సాక్షి, కరీంనగర్: హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచారంతో అద్దెకుండే వారికి ఇళ్లు కరువయ్యాయి. కళాకారులు, కార్యకర్తలు, నేతలు, అనుచరులు ఉండేందుకు ఇళ్లకు విపరీత డిమాండ్ పెరిగింది. పోలింగ్ ముందు వరకు ఉండేందుకు కేవలం వారం రోజుల వ్యవధికే రూ.10వేల కిరాయి చెల్లిస్తున్నారు. టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులతో పాటు ఇతర వర్గాలంతా ఇక్కడే బస చేస్తుండటంతో ఒక్కసారిగా గృహ యజమానులకు డిమాండ్ ఏర్పడింది. హుజూరాబాద్ పట్టణంలో ఇళ్లు దొరకకపోవడంతో ఇప్పల నర్సింగపూర్, సింగపూర్ గ్రామాల్లో అద్దె ఇళ్ల కోసం అన్వేషిస్తున్నారు.
చదవండి: సెక్షన్ 49 పీ: మీ ఓటును మరెవరైనా వేశారా? వెంటనే ఇలా చేయండి..
కాగా మరో ఏడు రోజుల్లో అంటే ఈ నెల 30 న హుజురాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ జరుగనుంది. నవంబర్2న ఓట్లు లెక్కించి ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ ఎన్నికలో ప్రముఖంగా మూడు పార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. బీజేపీ, టీఆర్‌ఎస్, కాంగ్రెస్ హోరాహోరీగా ప్రచారం కొనసాగిస్తున్నాయి. ఇక బీజేపీ నుంచి ఈటల రాజేందర్, టీఆర్‌ఎస్ నుంచి గెల్లు శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ నుంచి బల్మూరి వెంకట్‌లో బరిలో నిలిచిన విషయం తెలిసిందే.
చదవండి: అనగనగా.. ఓ ఈవీఎం.. దీని జీవితకాలమెంతో తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment