అద్దె ఇంటి నుంచి సీఎం బంగ్లాలోకి...
అద్దె ఇంటి నుంచి సీఎం బంగ్లాలోకి...
Published Sun, Oct 26 2014 3:21 PM | Last Updated on Sat, Sep 2 2017 3:25 PM
ఛంఢీఘడ్: అద్దె ఇంటిలో నుంచి సీఎం బంగ్లాలోకి హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టార్ అడుగుపెట్టనున్నారు. ఇప్పటి వరకు హర్యానాలోని కర్నల్ పట్ఠణంలోని న్యూ ప్రేమ్ నగర్ లో ఓ అద్దె ఇంటిలో నివాసం ఉంటున్నారు. తమ మధ్య ఉంటున్న వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం న్యూ ప్రేమ్ నగర్ వాసుల్ని ఆశ్చర్యానికి, ఆనందానికి గురిచేస్తోంది.
హర్యానా రాష్ట్రానికి 10వ ముఖ్యమంత్రిగా ఆదివారం పదవీ స్వీకారం చేసిన మనోహర్ లాల్ ఖట్టార్ అవివాహితుడు. న్యూ ప్రేమ్ నగర్ లోని మూడు పడకల ఫ్లాట్ లో నివాసముంటున్న ఖట్టార్ త్వరలోనే చంఢీఘడ్ లోని సెక్టర్ 3 లో అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లున్న బంగ్లాలోకి మారనున్నారు. ఎన్నికల అఫిడవిట్ లో తాను ట్యూషన్ వర్క్, వ్యవసాయం చేస్తున్నట్టు ఆయన దాఖలు చేశారు. ఆదాయపు పన్ను రిటర్న్ ప్రకారం ఖట్టార్ ఆదాయం 273,315 రూపాయలుగా వెల్లడించారు.
Advertisement
Advertisement