కృష్ణమ్మ సోయగం
నాగార్జునసాగర్ రిజర్వాయర్‌లో నీటి మట్టం 535 అడుగులు ఉండడంతో కొండల మధ్య వంపులు తిరుగుతూ ప్రవహిస్తున్న కృష్ణమ్మ అందాలు చూపరులను ఆకర్షిస్తున్నాయి. నాగార్జున సాగర్ రిజర్వాయర్ నుంచి శ్రీశైలంకు వెళ్లే రహదారి సమీపంలో వెల్దుర్తి మండలంలోని జెర్రి వాగు మలుపు వద్ద కృష్ణానది మలుపులు తిరుగుతూ ప్రవహిస్తున్న దృశ్యాలు వీక్షకులకు కనువిందు చేస్తున్నాయి. – మాచర్ల