్చే సెస్ ముఖ్యాధారం. సిబ్బంది ఉదాసీనత వల్ల పన్ను బకాయిల వసూలు మందగిస్తోంది. దీంతో గ్రంథాలయాలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. గత ఏడాది * 1.20 కోట్ల సెస్సు వసూలుకాగా, ఈ ఏడాది వసూలు మందగించింది. మైనర్ పంచాయతీల నుంచి సెస్సు వసూలు బాగా పడిపోయింది. వీటి నుంచి * 60 లక్షల దాకా బకాయిలు వసూలు కావలసి ఉంది. అయితే మార్చి వరకు సమయం ఉన్నందున సెస్సు బకాయిల వసూలు కొంత ఆశాజనకంగానే ఉండవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. పుస్తకాల కొనుగోలు కూడా ఏటా నిర్ణీత సమయంలో కాకుండా కొన్నేళ్లకు ఒకసారి జరుపుతుండడంతో పాతపుస్తకాలే పాఠకులకు దిక్కవుతున్నాయి. ఇటీవలి కాలంలో కొంత ధోరణి మార్చుకుని పోటీపరీక్షల పుస్తకాల కొనుగోలుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రతిదానికీ హైదరాబాద్‌లోని పౌర గ్రంథాలయ అధికారుల అనుమతి అవసరమవుతుండడంతో ఒక్కోసారి తీవ్రజాప్యం చోటుచేసుకుంటోంది. జిల్లాలో 66 శాఖా గ్రంథాలయాలుండగా వీటిలో ప్రస్తుతం 64 మాత్రమే పనిచేస్తున్నాయి. సంతరావూరు, ముండ్లమూరు లైబ్రరీలు మూతపడ్డాయి. గ్రామీణ గ్రంథాలయాలు 12 పనిచేస్తున్నాయి. బుక్‌డిపాజిట్ సెంటర్లు 70 ఉన్నాయి. శాఖా గ్రంథాలయాలు లేనిచోట్ల బుక్‌డిపాజిట్ సెంటర్లను నిర్వహిస్తున్నారు. అద్దె భవనాల్లోనే... జిల్లాలో 22 గ్రంథాలయాలకు మాత్రమే సొంత భవనాలున్నాయి. 15 అద్దె భవనాల్లో, మిగిలినవి ఉచిత భవనాల్లో నిర్వహిస్తున్నారు. కొరిశపాడు, పర్చూరు, కనిగిరి, కొండపి, మార్కాపురం గ్రంథాలయాలకు 2013-14 సంవత్సరంలో సొంత భవనాలు నిర్మించారు. కనిగిరి, మార్కాపురం లైబ్రరీలలో అదనపు నిర్మాణాల కోసం ప్రతిపాదనలు పంపారు. యర్రగొండపాలెం, త్రిపురాంతకం, పొదిలి, హనుమంతునిపాడు గ్రంథాలయాలకు సొంత భవనాల నిర్మాణానికి ప్రతిపాదనలు ఉన్నతాధికారుల అనుమతి కోసం పంపారు. పామూరు, దర్శి, పొన్నలూరు గ్రంథాలయాలకు స్థలం కేటాయిస్తే సొంత భవనాలు నిర్మించేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. సిబ్బంది కొరత.. జిల్లా గ్రంథాలయ సంస్థలో పలు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గ్రంథాలయాలు ఉదయం 8 నుంచి 11 వరకు, సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు పనిచేయాల్సి ఉంది. సిబ్బంది కొరత వల్ల ఒక్కో గ్రంథపాలకుడికి రెండు, మూడు గ్రంథాలయాల బాధ్యతలను అప్పగించడంతో అవి వారంలో ఒకటి రెండు రోజులు మాత్రమే తెరుచుకుంటున్నాయి. ఇటీవల ప్రభుత్వం 6 అటెండర్ల పోస్టులతోపాటు 3 లైబ్రేరియన్ల పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది. జిల్లా కలెక్టరు నుంచి అనుమతి రాగానే ఈ పోస్టుల భ ర్తీ ప్రక్రియ ప్రారంభించే అవకాశం ఉంది. పోటీ పరీక్షల సీజన్ కావడంతో పాఠకులు గ్రంథాలయాలకు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. దీనిని కూడా అధికారులు దృష్టిలో పెట్టుకోవాలి. కనీస వసతులేవీ... అనేకచోట్ల వసతుల లేమి పాఠకులను తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. కొన్ని గ్రంథాలయాల్లో కనీసం సరైన ఫర్నిచరు లేదు. కరెంటు సౌకర్యం లేనివి కూడా ఉన్నాయి. పాఠకులకు మంచినీటి వసతి దాదాపు శూన్యం. టాయిలెట్ సౌకర్యం అనేక చోట్ల లేదు. ముఖ్యంగా మహిళా పాఠకులకు అవసరమైన సౌకర్యాలు పలు గ్రంథాలయాల్లో లేవు. దీంతో వారు ఆ గ్రంథాలయాలకు వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు. పలుచోట్ల గ్రంథాలయాధికారులు సరిగా విధులకు హాజరుకావడం లేదనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. వీటన్నింటినీ చక్కదిద్ది పాఠకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉంది. అదనపు పుస్తకాల రాక... రాజా రామ్మోహన్రాయ్ లైబ్రరీ ఫౌండేషన్ నుంచి ఇటీవల 800 రకాల పుస్తకాలకు సంబంధించి 3200 ప్రతులు వచ్చాయి. వీటిని జిల్లాలోని ఇతర గ్రంథాలయాలకు పంపే యత్నాలను అధికారులు చేపట్టారు. ఆన్లైన్ నమోదు సౌకర్యం... పాఠకులు తమకు కావలసిన పుస్తకాన్ని ఇంతకాలం గ్రంథాలయాల్లోని రిజిస్టర్లలో నమోదు చేసుకోవలసి వచ్చేది. ఈ పద్ధతికి పౌర గ్రంథాలయ ఉన్నతాధికారులు స్వస్తి పలికి ఆనలైన్లో నమోదు చేసుకునే అవకాశాన్ని నూతనంగా కల్పించారు. పాఠకులు ఇకనుంచి ్చఞఞఠఛజీఛిజీఛట్చటజ్ఛీట.జీఛి.జీ అనే దానిలో నమోదు చేసుకుంటే ఆ పుస్తకాన్ని కొనుగోలు చేసి సరఫరా చేస్తారు. ఈ వినూత్న విధానాన్ని పాఠకులు, ఉద్యోగార్థులు సద్వినియోగం చేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. సౌకర్యాల కల్పనకు కృషి ఆర్సీహెచ్ వెంకట్రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి జిల్లా గ్రంథాలయ సంస్థను అభివృద్ధి పథంలో పయనింపచేసేందుకు చర్యలు చేపడుతున్నాం. అద్దె భవనాల్లో నడుస్తున్న వాటికి సొంత భవనాలు ఏర్పాటుకు కృషి చేస్తున్నాం. ఖాళీల భర్తీకి చర్యలు చేపడుతున్నాం. డ్వాక్రా బజారులోని బాలల గ్రంథాలయాన్ని వేరే చోటకు మారుస్తాం. సెస్ బకాయిల వసూలుపై దృష్టి సారించాం.