Shagun
-
Taapsee Pannu Sister: తాప్సీ చెల్లిని చూశారా? ట్రై చేస్తే యాక్టరయ్యేది! (ఫోటోలు)
-
పెళ్లిలో చేతివాటం.. రూ.3 లక్షలు చోరీ
చంఢీగడ్: ఓ వైపు పెళ్లి పనులతో కుటుంబ సభ్యులంతా బిజీ బిజీగా ఉండగా.. ఓ వ్యక్తి చేతివాటం ప్రదర్శించాడు. మూడు లక్షల రూపాయల సొమ్ము, డైమండ్ రింగ్‌తో ఉడాయించాడు. ఈ సంఘటన చంఢీగడ్‌లో చోటు చేసుకుంది. వివరాలు.. ఉషా ఠాకూర్ అనే మహిళ తన కుమార్తె వివాహాన్ని హోటల్ సెక్టార్ 22లో జరుపుతుంది. పెళ్లికి వచ్చిన వారు వధూవరులను ఆశీర్వదించి డబ్బులు ఇచ్చారు. ఇలా మొత్తం మూడు లక్షల రూపాయలు వచ్చాయి. ఈ మొత్తాన్ని తన హ్యాండ్‌బ్యాగ్‌లో ఉంచారు ఉషా. డబ్బుతో పాటు రెండు మొబైల్ ఫోన్లు, ఒక డైమండ్ రింగ్ కూడా బ్యాగులోనే పెట్టారు. ఇక పెళ్లి కార్యక్రమాల్లో బిజీ అయ్యారు. కాసేపటి తర్వాత తన హ్యాండ్‌బ్యాగ్ లేదనే విషయం గుర్తుకు వచ్చింది. దాంతో అన్ని చోట్లా వెతికారు. కానీ లాభం లేకపోయింది. (చదవండి: మళ్లీ మత్తు దోపిడీ) వెంటనే సమీప పోలీసు స్టేషన్‌కి వెళ్లి దీని గురించి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వివాహ వేడుకకు సంబంధించి సీసీటీవీ, వీడియో ఫుటేజ్‌ని స్వాధీనం చేసుకున్నారు. దానిలో ఉషా ఠాకూర్ బంధువుగా చెప్పుకుంటున్న ఓ వ్యక్తి హడావుడిగా హోటల్ నుంచి వెళ్లడం పోలీసుల దృష్టికి వచ్చింది. మాస్క్ ధరించడంతో ముఖం పూర్తిగా కనిపించలేదు. దాంతో అతడి వివరాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. -
కొత్త జంటలకు యోగి సర్కార్ వెరైటీ కానుక!
లక్నో: కొత్తగా పెళ్లయిన జంటలకు ప్రభుత్వం నుంచి కానుకలు, ప్రోత్సాహకాలు అనగానే ఆ జంట సంబరపడుతుంది. కానీ ఉత్తరప్రదేశ్‌లో మాత్రం కొత్త జంటలకు భిన్న పరిస్థితి ఎదురుకానుంది. యోగి యోగిత్యనాథ్ సర్కార్ తీసుకున్న వెరైటీ పెళ్లి కానుక నిర్ణయమే ఇందుకు కారణమని భావించవచ్చు. మిషన్ పరివార్ వికాస్‌లో భాగంగా కొత్తగా పెళ్లయిన జంటలకు కండోమ్‌లు, ఇతర గర్భ నిరోదక సాధనాలున్న కిట్‌ను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇతర రాష్ట్రాల్లో కొత్తగా పెళ్లయిన జంటలకు ఆర్థికసాయం చేయడమో, లేక వారికి వంటింటి పాత్రలు ఇవ్వడమో చేస్తుంటారు కానీ మా ప్రభుత్వం మాత్రం ఈ నిర్ణయం తీసుకుందంటూ యూపీ ప్రజలు వాపోతున్నారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా జులై 11 నుంచి యోగి సర్కార్ 'నయీ పహల్ కిట్ ఫర్ న్యూలీ వెడ్స్' అనే కిట్లను అందించనుంది. ఆశా కార్యకర్తలు కొత్త జంటలకు ఈ కిట్లను పంచి పెడతారు. కండోమ్‌లు, గర్భనిరోధక సమాచారం, సురక్షిత శృంగారం, కుటుంబ నియంత్రణ, ప్రసవానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలిపే చిన్న బుక్‌లెట్‌ను ఈ కిట్‌లో సమకూర్చనుంది. నెయిల్ కట్టర్, అద్దం, దువ్వెన, గర్భనిరోధక మాత్రలు, జంట తువ్వాళ్లు, కర్చీఫ్‌లు ఈ కిట్‌లో ఉంటాయి. ఆశా కార్యకర్తలు కొత్త జంటల సందేహాలు నివృత్తి చేస్తారని యూపీ హెల్త్ మిషన్ డైరెక్టర్ అలోక్ కుమార్ తెలిపారు. జనాభా నియంత్రించడం, సరైన సమయాల్లో కాన్పులు జరిగేలా చూసేందుకు ఇలాంటి చర్యలు తీసుకున్నట్లు వివరించారు. -
పెళ్లిళ్లకు ఆ సీజన్ బాగుంటుంది!
