
సాక్షి, మిర్యాలగూడ: తన మిత్రులతో కలిసి నరహరి అనే విద్యార్థి డెహాడూన్‌కు వెళ్లాడు. గంగోత్రి నదిలో స్నానం చేస్తూ ప్రమాదవశాత్తు నీట మునిగి మృతిచెందాడు. వివరాలివి.. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నరహరి స్వస్థలం. అతను డెహ్రాడూన్‌లో అగ్రికల్చర్ బీఎస్సీ చదువుతున్నాడు. ఈ క్రమంలో నిన్న స్నేహితులతో కలిసి గంగోత్రి నది వద్దకు వెళ్లారు.
అందరూ నదిలో స్నానం చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నరహరి ఒక్కసారిగా నీట మునిగిపోయాడు. కుమారుని మరణ వార్త విన్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment