rohit tandon
-
రోహిత్ టాండన్ అరెస్ట్
న్యూఢిల్లీ: మనీ ల్యాండరింగ్ కేసులో ఢిల్లీ లాయర్ రోహిత్ టాండన్ అరెస్టయ్యారు. ఆయనను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు బుధవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. దాదాపు రూ. 70 కోట్ల మేర అక్రమాలకు పాల్పడినట్టు ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. గతవారం కోల్ కతాలో అరెస్టు చేసిన ప్రముఖ వ్యాపారవేత్త పర్సామల్ లోధాతో టాండన్ కు సంబంధాలున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 10న టాండన్ కార్యాలయంలో ఐటీ అధికారులు సోదాలు జరిపి రూ. 14 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో రూ. 2.2 కోట్ల విలువ చేసే రెండువేల రూపాయల నోట్లు ఉన్నాయి. తన ఇంట్లో దాడి జరుగుతున్న విషయాన్ని సీసీటీవీ కెమెరాల సాయంతో తన మొబైల్ ఫోన్లో చూసి, అటునుంచి అటే ఆయన అండర్‌గ్రౌండ్‌లోకి వెళ్లిపోయారు. పదిరోజుల తర్వాత అధికారులకు చిక్కారు. ఆయనను కోర్టులో హాజరు పరచనున్నారు. చదవండి: (ఆ డబ్బును.. మూడు కార్లలో తరలించారు!) -
ఆ డబ్బును.. మూడు కార్లలో తరలించారు!
ఆదాయపన్ను శాఖ అధికారులు ఒక ఇంట్లో సోదాలు చేసినప్పుడు భారీ మొత్తంలో డబ్బు పట్టుబడింది. దక్షిణ ఢిల్లీలోని రోహిత్ టాండన్ అనే న్యాయవాది ఇంట్లో మూడోసారి సోదాలు చేసినప్పుడు ఏకంగా 14 కోట్ల రూపాయల నల్లధనం పట్టుబడింది. ఆ డబ్బు మొత్తాన్ని అక్కడినుంచి తరలించడానికి అధికారులు మూడు పెద్ద కార్లు వాడాల్సి వచ్చింది. రెండు ఇన్నోవాలు, ఒక హోండా కారులో ఆరు సూట్‌కేసులు, నాలుగు స్టీలు ట్రంకుపెట్టెలలో ఆ డబ్బును తీసుకెళ్లారు. అతడివద్ద స్వాధీనం చేసుకున్నవాటిలో రూ. 2.2 కోట్ల విలువ చేసే రెండువేల రూపాయల నోట్లు ఉన్నాయి. అంటే, అవే 11వేల నోట్లన్నమాట. అవన్నీ ఆయన కార్యాలయంలో ఒక పక్కన పారేసి ఉన్నాయి. (చెట్టుకింద ప్లీడర్ ఇంట్లో.. రూ. 157 కోట్లు!) మొదటిసారి అక్టోబర్ 7వ తేదీన ఆ లాయర్ ఇంట్లో సోదాలు చేసినప్పుడే రూ. 125 కోట్లు పట్టుబడ్డాయి. రెండు వారాల క్రితం రెండోసారి దాడిచేసినప్పుడు రూ. 19 కోట్లు బయటపడ్డాయి. ఇప్పుడు మళ్లీ అతడి వద్ద డబ్బుందని విశ్వసనీయ సమాచారం అందడంతో.. మళ్లీ సోదాలు చేయగా, ఆయనైతే ఇంట్లో లేరు గానీ, ఇంటి నిండా ఎక్కడికక్కడ రహస్యంగా దాచిపెట్టిన డబ్బు కట్టలు, ఇంట్లో నలుమూలలా బిగించిన సీసీటీవీ కెమెరాలు కనిపించాయి. తన ఇంట్లో దాడి జరుగుతున్న విషయాన్న సీసీటీవీ కెమెరాల సాయంతో తన మొబైల్ ఫోన్లో చూసి, అటునుంచి అటే ఆయన అండర్‌గ్రౌండ్‌లోకి వెళ్లిపోయాడు. (ఇంట్లో ఐటీ రెయిడ్.. ఫోన్లో లైవ్!) -
ఇంట్లో ఐటీ రెయిడ్.. ఫోన్లో లైవ్!
టెక్నాలజీ సరికొత్త పుంతలు తొక్కుతోంది. మనం ఎక్కడున్నా కూడా ఇంట్లో ఏం జరుగుతోందో తెలుసుకోవడం క్షణాల్లో సాధ్యమవుతోంది. అంతేకాదు.. అక్కడ జరుగుతున్నదాన్ని ప్రత్యక్షంగా ఫోన్లో కూడా చూడొచ్చు. దొంగతనాలను అరికట్టడానికి కనిపెట్టిన ఈ సెక్యూరిటీ సిస్టంను ఓ న్యాయవాది ఎంచక్కా వాడుకున్నారు. తన ఇంట్లో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేస్తుంటే ఆ విషయాన్ని ఫోన్లో లైవ్‌లో చూసి, అండర్‌గ్రౌండ్‌లోకి వెళ్లిపోయారు. ఢిల్లీలో అంతగా పేరు కూడా ఎవరికీ తెలియని రోహిత్ టాండన్.. టీ అండ్ టీ అనే న్యాయసంస్థను నడిపిస్తున్నారు. ఈయన ఇంట్లో అత్యాధునిక సెక్యూరిటీ వ్యవస్థ ఉంది. తనకు తెలియకుండా ఎవరైనా ఇంట్లో ప్రవేశించినా, ఇంట్లో లైటు స్విచ్ ఆన్ అయినా కూడా ఆయన ఫోన్‌కు ఒక మెసేజ్ వస్తుంది. ఆయన ఢిల్లీ గ్రేటర్ కైలాష్ ప్రాంతంలో ఉన్న తన ఇంట్లో మొత్తం అన్నిచోట్లా సీసీటీవీ కెమెరాలు బిగించేశాడు. అధికారులు లైట్లు వేయగానే ఆయన ఫోన్‌కు మెసేజ్ వచ్చింది. ఏంటా అని ఫోన్లో మానిటరింగ్ ఆన్ చేసి చూశాడు. అధికారుల సోదాలు మొత్తం లైవ్‌లో కనిపించాయి. వాళ్లు ఎక్కడెక్కడ ఏవేం కనిపెట్టారో అన్నీ తాపీగా చూశాడు. వెంటనే అండర్‌గ్రౌండ్‌లోకి వెళ్లిపోయాడు. ఈ విషయాన్ని ఢిల్లీ క్రైం బ్రాంచి జాయింట్ సీపీ రవీంద్ర యాదవ్ తెలిపారు.