శివంగి మళ్లీ గెలుపు.. బిగ్‌బాస్ 8 తొలి ఫైనలిస్ట్ ఎవరంటే? | Bigg Boss 8 Telugu First Finalist Rohini Day 86 Updates | Sakshi
Sakshi News home page

Bigg Boss 8 Telugu: పాత హౌస్‌మేట్స్ రాకతో కాస్త కళ.. ఏమైందంటే?

Published Tue, Nov 26 2024 3:47 PM | Last Updated on Thu, Nov 28 2024 11:04 PM

Bigg Boss 8 Telugu First Finalist Rohini Day 86 Updates

బిగ్‌బాస్ చివరి దశకు వచ్చేసింది. మరికొన్ని రోజుల్లో ఫినాలే జరగబోతుంది. దీంతో ఎవరెవరు ఫైనల్లో ఉండాలనేది ఇప్పటి నుంచే పోటీలు పెట్టేస్తున్నారు. ఈ  క్రమంలోనే ఎప్పటిలా గేమ్స్ పెడితే కిక్ ఏముంటుందా అని గతంలోని కంటెస్టెంట్స్‌ని తీసుకొచ్చి మరీ కొత్త వాళ్లతో పోటీలు పెడుతున్నారు. అలా ఈ రోజు అఖిల్, హారిక వచ్చారు. ఇందుకు సంబంధించిన ప్రోమో ఇప్పుడు వైరల్ అవుతోంది.

'టికెట్ టూ ఫినాలే'లో మొదటి ఫైనలిస్ట్ అయ్యేందుకు పోటీదారుల్ని ఎంపిక చేయాలని హౌస్‌లోకి వచ్చిన అఖిల్, హారికకు బిగ్‌బాస్ చెప్పగా.. తేజ, గౌతమ్, రోహిణి, విష్ణుప్రియని ఎంపిక చేశారు. దీంతో వీళ్లకు టాస్క్ ఇచ్చారు. స్విమ్మింగ్ పూల్‪‌లోని కలర్ బాక్సులని తీసుకొచ్చి, రెయిన్ బో ఆకారం వచ్చేలా చేయాలి. తొలుత రోహిణి సరిగా పేర్చింది కానీ అవి పడిపోయాయి. ఆ తర్వాత తేజ కూడా పెట్టాడు కానీ అవి నిలబడలేదు.

(ఇదీ చదవండి: 'పుష్ప' నటుడు శ్రీ తేజ్‌పై పోలీసు కేసు)

రోహిణి అన్ని సరిగా పేర్చి త్వరగా వెళ్లి గంట కొట్టింది. దీంతో తెగ సంబరాలు చేసుకుంది. ఈ క్రమంలోనే రోహిణి.. టికెట్ టు ఫినాలే తొలి ఫైనలిస్ట్ అని అంటున్నారు. కానీ బిగ్ బాస్.. మళ్లీ పోటీలు పెడతాడా? లేదంటే రోహిణిని ఫైనలిస్ట్‌గా ఫిక్స్ చేస్తాడా అనేది చూడాలి?

కొన్నిరోజుల ముందు వరకు ఎంటర్‌టైనర్‌గా అదరగొట్టిన రోహిణి.. గతవారం కుండని బ్యాలెన్స్ చేసే టాస్కులో మాత్రం చివరివరకు నిలబడి గెలిచింది. కాలునొప్పి బాధిస్తున్నా సరే విజేతగా నిలిచి మెగాచీఫ్ అయింది. ఒక్కసారి తన గ్రాఫ్ పెంచుకుంది. ఒకవేళ ఈమె గనక తొలి ఫైనలిస్టు అయితే మాత్రం మంచిదే!

(ఇదీ చదవండి: విషాదం.. టాలీవుడ్‌ గీత రచయిత కన్నుమూత)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement