
ఏ నది ఎక్కడ పుట్టింది?
సెల్ఫ్‌చెక్
నదులను సంప్రదాయబద్ధంగా నదీమతల్లిగా కొలుస్తాం, ఆధునిక టెక్నాలజీతో డ్యామ్‌లు కట్టి నీటిని వాడుకుంటాం. మరి... వీటిలో ఏ నది ఎక్కడ పుట్టింది?
1. నర్మదానది మధ్యప్రదేశ్‌లో అమర్‌కంటక్ కొండల్లో నర్మదాకుండ్ అనే తటాకంలో పుట్టింది.
ఎ. అవును బి. కాదు
2. ఉత్తరాఖండ్ రాష్ట్రం ఉత్తరాక్షి జిల్లాలో యమునోత్రి హిమనీనదం మెల్లగా కరుగుతూ బందేర్‌పూచ్ శిఖరం దగ్గర ప్రవాహంగా మారిన నది పేరే యమున.
ఎ. అవును బి. కాదు
3. గంగోత్రి హిమనదం నుంచి గంగానది పుట్టిందని మీకు తెలుసు.
ఎ. అవును బి. కాదు
4. కావేరి నది కర్నాటక రాష్ట్రం కొడగు (కూర్గ్) జిల్లాలో తలకావేరి అనే కుండం నుంచి పుట్టింది.
ఎ. అవును బి. కాదు
5. గోదావరి పశ్చిమ కనుమల్లో మహారాష్ట్ర నాసిక్ జిల్లా త్రయంబకం దగ్గర పుట్టింది.
ఎ. అవును బి. కాదు
6. కృష్ణానది పుట్టిన ప్రదేశం మహారాష్ట్రలోని మహాబలేశ్వర్.
ఎ. అవును బి. కాదు
7. కర్నాటక రాష్ట్రం చిక్‌బళ్లాపూర్ జిల్లాలోని నందికొండల్లో పెన్నానది పుట్టింది.
ఎ. అవును బి. కాదు
8. తపతి నది మధ్యప్రదేశ్‌లో సాత్పూర పర్వతశ్రేణుల్లో పుట్టింది.
ఎ. అవును బి. కాదు
మీ సమాధానాల్లో ‘ఎ’లు ఆరు అంతకంటే ఎక్కువగా వస్తే మీరు అవసరమైన వాటితోపాటు అనేక సాధారణ విషయాలను కూడా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు... అనుకోవాలి. ఆధ్యాత్మిక క్రతువులు నిర్వహించే కొన్ని ప్రధాన నదులతోపాటు సాధారణ నదుల పుట్టింటిని కూడా గుర్తు చేసుకుందాం.