
ఖాట్మండు: నేపాల్‌లో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి త్రిశూలీ నదిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 14 మంది మృతి చెందగా.. మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. రాజ్‌బిరాజ్ నుంచి ఖాట్మండు వెళ్తున్న బస్సు ఘట్‌బేసీ సమీపంలోని ప్రమాదకర మలుపు వద్ద అదుపుతప్పి నదిలోకి దూసుకెళ్లింది. విషయం తెలుసుకున్నఅధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపడుతున్నారు.
ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఇప్పటి వరకు 14 మృతదేహాలను వెలికి తీసినట్లు ఓ అధికారి తెలిపారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉండటంతో.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment