బీజింగ్ : వేగంగా ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదవశాత్తూ చెరువులోకి దూసుకెళ్లిన ఘటన చైనాలోని గుయిజౌ ప్రావిన్స్‌లో మంగళవారం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో 21 మంది ప్రాణాలు కోల్పోగా మరో 15 మంది గాయపడ్డారు. రెయిలింగ్‌ను ఢీకొని గుయిజౌ ప్రావిన్సులోని అన్షున్ హోంగ్ షాన్ చెరువులోకి బస్సు దూసుకెళ్లింది. ప్రయాణికుల్లో ఎక్కువగా విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది. కాలేజీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ నిమిత్తం విద్యార్ధులు ఈ బస్సులో ప్రయాణించినట్లు చైనా మీడియా నివేదించింది. గార్డురైల్ గుండా బస్సు అదుపుతప్పి ఒక్కసారిగా చెరువులోకి దూసుకెళ్లిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజిలో రికార్డు అయ్యాయి. దీనికి సంబంధించిన వీడియోను అక్కడి జాతీయ మీడియా ట్విట్టర్ ద్వారా పంచుకుంది. బస్సును బయటకు తీసిన అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేస్తున్నారు.అయితే ప్రమాదానికి గల కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
(చావు నుంచి కాపాడుకోవడానికే స్పీడుగా వెళుతున్నా.. )
A bus fell into a lake in Anshun in China's Guizhou Province. Rescue is underway and the number of casualties is unknown pic.twitter.com/yNMBt6wjo8
— China Xinhua News (@XHNews) July 7, 2020
Comments
Please login to add a commentAdd a comment