న్యూ ఇయర్ జోక్స్ | New Year Jokes | Sakshi
Sakshi News home page

న్యూ ఇయర్ జోక్స్

Published Thu, Dec 31 2015 10:46 PM | Last Updated on Sun, Sep 3 2017 2:53 PM

న్యూ ఇయర్ జోక్స్

న్యూ ఇయర్ జోక్స్

కానుక
డిసెంబర్ 31 పార్టీకి సిద్ధమవుతూ  అలసి పోయి ఆ మధ్యాహ్నం చిన్న కునుకు తీసింది మంగతాయారు. నిద్ర లేచాక భర్తతో నర్మగర్భంగా అంది - ‘ఇప్పుడే నాకో కలొచ్చింది. అందులో మీరు నాకు డైమండ్ రింగ్ కానుకిచ్చినట్టుగా కనిపించింది. దానర్థం ఏమిటో’.
 భర్త నవ్వి భార్యను దగ్గరకు తీసుకొని అన్నాడు- ‘రాత్రికి నువ్వే తెలుసుకుంటావుగా’. సరిగ్గా అర్ధరాత్రి అయ్యి కొత్త సంవత్సరం వచ్చిన వెంటనే భర్త ఒక చిన్న గిఫ్ట్ ప్యాక్ తెచ్చి భార్య చేతిలో ఉంచాడు. మంగతాయారు ఉత్సాహంగా విప్పింది. అందులో ఒక పుస్తకం ఉంది. దాని మీద ఇలా ఉంది- ‘మీ కలలకు అర్థం తెలుసుకోండి’.
 
అసలు మనిషి

 పబ్‌లో న్యూ ఇయర్ పార్టీ ఆర్భాటంగా సాగుతోంది. భర్తలు తాగుతూ ఉన్నారు. భార్యలు కబుర్లలో తల మునకలుగా ఉన్నారు. మరి కొద్ది నిమిషాల్లో అర్ధరాత్రి పన్నెండు అవుతుంది. ఇంతలో ఒకామె లేచింది. ‘ఫ్రెండ్స్... ఇంకా కేవలం అరవై సెకండ్లు మాత్రమే ఉన్నాయి. అవి గడిచి పెద్ద ముల్లు చిన్న ముల్లు మీదకు వచ్చేసరికి ఇక్కడ ఉన్న మగాళ్లంతా తమ జీవితాన్ని అర్థవంతం చేసిన వ్యక్తి పక్కన నిల్చోవాలి.టక్.. టక్.. టక్... పెద్ద ముల్లు చిన్న ముల్లును తాకింది. చాలా ఇబ్బందికరమైన సంగతి.మగళ్లంతా తమకు మందు సర్వ్ చేస్తున్న వెయిటర్ పక్కన నిలవడానికి మీదపడి అతణ్ణి తొక్కి చంపినంత పని చేశారు.
 
స్టేజ్ 1
న్యూ ఇయర్ పార్టీ జోరుగా సాగుతోంది. రాము సోమును సిగరెట్ అడిగాడు.
సోము: ఈ సంవత్సరం నుంచి సిగరెట్లు మానేస్తానని నిర్ణయం తీసుకున్నట్టున్నావ్?
రాము: అవును. తీసుకున్నాను. ఆ క్రమంలో మొదటి దశలో ఉన్నాను.
సోము: మొదటి దశ? అంటే?
రాము: ప్రస్తుతానికి కొనడం మానేశాను.
 
 లెక్చర్
డిసెంబర్ 31 తెల్లవారుజామున నాలుగ్గంటలకు ఒక కారును పోలీసులు ఆపారు. సీటులో ఓ పెద్దమనిషి ఉన్నాడు. చూస్తే తాగినట్టున్నాడు.
పోలీస్: ఎక్కడకు వెళుతున్నారు.
పె.మ: లెక్చర్ వినడానికి.
పోలీస్: ఈ టైమ్‌లో ఇంత తెల్లవారుజామున మీకు లెక్చర్ ఇచ్చేవాళ్లు ఎవరు?
పె.మ: నా భార్య.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement