వాలెంటెన్స్‌ డే స్పెషల్‌ బర్గర్‌, ధరెంతంటే... | A Valentine's Day Burger Worth 2 Lakhs - Diamond Ring, Fries On The Side | Sakshi
Sakshi News home page

వాలెంటెన్స్‌ డే స్పెషల్‌ బర్గర్‌, ధరెంతంటే...

Published Fri, Feb 9 2018 6:27 PM | Last Updated on Fri, Feb 9 2018 6:27 PM

A Valentine's Day Burger Worth 2 Lakhs - Diamond Ring, Fries On The Side - Sakshi

వాలెంటెన్స్‌ డే ఎక్స్‌ట్రా స్పెషల్‌ బర్గర్‌

వాలెంటెన్స్‌ డేకి మీ ప్రియమైన వారిని బయటికి తీసుకెళ్లి, డిన్నర్‌ ఇప్పించాలని అనుకుంటున్నారా? అయితే వారి కోసం అమెరికాలోని మసాచుసెట్స్‌లో ఓ రెస్టారెంట్‌ ఎక్స్‌ట్రా-స్పెషల్‌ వాలెంటెన్స్‌ డే డిన్నర్‌ ఐడియాను ఆఫర్‌ చేస్తోంది. గోల్డ్‌, డైమండ్‌ ఎంగేజ్‌మెంట్‌ రింగ్‌తో కూడిన బర్గర్‌ను వినియోగదారులకు అందించనున్నట్టు తెలిపింది. దీని ధరను కూడా భారీగానే నిర్ణయించింది. 3వేల డాలర్లు అంటే సుమారు రూ.2 లక్షలకు ఈ బర్గర్‌ను ఆఫర్‌ చేస్తోంది. 

''ఈ వాలెంటెన్స్‌ డేకి కేవలం 3వేల డాలర్లకు బిగ్‌ బాయ్‌ బర్గర్‌ను మీరు పొందవచ్చు. మీ ప్రియమైన వారికి ఈ వాలెంటెన్స్‌ రాత్రి ప్రపోజ్‌ చేసేందుకు వీలుగా ఎంగేజ్‌మెంట్‌ రింగ్‌తో దీన్ని ఆఫర్‌ చేస్తున్నాం'' అని ఫేస్‌బుక్‌ పోస్టు ద్వారా పౌలిస్ నార్త్‌ఎండ్‌ తెలిపింది. ఈ పోస్టులో బర్గర్‌ ఫోటోను కూడా ట్యాగ్‌ చేసింది. ఎంగేజ్‌మెంట్‌ రింగ్‌తో పాటు బర్గర్‌కు పక్కనే ప్రైస్‌ కూడా ఉన్నాయి. అయితే 48 గంటల ముందే ఈ బర్గర్‌ను ఆర్డర్‌ చేసుకోవాలని రెస్టారెంట్‌ తెలిపింది. స్థానిక రిపోర్టుల ప్రకారం ఎంగేజ్‌మెంట్‌ రింగ్‌  7/8 క్యారెట్‌ ఉంటుందని, కే జువెల్లర్స్‌ నుంచి దీన్ని వినియోగదారులకు ఆఫర్‌ చేస్తున్నట్టు తెలుస్తోంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement