తణుకు : పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం కనకాయలంక వద్ద చిన్న గోదావరిలో ఈతకు వెళ్లి గల్లంతైన ఇద్దరు చిన్నారుల ఉదంతం విషాదంగా ముగిసింది. ఆదివారం మధ్యాహ్నం మైలు గణేష్(5), కాటాడి కాసులయ్య(6) అనే ఇద్దరు చిన్నారులు ఆడుకునేందుకు చిన గోదావరి వద్దకు వెళ్లారు. గట్టున దుస్తులు విప్పి స్నానానికి గోదావరిలోకి దిగారు. సాయంత్రం కావస్తున్నా పిల్లలు ఇంటికి రాకపోవటంతో కుటుంబ సభ్యులు ఊరంతా వెదికారు. చివరకు వీరిద్దరూ విగతజీవులై కనిపించారు. దీంతో కనకాయలంక గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.