Serial Actress Rohini Birthday Celebrations: See Who Gave Diamond Ring To Her - Sakshi
Sakshi News home page

Rowdy Rohini: రోహిణి బర్త్‌డేకు డైమండ్‌ రింగ్‌ బహుమతి, ఎవరిచ్చారో తెలుసా?

Published Thu, Oct 28 2021 2:03 PM | Last Updated on Sat, Oct 30 2021 11:24 PM

Bigg Boss Fame Rohini Get Diamond Ring Surprise In Her Birthday Celebration - Sakshi

బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్‌ రౌడీ రోహిణి గత నెలలో 28వ బర్త్‌డే జరుపుకుంది.  తాజాగా ఈ బర్త్‌డే సెలబ్రేషన్స్‌ వీడియోను యూట్యూబ్‌లోని తన ఛానల్‌లో పోస్ట్‌ చేయగా ప్రస్తుతం అది వైరల్‌గా మారింది. ఈ వీడియోలో రోహిణి తన ఫ్రెండ్స్‌ అండ్‌ ఫ్యామిలీతో కలిసి ఓ ఫాంహౌస్‌లో పుట్టినరోజు సెలబ్రేట్‌ చేసుకుంది. ఈ వేడుకలకు మాజీ బిగ్‌బాస్‌ కంటెస్టెంట్లు శివజ్యోతి, లాస్య కూడా హాజరయ్యారు. ఇక రోహిణి పుట్టినరోజును పురస్కరించుకుని ఎన్నో బహుమతులు పట్టుకొచ్చారు ఆమె సన్నిహితులు.

అందరూ తీసుకొచ్చిన గిఫ్ట్స్‌ ఒకతైతే ఆమె ఫ్యామిలీ ఇచ్చిన బహుమతి మరో ఎత్తు. రోహిణి తల్లి కూతురి కోసం డైమండ్‌ రింగ్‌ను బహుమానంగా ఇచ్చింది. అది చూసి రోహిణి ఎంతగానో మురిసిపోయింది. వెంటనే దాన్ని తన సోదరితో వేలికి తొడిగించుకుంది. తనకు వజ్రపు ఉంగరాన్ని బహుమతిగా ఇచ్చిన తల్లిని, సోదర‍్ని కౌగిలించుకుని వారిపై ప్రేమను కురిపించింది. ఇక ఈ సెలబ్రేషన్స్‌కు హాజరైన ఇమ్మాన్యుయేల్‌కూడా ఖరీదైన ఉంగరాన్ని గిఫ్టిచ్చినట్లు తెలుస్తోంది. రోహిణికి చెవిరింగులు, ఆభరణాలు, చీర వంటి మరెన్నో బహుమతులు సైతం కానుకగా అందాయి. గిఫ్టులంటే ఇష్టం అని చెప్పే రోహిణికి వీటన్నింటినీ చూసి తెగ మురిసిపోయింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement