(సాక్షి నాలెడ్జ్ సెంటర్): అరుణాచల్ ప్రదేశ్ ఉత్తర ప్రాంతానికి జీవనరేఖగా పేరుగాంచిన సియాంగ్ నదీ జలాలు గత కొన్ని నెలలుగా తీవ్రస్థాయిలో కలుషితమౌతున్నాయి. చైనాలో అంతర్భా గమైన టిబెట్‌లో ఈ నది పేరు యార్లుంగ్ త్సాంగ్పో. అక్కడ 1,600 కిలో మీటర్లు ప్రయాణించి ఇది అరుణాచల్ ప్రదేశ్‌లోకి ప్రవహిస్తుంది. ఇక్కడ దిబాంగ్ పేరుతో 250 కిలోమీటర్లు ప్రవహించాక లోహిత్ అనే మరో నదితో కలసి పెద్ద నదిగా మారుతుంది. ఆ తర్వాత అస్సాంలో బ్రహ్మపుత్ర నదిలో కలుస్తుంది. సియాంగ్ నుంచి నీటిని టిబెట్‌లోనే మళ్లించి షిన్‌జియాంగ్ ప్రావిన్స్ మీదుగా తక్లామకాన్ ఎడారికి తరలించేందుకు చైనా యత్నిస్తోంది. ఇందుకోసం వేయి కిలో మీటర్ల పొడవైన సొరంగం నిర్మిస్తోందని సమాచారం. టిబెట్‌లో సొరంగ నిర్మాణం కోసం చైనా రాళ్లు పగులగొట్టడం, సిమెంటు వాడకం కారణంగా సియాంగ్ జలాలు కలుషితమై రంగు మారిపోతున్నాయని నెలన్నర క్రితమే వార్తలొచ్చాయి.
అయితే చైనా మాత్రం తాము సొరంగం నిర్మించ డమే లేదని వాదిస్తోంది. నదిలో మురికి నీరు ప్రవహించడానికి కారణమేంటో తమకు అంతుచిక్కడం లేదనీ, అరుణాచల్ ఉత్తర ప్రాంతానికి ప్రాణప్రదమైన సియాంగ్‌లో మళ్లీ నీరు సహజ రంగులో ప్రవహించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ అరుణాచల్ తూర్పు లోక్‌సభ సభ్యుడు నినాంగ్ ఇరింగ్(కాంగ్రెస్) ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ కూడా రాశారు. తమ ప్రాంతానికి ఎంతో ముఖ్యమైన ఈ నదిలో కలుషిత నీరు ప్రవహించడం వల్ల ప్రజలకు, పర్యావర ణానికి తీవ్రనష్టం జరుగుతోందనీ, ఎందుకిలా జరుగుతుందో తేల్చడానికి ఓ అంతార్జాతీయ బృందాన్ని రప్పించాలని ఇరింగ్ డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలోని ఎగువ సియాంగ్ జిల్లాలో సియాంగ్ నదిపై బహుళార్థసాధక ప్రాజెక్టు నిర్మించాలనే ప్రతిపాదనను కూడా నీతి ఆయోగ్ గతంలో ప్రతిపాదించింది.
దోషి చైనాయే: ఉప కమిషనర్
రెండు నెలలుగా సియాంగ్ నది నీరు బాగా కలుషితమైందనీ, కాలుష్యం స్థాయి సాధా రణం కన్నా వందల రెట్లు అధికంగా ఉన్నట్లు కేంద్ర జలసంఘం పరీక్షలో తేలిందని తూర్పు సియాంగ్ జిల్లా ఉప కమిషనర్ తామ్యో తాతక్ చెప్పారు. ‘ఈ వానాకాలంలో నదిలో నల్లని నీరు ప్రవహించింది. బురదతో నీటి రంగు మారిందనుకున్నాం. నవంబర్‌ృఫిబ్రవరి కాలంలో నీళ్లు స్వచ్ఛంగా ఉంటాయి. నిండా నీళ్లున్నా నదీగర్భం కనిపించేది’ అని ఆయన వివరించారు. టిబెట్‌లో లోతైన బోరింగ్ పని జరుగుతున్న కారణంగానే నీటి రంగు మారిందనీ, అందుకే చైనాను అనుమానిం చాల్సి వస్తోందని ఆయన పేర్కొన్నారు. చైనా మాత్రం ఈ ఆరోపణలను కొట్టిపారేస్తోంది. నది నీరు రంగు మారడానికి, తమకు సంబంధం లేదని వాదిస్తోంది.
అరుణాచల్ ‘నది’లో చైనా బురద!
Published Thu, Nov 30 2017 3:28 AM | Last Updated on Thu, Nov 30 2017 3:28 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment