ఎం అండ్ ఎం ఛైర్మన్ వేతనం ఎంత పెరిగిందంటే..
ముంబై: ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా చైర్మన్ ఆనంద్ మహీంద్ర వేతనం భారీగా పెరిగింది. గత ఏడాది తో పోలిస్తే మహీంద్రా జీతం 16.38 శాతం పెరిగింది. దీంతో ఆయన వార్షిక వేతనం దాదాపు రూ.8 కోట్లకు చేరింది.
2016-17 సం.రానికి 7.67 కోట్ల రూపాయల జీతం అందుకోనున్నారనీ, అంతకుముందు ఆర్థిక సంవత్సరం నుంచి 16.38 శాతం పెరిగినట్లు కంపెనీ వార్షిక నివేదిక తెలిపింది. తమ మధ్యస్థ ఉద్యోగుల వేతనాలకంటే ఇది 108.27 శాతం ఎక్కువ అని పేర్కొంది
అదేవిధంగా మేనేజింగ్ డైరెక్టర్ పవన్ గోయెంక రూ. 7.6 కోట్ల వేతనం అందుకున్నారని తెలిపింది. ఉంది. 2016-17లో అమలుచేసిన ఈఎస్‌ఓపీ కారణంగా ఇది 15.86 శాతం పెరిగిందని పేర్కింది. ఉద్యోగుల మధ్యస్థ వేతనంతో పోలిస్తే గోయెంకా యొక్క వేతనం నిష్పత్తి 104.43. సంస్థ అందించిన నివేదిక ప్రకారం, 2016-17లో సంస్థ ఉద్యోగుల సగటు వేతనం రూ.7.08 లక్షలు. ఈ ఆర్థిక సంవత్సరంలో, ఉద్యోగుల సగటు వేతనం లో 0.43 శాతం పెరిగింది.
2016-17లో నిర్వహణాధికారుల కంటే వేరే ఉద్యోగుల వేతనాల్లో సగటు తగ్గుదల 1.46 శాతంగా ఉంది, అదే సంవత్సరంలో నిర్వహణ వేతనం తగ్గి 7.35 శాతంగా ఉంది. ఎం అండ్ ఎం గ్రూప్ సిఎఫ్ఓ, సిఐఓ వి.ఎస్. పార్థసారథిలకు రూ. 3.52 కోట్లు లభించాయని, గత ఏడాది నుంచి 19.74 శాతం మేర పెరిగిందని నివేదిక పేర్కొంది. ఎగ్జిక్యూటివ్ చైర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్ వేతనాలను వారి వ్యక్తిగత పనితీరు, ద్రవ్యోల్బణం, వ్యాప్తిలో ఉన్న పరిశ్రమ పోకడలు , బెంచ్ మార్క్ నిర్ణయాల ఆధారంగా నిర్ణయించబడతాయని కంపెనీ తన రిపోర్టులో వెల్లడించింది.
కాగా ఇటీవల ప్రకటించిన మహీంద్రా అండ్ మహీంద్రా జూన్ త్రైమాసిక ఫలితాలు నిరాశపరిచాయి. స్టాండ్ అలోన్ ప్రాతిపదికన కంపెనీ రూ.766 కోట్ల లాభాలను, 3.29 శాతం వృద్ధితో రూ.12,335 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది.