శ్రీకాళహస్తి: చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో కోనేట్లో పడి ఓ న్యాయవాది ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళితే న్యాయవాది చెంచుముని (46) గురువారం ఉదయం వైష్ణవి కోనేరుకి ఎప్పటిలాగే స్నానానికి వెళ్లారు. అయితే ప్రమాదవశాత్తూ ఆయన కోనేట్లో పడి మృతి చెందారు. కాగా ఇప్పటివరకూ ఆ కోనేరులో పడి 16మంతి మృతి చెందారని, అయినా దేవస్థానం అధికారులు ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోలేదని మృతుని బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చెంచుముని మృతితో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.
(కాళహస్తి నుంచి: సాక్షి టీవీ రిపోర్టర్ శంకర్ రెడ్డి)
కోనేరులో పడి లాయర్ మృతి
Published Thu, Mar 19 2015 1:06 PM | Last Updated on Sat, Sep 2 2017 11:06 PM
Advertisement
Advertisement