పెళ్లిళ్లకు ఆ సీజన్ బాగుంటుంది! | Taapsee Pannu | Sakshi
Sakshi News home page

పెళ్లిళ్లకు ఆ సీజన్ బాగుంటుంది!

Published Fri, Oct 9 2015 11:10 PM | Last Updated on Mon, Aug 13 2018 3:04 PM

పెళ్లిళ్లకు ఆ సీజన్ బాగుంటుంది! - Sakshi

పెళ్లిళ్లకు ఆ సీజన్ బాగుంటుంది!

ఈ మధ్య తాప్సీ సినిమాలు చేయడంతో పాటు పెళ్లికి సంబంధించిన ప్లాన్స్ చేస్తూ బిజీగా ఉంటున్నారు. ఓహో.. తాప్సీకి పెళ్లి ఫిక్సయ్యిందేమో అనుకుంటున్నారా? అదేం కాదు. బిజినెస్‌లో భాగంగా ఈ ప్లాన్స్ చేస్తున్నారు. పెద్ద పెద్దవాళ్లంతా వెడ్డింగ్ ప్లానర్స్‌ని సంప్రతించి, పెళ్లి వేడుకలకు సంబంధించిన మొత్తం బాధ్యతలను వాళ్లకు అప్పగించేస్తారు. ప్రస్తుతం మార్కెట్లో ఈ వ్యాపారం జోరుగా సాగుతోంది. అందుకే తాప్సీ తన చెల్లెలు షగున్‌తో కలిసి ‘వెడ్డింగ్ ఫ్యాక్టరీ’ పేరుతో వ్యాపారం మొదలుపెట్టారు.

అయితే, తాప్సీ ఈ బిజినెస్‌ని ధనార్జనే ధ్యేయంగా మొదలుపెట్టలేదు. అదొక కారణం మాత్రమే అంటున్నారు. ఈ బిజినెస్ అంటే ఆమెకు చాలా ఇష్టం. ఇప్పటివరకూ తాప్సీ, షగున్ కొన్ని వివాహ వేడుకలను సక్సెస్‌ఫుల్‌గా చేశారు. పెళ్లికి వర్షాకాలం చాలా బాగుంటుందని తాప్సీ చెబుతూ - ‘‘మాన్‌సూన్‌లో వాతావరణం బాగుంటుంది. చాలా చల్లగా, ఆహ్లాదకరంగా ఉంటుంది కాబట్టి, మన మూడ్ కూడా దాదాపు అలానే ఉంటుంది.

 పైగా, వర్షాకాలంలో ఎక్కువగా తిరగలేం. అందుకని ఏదైనా వేడుకకు వెళితే అక్కడ గంటలు గంటలు గడుపుతాం. ఆ విధంగా. బంధువులు, స్నేహితులతో వేడుక ప్రాంగణం కళకళలాడిపోతుంది. వేడిగా ఉండదు కాబట్టి, మేకప్ చెరగదు. హ్యాపీగా పట్టుచీరలు కట్టుకోవచ్చు. ఎన్ని నగలైనా పెట్టుకోవచ్చు. అదే సమ్మర్ అనుకోండి.. ఇంత భారీగా రెడీ కాలేం. అందుకే మ్యారేజెస్‌కి మాన్‌సూన్ బెస్ట్ అంటున్నా’’ అని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement