ఇంట్లో ఐటీ రెయిడ్.. ఫోన్లో లైవ్!
ఇంట్లో ఐటీ రెయిడ్.. ఫోన్లో లైవ్!
Published Mon, Dec 12 2016 11:49 AM | Last Updated on Wed, Apr 3 2019 5:16 PM
టెక్నాలజీ సరికొత్త పుంతలు తొక్కుతోంది. మనం ఎక్కడున్నా కూడా ఇంట్లో ఏం జరుగుతోందో తెలుసుకోవడం క్షణాల్లో సాధ్యమవుతోంది. అంతేకాదు.. అక్కడ జరుగుతున్నదాన్ని ప్రత్యక్షంగా ఫోన్లో కూడా చూడొచ్చు. దొంగతనాలను అరికట్టడానికి కనిపెట్టిన ఈ సెక్యూరిటీ సిస్టంను ఓ న్యాయవాది ఎంచక్కా వాడుకున్నారు. తన ఇంట్లో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేస్తుంటే ఆ విషయాన్ని ఫోన్లో లైవ్‌లో చూసి, అండర్‌గ్రౌండ్‌లోకి వెళ్లిపోయారు.
ఢిల్లీలో అంతగా పేరు కూడా ఎవరికీ తెలియని రోహిత్ టాండన్.. టీ అండ్ టీ అనే న్యాయసంస్థను నడిపిస్తున్నారు. ఈయన ఇంట్లో అత్యాధునిక సెక్యూరిటీ వ్యవస్థ ఉంది. తనకు తెలియకుండా ఎవరైనా ఇంట్లో ప్రవేశించినా, ఇంట్లో లైటు స్విచ్ ఆన్ అయినా కూడా ఆయన ఫోన్‌కు ఒక మెసేజ్ వస్తుంది. ఆయన ఢిల్లీ గ్రేటర్ కైలాష్ ప్రాంతంలో ఉన్న తన ఇంట్లో మొత్తం అన్నిచోట్లా సీసీటీవీ కెమెరాలు బిగించేశాడు. అధికారులు లైట్లు వేయగానే ఆయన ఫోన్‌కు మెసేజ్ వచ్చింది. ఏంటా అని ఫోన్లో మానిటరింగ్ ఆన్ చేసి చూశాడు. అధికారుల సోదాలు మొత్తం లైవ్‌లో కనిపించాయి. వాళ్లు ఎక్కడెక్కడ ఏవేం కనిపెట్టారో అన్నీ తాపీగా చూశాడు. వెంటనే అండర్‌గ్రౌండ్‌లోకి వెళ్లిపోయాడు. ఈ విషయాన్ని ఢిల్లీ క్రైం బ్రాంచి జాయింట్ సీపీ రవీంద్ర యాదవ్ తెలిపారు.
Advertisement
Advertisement