ఆనంద్ మహీంద్ర (పైల్ ఫోటో)
సాక్షి, ముంబై: మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ (ఎం అండ్ ఎం) ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఆనంద్ మహీంద్ర తన పదవి నుంచి వైదొలగనున్నారు. ఏప్రిల్ 1, 2020 నుంచి ఆయన నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఉంటారని కంపెనీ శుక్రవారం ప్రకటించింది. ఈ మేరకు బోర్డు ఆమోదం తెలిపిందందని ఎం అండ్ ఎండ్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ లో తెలిపింది. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, పవన్ కుమార్ గోయెంకా, కొత్త సీఈవోగా ఒక సంవత్సరం పాటు అదనపు బాధ్యతలు నిర్వహిస్తారు.. 2020 ఏప్రిల్ 1 నుండి ప్రస్తుత పదవీకాలం ముగిసే వరకు (11 నవంబర్, 2020) ఆయన ఈ పదవిలో కొనసాగుతారని కంపెనీ వెల్లడించింది.
అలాగే అనీష్ షా ఏప్రిల్ 2021 వరకు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సిఎఫ్ఓ) గా నియమితులయ్యారు. ఏప్రిల్ 2, 2021 తరువాత, అతను గోయెంకా స్థానంలో నాలుగేళ్ల కాలానికి కంపెనీ సీఎండీ బాధ్యతలు స్వీకరిస్తారు.. అతని పదవీకాలం 2025 మార్చి 31 తో ముగుస్తుంది. ఈ మార్పులను కంపెనీ ప్రకటించడంతో ఎం అండ్ ఎం షేరు స్వల్ప నష‍్టంతో కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment