అస్సాంలోని విశ్వనాథ్ జిల్లా, సూటియా అనే కుగ్రామంలో ప్రాథమిక పాఠశాల పిల్లలు ప్రతిరోజు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బడికి వెళుతున్నారు. మోయలేక మోస్తున్న పుస్తకాల బరువు అందుకు కారణం కాదు. వారంతా బడికి వెళ్లాలంటే ఎప్పుడూ ప్రవహించే ఓ నదిని దాటాలి. దానిపై వంతెనా లేదు. ప్రయాణికులను దాటించే పడవులూ లేవు. అందుకని పిల్లలంతా పెద్ద రాతెండి జబ్బ తట్టలను ఇంటి నుంచి తెచ్చుకుంటున్నారు.