చంఢీగడ్: ఓ వైపు పెళ్లి పనులతో కుటుంబ సభ్యులంతా బిజీ బిజీగా ఉండగా.. ఓ వ్యక్తి చేతివాటం ప్రదర్శించాడు. మూడు లక్షల రూపాయల సొమ్ము, డైమండ్ రింగ్‌తో ఉడాయించాడు. ఈ సంఘటన చంఢీగడ్‌లో చోటు చేసుకుంది. వివరాలు.. ఉషా ఠాకూర్ అనే మహిళ తన కుమార్తె వివాహాన్ని హోటల్ సెక్టార్ 22లో జరుపుతుంది. పెళ్లికి వచ్చిన వారు వధూవరులను ఆశీర్వదించి డబ్బులు ఇచ్చారు. ఇలా మొత్తం మూడు లక్షల రూపాయలు వచ్చాయి. ఈ మొత్తాన్ని తన హ్యాండ్‌బ్యాగ్‌లో ఉంచారు ఉషా. డబ్బుతో పాటు రెండు మొబైల్ ఫోన్లు, ఒక డైమండ్ రింగ్ కూడా బ్యాగులోనే పెట్టారు. ఇక పెళ్లి కార్యక్రమాల్లో బిజీ అయ్యారు. కాసేపటి తర్వాత తన హ్యాండ్‌బ్యాగ్ లేదనే విషయం గుర్తుకు వచ్చింది. దాంతో అన్ని చోట్లా వెతికారు. కానీ లాభం లేకపోయింది. (చదవండి: మళ్లీ మత్తు దోపిడీ)
వెంటనే సమీప పోలీసు స్టేషన్‌కి వెళ్లి దీని గురించి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వివాహ వేడుకకు సంబంధించి సీసీటీవీ, వీడియో ఫుటేజ్‌ని స్వాధీనం చేసుకున్నారు. దానిలో ఉషా ఠాకూర్ బంధువుగా చెప్పుకుంటున్న ఓ వ్యక్తి హడావుడిగా హోటల్ నుంచి వెళ్లడం పోలీసుల దృష్టికి వచ్చింది. మాస్క్ ధరించడంతో ముఖం పూర్తిగా కనిపించలేదు. దాంతో అతడి వివరాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment