![Bihar IT Raids Rs 100 Crore Black Money Recovered - Sakshi](/styles/webp/s3/article_images/2022/11/23/it-raids-business.jpg.webp?itok=_qNBCWaz)
న్యూఢిల్లీ: బిహార్ కేంద్రంగా పనిచేస్తున్న రియల్ ఎస్టేట్, వజ్రాల ఆభరణాల వ్యాపార సంస్థలపై దాడుల్లో రూ.100 కోట్ల పైచిలుకు లెక్కల్లో చూపని నల్లధనం బయటపడింది. ఈ నెల 17న బిహార్, ఢిల్లీల్లో 30 ప్రాంతాల్లో ఈ సొత్తును గుర్తించినట్లు ఆదాయ పన్ను శాఖ మంగళవారం తెలిపింది.
వజ్రాల ఆభరణాల సంస్థకు చెందిన రూ.5 కోట్ల నగదు, నగలను స్వా«దీనం చేసుకుని, 14 బ్యాంకు లాకర్లకు సీల్ వేసినట్లు తెలిపింది. ‘‘కస్టమర్లకు అడ్వాన్సుల పేరుతో మరో రూ.12 కోట్ల లెక్క చూపని ధనం, రూ.80 కోట్ల మేర వెల్లడించని నగదు లావాదేవీలను గుర్తించాం’’ అని పేర్కొంది.
చదవండి: మంత్రి మల్లారెడ్డి ఇంట్లో రెండో రోజు ఐటీ దాడులు, కీలక పత్రాలు స్వాధీనం
Comments
Please login to add a commentAdd a comment