ఫోన్‌పేకు 'బిన్నీ బన్సాల్' గుడ్‌బై | Flipkart Co Founder Binny Bansal Step Down From PhonePe Board, Check More Details Inside | Sakshi
Sakshi News home page

ఫోన్‌పేకు 'బిన్నీ బన్సాల్' గుడ్‌బై

Published Fri, Nov 22 2024 9:04 PM | Last Updated on Sat, Nov 23 2024 11:45 AM

Binny Bansal Step Down From PhonePe Board

ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ బోర్డు నుంచి బయటకు వచ్చిన సంస్థ కో-ఫౌండర్ 'బిన్నీ బన్సాల్'.. తాజాగా డిజిటల్ పేమెంట్స్ యాప్ 'ఫోన్‌పే' నుంచి కూడా బయటకు వచ్చేసారు. అయితే కంపెనీ నుంచి వైదొలగడానికి కారణం ఏమిటనే విషయాన్ని వెల్లడించలేదు.

నిజానికి బిన్నీ బన్సాల్ ఆప్‌డోర్ ప్రారంభించిన తరువాత ఫ్లిప్‌కార్ట్‌లో కొన్ని వైరుధ్యాలు తలెత్తాయి. దీంతో ఈయన 2024 జనవరిలో సంస్థను వీడి బయటకు వచ్చేసారు. ఆ తరువాత ఫోన్‌పే బోర్డులో చేరారు. దానికిప్పుడు గుడ్ బై చెప్పేసారు.

బిన్నీ బన్సాల్ ఫోన్‌పే నుంచి బయటకు వెళ్లడం గురించి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO), వ్యవస్థాపకుడు సమీర్ నిగమ్ స్పందిస్తూ.. సంస్థ ఎదగటానికి ప్రారంభం నుంచి ఆయన ఎంతో మద్దతు తెలిపారని.. ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. టీమ్‌లీజ్ సర్వీసెస్‌లో వైస్-ఛైర్మన్‌గా ఉన్న 'మనీష్ సబర్వాల్‌'ను స్వతంత్ర డైరెక్టర్, ఆడిట్ కమిటీ అధ్యక్షుడిగా నియమించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement