
హీరోయిన్ హన్సిక త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. తన స్నేహితుడు, వ్యాపార భాగస్వామి సోహెల్ ఖతూరియాతో డిసెంబర్‌లో ఏడడుగులు వేయబోతోంది. ఇటీవల హన్సిక కాబోయే భర్తను కూడా పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ప్యారిస్‌లో ఈఫిల్ టవర్ వద్ద రొమాంటిక్ డేట్‌లో ప్రియుడు ప్రపోజ్ చేసిన ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ షేర్ చేసి తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చింది. ఇక అప్పటి నుంచి హన్సిక, ఆమె కాబోయే భర్త గురించిన పలు ఆసక్తిక విషయాలు వార్తల్లో నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి హన్సిక ఆమె ప్రియుడు వార్తల్లోకెక్కారు. వీరిద్దరి పర్సనల్ ఫొటో ఒకటి తాజాగా లీకైంది.
చదవండి: చివరి రోజుల్లో ‘మహానటి’ సావిత్రికి సెట్‌లో అవమానం, అన్నం కూడా పెట్టకుండా..
దీంతో ఈ ఫొటో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. వీరిద్దరూ బోట్‌లో సరదాగా షికారుకు వెళ్తూ కనిపించారు. hansika.officiaal అనే పేరుతో ఉన్న ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి ఈ ఫొటోను షేర్ చేశారు. దీనిపై హన్సిక స్పందిస్తూ ఇది తన అకౌంట్ కాదని, ఫేక్ అకౌంట్ అని క్లారిటీ ఇచ్చింది. అంతేకాదు ఈ ఫొటో తను షేర్ చేసింది కాదని కూడా స్పష్టం చేసింది. దీంతో ఆమె ఫాలోవర్స్, నెటిజన్లు హన్సిక, సోహెల్ పిక్‌పై క్యూట్ కపుల్ అంటూ రకరకాల కామెంట్స్‌తో స్పందిస్తున్నారు. కాగా రాజస్థాన్ జైపూర్‌లోని ఓ రాజకోటలో డిసెంబర్ 4న వీరి వివాహం అంగరంగ వైభవంగా జరగనుంది. డిసెంబర్ 2 నుంచి వివాహ వేడుకలు ప్రారంభం కానున్నాయి.
చదవండి: రెండు ఓటీటీల్లోకి రానున్న ఊర్వశివో రాక్షసివో, స్ట్రీమింగ్ అప్పుడే
Comments
Please login to add a commentAdd a comment