హైదరాబాద్‌లో వెలుగులోకి రూ.400 కోట్ల నల్లధనం | IT Officials Find Rs 400 Crore Black Money At Famous Pharmaceutical Company | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో వెలుగులోకి రూ.400 కోట్ల నల్లధనం

Published Mon, Mar 1 2021 7:04 PM | Last Updated on Tue, Mar 2 2021 12:05 AM

IT Officials Find Rs 400 Crore Black Money At Famous Pharmaceutical Company - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో భారీగా నల్లడబ్బు వెలుగులోకి వచ్చింది. బోగస్‌ కంపెనీల ద్వారా అవకతవకలకు పాల్పడుతోన్న ఓ ప్రసిద్ధ ఫార్మాస్యూటికల్‌ కంపెనీ వద్ద ఐటీ అధికారులు సుమారు 400 కోట్ల రూపాయల నల్లడబ్బును గుర్తించారు. వివరాలు.. గత నెల 24న ఐటీ అధికారులు నగరంలో ప్రసిద్ధి చెందిన ఓ ఫార్మస్యూటికల్‌ కంపెనీపై దాడులు చేశారు. బోగస్ కంపెనీల ద్వారా ఈ కంపెనీ అవకతవకలకు పాల్పడినట్లు గుర్తించారు. మొత్తం 400 కోట్ల రూపాయల నల్లధనం ఉన్నట్లు కనుగొన్నారు. ఈ క్రమంలో అధికారులు 1.66 కోట్ల రూపాయల నగదు, కీలక పత్రాలు, పెన్‌డ్రైవ్‌లు, హార్డ్‌ డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నారు.  

చదవండి: 
చెన్నైలో పట్టుబడ్డ రూ. 220 కోట్ల నల్లధనం

యశోదా ఆసుపత్రులపై ఐటీ దాడులు..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement