ప్రతీకాత్మక చిత్రం
బ్రిటన్: మనం వీధుల్లో ఫ్లాట్ ఫాం పై అమ్మే వస్తువులు చౌకగా లభించడంతో సరదాగా కొంటుంటాం. ఒక్కొసారి ఆ వస్తువల్లో కొన్ని అనూహ్యంగా బ్రాండెడ్ వస్తువులాంటివి దొరకుతాయి. పైగా చాల చౌక ధరలో మనకు లభించిందని సంతోషంగా ఫీలవుతాం. అదే కోట్ల ఖరీదు చేసే వస్తువు దొరకితే మనకు ఎలా అనిపిస్తుంది చెప్పండి. అచ్చం అలానే ఒక బామ్మకి రూ. 20 కోట్లు విలువ చేసే డైమండ్ లభించింది. అసలు ఏం జరిగిందంటే?
(చదవండి: జెఫ్ బెజోస్ ఈవెంట్లో పునీత్ రాజ్‌కుమార్ ఆ నటుడ్ని కలవాలనుకున్నారట!)
వివరాల్లోకెళ్లితే....యూకేకి చెందిన 70 ఏళ్ల బామ్మ కార్లలలో రకరకాల వస్తువులను తీసుకువచ్చి అమ్మే వాళ్ల నుంచి చాలా ఏళ్ల క్రితం ఒక స్టోన్ రింగ్‌ని కొనుగోలు చేసినట్లు గుర్తు. అంతే తప్ప ఆమెకు ఏ ప్రాంతంలో ఎప్పుడు కొన్నాను అన్నది కచ్చితంగా తెలియదు. ఒకరోజు ఇంట్లో అనవసరమైన వస్తువులను డస్ట్ బిన్‌లో పడేస్తు అనుహ్యంగా ఈ స్టోన్ రింగ్‌ని కూడా వేసేయబోతుంది. కానీ ఆమె పక్కింటి వాళ్ల సూచన మేరకు పరీక్షించి తెలుసుకుందాం అనుకుంటుంది.
ఈ మేరకు నార్త్ టైన్‌సైడ్‌లో నార్త్ షీల్డ్స్‌లోని ఫీటన్‌బై వేలం పాటదారులకు చెందిన మార్క్ లేన్ మాట్లాడుతూ....ఆ మహిళ తన ఆభరణాల బ్యాగ్‌లో ఆ స్టోన్ రింగ్‌ని మా వద్దకు తీసుకువచ్చింది. అది ఒక పౌండ్ నాణెం కంటే పెద్ద రాయి వలే ఉంది. డైమండ్ టెస్టర్‌తో టెస్ట్ చేసేంత వరకు మేము గుర్తిచంలేకపోయాం. అంతేకాదు బెల్జియంలో ఆంట్‌వెర్ప్‌లోని నిపుణులచే ధృవీకరించక ముందే మేము దానిని లండన్‌లోని మా భాగస్వాములకు పంపాము.
అయితే వారు దీనిని రూ.24 కోట్లు విలువ చేసే 34 క్యారెట్ల డైమండ్‌గా నిర్ధారించారు. పైగా ఈ డైమండ్ రింగ్‌ని నవంబర్ 30న వేలం వేస్తామని అప్పటి వరకు లండన్‌లోని డైమండ్ క్వార్టర్ హాటన్ గార్డెన్స్‌లోని ఒక ప్రదేశంలో సురక్షితంగా ఉంటుంది" అని చెప్పాడు.
(చదవండి: భారత్‌కు అద్భుత కళాఖండాలు అప్పగింత)
Comments
Please login to add a commentAdd a comment