బాయ్‌ ఫ్రెండ్‌ వల్ల నరకం అనుభవించాను: రోహిణి | Rowdy Rohini Reveal Her Boyfriend - Sakshi
Sakshi News home page

Rowdy Rohini: బాయ్‌ ఫ్రెండ్‌ వల్ల నరకం అనుభవించాను.. వాడు ఎలాంటివాడంటే: రోహిణి

Aug 27 2023 10:10 AM | Updated on Sep 6 2023 10:09 AM

Rowdy Rohini Reveal Her Boyfriend - Sakshi

బుల్లితెర సీరియల్స్‌ ద్వారా ఫేమస్‌ అయిన రోహిణి తర్వాత బిగ్‌బాస్‌ షోలో అడుగుపెట్టి మంచి గుర్తింపు సంపాదించుకుంది. జబర్దస్త్‌లోనూ తన కామెడీ టైమింగ్‌, పంచులతో కమెడియన్‌గా రాణిస్తోంది. బుల్లితెరకే పరిమితం కాకుండా అటు వెండితెరపైనా సత్తా చాటుతోంది. సినిమాలు, వెబ్‌ సిరీస్‌లతో ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతోంది. ఇటీవల రోహిణి తన కాలు సర్జరీ కోసం ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. దీంతో కొన్ని నెలలుగా ఆమె  తెరపై కనిపించలేదు. ప్రస్తుతం ఆమె కొంతమేరకు కోలుకుంది. దీంతో మళ్లీ స్క్రీన్‌పై కనిపేందకు రెడీ అయింది.

(ఇదీ చదవండి: ఇండస్ట్రీలో ఉదయ్‌ కిరణ్‌ చెల్లెలు ఎవరో తెలుసా..?)

తాజాగ రోహిణి ఓ షోలో  మొట్టమొదటిసారి తన బ్రేకప్ గురించి చెప్పుకొచ్చింది. ఇప్పటివరకు రోహిణికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా..? లేడా..? అనే విషయం చాలామందికి తెలియదు.ఇదే విషయంపై ఆమె రివీల్‌ చేసింది. తనకు ఒకప్పుడు బాయ్ ఫ్రెండ్ ఉండేవాడని, ఇప్పుడు బ్రేకప్ అయ్యిందని చెప్పుకొచ్చింది. అతనితో వచ్చిన కొన్ని విబేదాల వల్ల బ్రేకప్‌ అయ్యానని, దాంతో  చాలా నరకాన్ని అనుభవించానని ఆమె పేర్కొంది. అప్పుడు తానెంతో డిప్రెషన్‌లోకి వెళ్లానని గుర్తుచేసుకుంది. ఆ సమయంలో తన ఫ్రెండ్స్ ఎంతగానో సపోర్ట్‌గా నిలిచారని చెప్పింది.

అంతేకాకుండా తన ఫ్రెండ్స్‌ అన్న మాటలను మరోసారి గుర్తుచేసుకుంది. 'నా ఫ్రెండ్స్ అందరూ అసలు వాడెవడు.. నీ కాలి గోటికి కూడా సరిపోడు అంటూ నాకు ధైర్యాన్ని ఇచ్చేవారు. అప్పుడు, వీడు ఒక ఆఫ్ట్రాల్‌ గాడు.. వీడి గురించి ఇంతలా ఆలోచించడం ఏంటని నన్ను నేను ప్రశ్నించుకున్నా.. అలా వారి సపోర్ట్‌తోనే ఆ కష్ట సమయం నుంచి బయటపడ్డాను.' అని రోహిణి తెలిపింది.  దీంతో రోహిణిని ప్రేమించి వదిలేసిన అబ్బాయి ఎవరని నెట్టింట తన అభిమానులు ఆరా తీయడం మొదలుపెట్టారు. రోహిణి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement