![In China Bus Driver Fights With Woman Then Bus Plunges Into River - Sakshi](/styles/webp/s3/article_images/2018/11/2/20.jpg.webp?itok=xv8qnB9C)
బీజింగ్ : డ్రైవింగ్ చేసేటప్పుడు డ్రైవర్లు చాలా జాగ్రత్తగా.. సహనంతో వ్యవహరించాలి. ప్రయాణికులు కూడా వారికి సహకరిస్తేనే క్షేమంగా గమ్యానికి చేరగలం. లేకపోతే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందో చైనాలో జరిగిన ఈ ప్రమాదం చూస్తే అర్థం అవుతోంది. ప్రయాణికురాలికి, డ్రైవర్‌కి మధ్య జరిగిన గొడవ దాదాపు 15 మంది మృతికి కారణమయ్యింది. ఇందుకు సంబంధించిన వీడియోను చైనా అధికారిక మీడియా విడుదల చేసింది.
అధికారులు తెలిపిన దాని ప్రకారం పరధ్యానంగా ఉన్న డ్రైవర్‌ని ఓ మహిళ తన ఫోన్‌తో అతని తలపై కొట్టింది. దాంతో డ్రైవర్ స్టీరింగ్ మీద నుంచి చెయ్యి తీసి సదరు మహిళతో గొడవ పడటం ప్రారంభించాడు. దాంతో కంట్రోల్ తప్పిన బస్సు ముందుగా కారును ఢీ కొని.. ఆపై బ్రిడ్జ్ రెయిలింగ్‌కు గుద్దుకుని దాదాపు 20 అడుగుల ఎత్తు నుంచి నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో దాదాపు 15 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment