యలమంచిలి : పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి సమీపంలోని చించినాడు వంతెనపై నుంచి దూకి ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్లితే... ఓ మహిళ తన ఆర్నెల్ల పాపతో కలిసి చించినాడు వంతెన వద్దకు వెళ్లి పాపతో పాటు తన బ్యాగ్, చెప్పులను అక్కడ వదిలి మహిళ నదిలోకి దూకింది.
గమనించిన స్థానికులు ఆమెను కాపాడే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది. సంఘటన స్థలంలో చిన్నారి ఏడుస్తుండటం అందరినీ కలచి వేసింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పాపను, ఆమె వస్తువులను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆమె వదిలిన బ్యాగులో ఆమెకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు ఏమీ లేవు.