ఈ మధ్య తాప్సీ సినిమాలు చేయడంతో పాటు పెళ్లికి సంబంధించిన ప్లాన్స్ చేస్తూ బిజీగా ఉంటున్నారు. ఓహో.. తాప్సీకి పెళ్లి ఫిక్సయ్యిందేమో అనుకుంటున్నారా? అదేం కాదు. బిజినెస్‌లో భాగంగా ఈ ప్లాన్స్ చేస్తున్నారు. పెద్ద పెద్దవాళ్లంతా వెడ్డింగ్ ప్లానర్స్‌ని సంప్రతించి, పెళ్లి వేడుకలకు సంబంధించిన మొత్తం బాధ్యతలను వాళ్లకు అప్పగించేస్తారు. ప్రస్తుతం మార్కెట్లో ఈ వ్యాపారం జోరుగా సాగుతోంది. అందుకే తాప్సీ తన చెల్లెలు షగున్‌తో కలిసి ‘వెడ్డింగ్ ఫ్యాక్టరీ’ పేరుతో వ్యాపారం మొదలుపెట్టారు. అయితే, తాప్సీ ఈ బిజినెస్‌ని ధనార్జనే ధ్యేయంగా మొదలుపెట్టలేదు. అదొక కారణం మాత్రమే అంటున్నారు. ఈ బిజినెస్ అంటే ఆమెకు చాలా ఇష్టం. ఇప్పటివరకూ తాప్సీ, షగున్ కొన్ని వివాహ వేడుకలను సక్సెస్‌ఫుల్‌గా చేశారు. పెళ్లికి వర్షాకాలం చాలా బాగుంటుందని తాప్సీ చెబుతూ - ‘‘మాన్సూన్లో వాతావరణం బాగుంటుంది. చాలా చల్లగా, ఆహ్లాదకరంగా ఉంటుంది కాబట్టి, మన మూడ్ కూడా దాదాపు అలానే ఉంటుంది. పైగా, వర్షాకాలంలో ఎక్కువగా తిరగలేం. అందుకని ఏదైనా వేడుకకు వెళితే అక్కడ గంటలు గంటలు గడుపుతాం. ఆ విధంగా. బంధువులు, స్నేహితులతో వేడుక ప్రాంగణం కళకళలాడిపోతుంది. వేడిగా ఉండదు కాబట్టి, మేకప్ చెరగదు. హ్యాపీగా పట్టుచీరలు కట్టుకోవచ్చు. ఎన్ని నగలైనా పెట్టుకోవచ్చు. అదే సమ్మర్ అనుకోండి.. ఇంత భారీగా రెడీ కాలేం. అందుకే మ్యారేజెస్‌కి మాన్సూన్ బెస్ట్ అంటున్నా’’ అని చెప్పారు. -
లాలు కుమార్తెతో ములాయం మనుమడి నిశ్చతార్థం