విశాఖ జిల్లా చోడవరం మండలం భోగాపురం వద్ద పేద్దేరు నదిలో ఓ వ్యక్తి గల్లంతయ్యాడు.
విశాఖ జిల్లా చోడవరం మండలం భోగాపురం వద్ద పేద్దేరు నదిలో ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. భోగాపురం గ్రామానికి చెందిన రాపేటి గణేశ్ (32) బుధవారం ఉదయం నదిలో స్నానానికి దిగి మునిగి పోయాడు. దీంతో స్థానికులు, అగ్ని మాపక సిబ్బంది అతడి కోసం గాలిస్తున్నారు. అయినా ఫలితం లేకపోవడంతో నేవీ సిబ్బంది సహాయం తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు.