Non-executive chairman
-
స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్‌కు జగన్నాథన్ గుడ్‌బై
చెన్నై: స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ కంపెనీ బోర్డ్‌కు వెంకటస్వామి జగన్నాథన్ రాజీనామా ప్రకటించారు. ఇది తక్షణం అమల్లోకి వస్తుందని కంపెనీ ప్రకటించింది. 78 ఏళ్ల జగన్నాథన్ కంపెనీకి నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఉన్నారు. తక్షణం తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు జూన్ 10న జగన్నాథన్ నుంచి ఈ మెయిల్ వచ్చినట్టు స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ ప్రకటించింది. జగన్నాథన్‌ను బీమా రంగం వెటరన్‌గా చెబుతారు. ప్రభుత్వరంగంలోని యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్‌కు చైర్మన్, ఎండీగా పని చేసిన ఆయన, పదవీ విరమణ తర్వాత.. దుబాయికి చెందిన ఈటీఏ గ్రూప్ మద్దతుతో ప్రైవేటు రంగంలో స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్‌ను స్థాపించారు. కొత్త బాట.. తన రాజీనామాపై జగన్నాథన్ స్పందించారు. నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌కు రాజీనామా చేసినట్టు ధ్రువీకరించారు. ‘‘ప్రతీ ఆరంభానికి ముగింపు ఉంటుంది. అలాగే, ప్రతీ ముగింపునకు ఓ ఆరంభం ఉంటుందని నేను నమ్ముతాను. వచ్చే రెండు నెలల్లో ఏదో ఒకటి కొత్తగా ప్రారంభిస్తాను. అది ఏ రంగంలో అయినా ఉండొచ్చు. అది నా హృదయానికి దగ్గరగా ఉంటుంది’’అని చెప్పారు. 12 మందితో ఆయన ప్రారంభించిన స్టార్ హెల్త్ నేడు రూ.30వేల కోట్ల మార్కెట్ విలువ కలిగిన కంపెనీగా అవతరించడం గమనార్హం -
వొడాఫోన్ భవిష్యత్‌పై బ్యాంకుల కసరత్తు
న్యూఢిల్లీ: రుణ సంక్షోభంలో కూరుకుపోయిన టెలికం సంస్థ వొడాఫోన్ ఐడియా (వీఐఎల్) విషయంలో భవిష్యత్‌లో పాటించాల్సిన కార్యాచరణపై బ్యాంకులు కసరత్తు చేస్తున్నాయి. దీనిపై తగు నిర్ణయం తీసుకునేందుకు త్వరలో చర్చలు జరిపే అవకాశాలు ఉన్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) ఎండీ ఎస్ఎస్ మల్లికార్జున రావు సూచనప్రాయంగా ఈ విషయాలు తెలిపారు. వీఐఎల్ విషయంలో కొద్ది రోజులుగా చోటుచేసుకుంటున్న పరిణామాలు బ్యాంకింగ్ పరిశ్రమకు కాస్త ఆందోళనకరమైనవి ఆయన పేర్కొన్నారు. వొడాఫోన్ ఐడియాకి తామిచ్చిన రుణాలు స్వల్పస్థాయిలోనే ఉన్నాయని, అయినప్పటికీ కేఎం బిర్లా చేసిన ప్రకటనకు సంబంధించి కార్యాచరణపై ఇతర బ్యాంకర్లతో కచ్చితంగా చర్చిస్తామని మల్లికార్జున రావు పేర్కొన్నారు. వీఐఎల్ని గట్టెక్కించడానికి ఆ సంస్థలో తనకున్న వాటాలను ప్రభుత్వం లేదా ఏ ఇతర కంపెనీకైనా అందించేందుకు తాను సిద్ధమంటూ కేఎం బిర్లా ప్రకటించడం తెలిసిందే. మరోవైపు, వీఐఎల్ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పదవి నుంచి కుమార మంగళం బిర్లా తప్పుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఆదిత్య బిర్లా గ్రూప్ నామినీ అయిన హిమాంశు కపానియా ఈ పదవిలో నియమితులైనట్లు పేర్కొంది. లీజు బకాయిలు మొదలైనవన్నీ కలిపి 2021 మార్చి 31 నాటికి వీఐఎల్ స్థూల రుణభారం రూ. 1,80,310 కోట్లుగా ఉంది. ప్రైవేట్ టెల్కోలు మూడు ఉండాలి: ఎయిర్టెల్ సీఈవో గోపాల్ విఠల్ భారత్ వంటి పెద్ద దేశంలో ప్రైవేట్ టెలికం సంస్థలు 3 అయినా ఉండాలని టెలికం దిగ్గజం భారతి ఎయిర్టెల్ సీఈవో గోపాల్ విఠల్ అభిప్రాయపడ్డారు. తీవ్ర ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న పరిశ్రమకు ఊరట కల్పించేందుకు ప్రభుత్వం తగు చర్యలు తీసుకోగలదని ఆశిస్తున్నట్లు ఆయన వివరించారు. రుణ సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు వొడాఫోన్ ఐడియా నానా తంటాలు పడుతున్న నేపథ్యంలో విఠల్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.భారత్ వంటి పెద్ద దేశంలో.. ప్రైవేట్ రంగంలో 3 సంస్థలు మనుగడ సాగించడమే కాకుండా నిలదొక్కుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఎయిర్టెల్ క్యూ1 ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం యూజర్‌పై వచ్చే సగటు ఆదాయం (ఏఆర్పీయూ) అత్యంత తక్కువగా ఉందని, ఇది రూ. 200, ఆ తర్వాత 300కి పెరగాల్సి ఉంటుందన్నారు. ఇది పెరిగితే పరిశ్రమ కచ్చితంగా తనంత తానుగా నిలదొక్కుకోగలదని విఠల్ తెలిపారు. -
చైర్మన్‌గా వైదొలగనున్న ఆనంద్ మహీంద్ర
సాక్షి, ముంబై: మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ (ఎం అండ్ ఎం) ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఆనంద్ మహీంద్ర తన పదవి నుంచి వైదొలగనున్నారు. ఏప్రిల్ 1, 2020 నుంచి ఆయన నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఉంటారని కంపెనీ శుక్రవారం ప్రకటించింది. ఈ మేరకు బోర్డు ఆమోదం తెలిపిందందని ఎం అండ్ ఎండ్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ లో తెలిపింది. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, పవన్ కుమార్ గోయెంకా, కొత్త సీఈవోగా ఒక సంవత్సరం పాటు అదనపు బాధ్యతలు నిర్వహిస్తారు.. 2020 ఏప్రిల్ 1 నుండి ప్రస్తుత పదవీకాలం ముగిసే వరకు (11 నవంబర్, 2020) ఆయన ఈ పదవిలో కొనసాగుతారని కంపెనీ వెల్లడించింది. అలాగే అనీష్ షా ఏప్రిల్ 2021 వరకు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సిఎఫ్ఓ) గా నియమితులయ్యారు. ఏప్రిల్ 2, 2021 తరువాత, అతను గోయెంకా స్థానంలో నాలుగేళ్ల కాలానికి కంపెనీ సీఎండీ బాధ్యతలు స్వీకరిస్తారు.. అతని పదవీకాలం 2025 మార్చి 31 తో ముగుస్తుంది. ఈ మార్పులను కంపెనీ ప్రకటించడంతో ఎం అండ్ ఎం షేరు స్వల్ప నష్టంతో కొనసాగుతోంది. -
ఐసీఐసీఐ నాన్-ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా గిరీశ్ చతుర్వేది
-
ఐసీఐసీఐ నాన్-ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా గిరీశ్ చతుర్వేది
సాక్షి,ముంబై: దేశీయ ప్రయివేటు బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ కొత్త ఎగ్జిక్యూటివ్ నియామకాన్ని చేపట్టింది. బ్యాంకు నాన్-ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా గిరీశ్ చంద్ర చతుర్వేదిని నియమిస్తున్నట్టు ఐసీఐసీఐ బ్యాంకు శుక్రవారం ప్రకటించింది. మాజీ ఐఏఎస్ అధికారి గిరీశ్ చంద్ర చతుర్వేదిని పార్ట్‌టైమ్ ఛైర్మన్‌గా నియమిస్తున్నట్లు బ్యాంకు వెల్లడించింది. ఈ మేరకు బోర్డు అంగీకరించిందని ఐసీఐసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. జులై 1న ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. చతుర్వేది నియామకానికి వాటాదారులు సమ్మతిస్తే ఆయన మూడేళ్లపాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. కాగా ప్రస్తుతం ఛైర్మన్‌గా ఉన్న ఎం.కే శర్మ పదవీకాలం రేపటితో (జూన్,30) ముగియనుంది. ఛైర్మన్‌గా శర్మను మరోసారి కొనసాగించాలని బోర్డు సభ్యులు భావించినప్పటికీ ఆయన అయిష్టత వ్యక్తం చేశారు. దీంతో బ్యాంకు ఈ నియమకాన్ని చేపట్టింది. తొలుత ఐసీఐసీఐ బోర్డులో స్వతంత్ర డైరెక్టర్‌గా ఉన్న ఎండీ మాల్యా పేరు వినిపించినప్పటికీ చతుర్వేది నియామకానికి బోర్డు సమ్మతించింది.1977 బ్యాంచ్ ఐఏఎస్ అధికారి అయిన చతుర్వేది 2013 జనవరిలో చమురు మంత్రిత్వశాఖ కార్యదర్శిగా పదవీ విరమణ చేశారు. -
ఇన్ఫోసిస్‌లో భారీ మార్పు
భారతీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ భారీ మార్పునకు తెరతీసింది. ఇన్నాళ్లూ నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా ఉన్న కేవీ కామత్ బ్రిక్స్ డెవలప్మెంట్ బ్యాంకు ప్రెసిడెంట్‌గా నియమితులై.. రాజీనామా చేస్తున్నందున ఆయన స్థానంలో రామస్వామి శేషసాయిని నియమించారు. శేషసాయి నియామకాన్ని కంపెనీ బోర్డు ఏకగ్రీవంగా ఆమోదించిందని, ఆయన తక్షణం నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అవుతారని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. 67 ఏళ్ల శేషసాయి ఇన్ఫోసిస్ బోర్డులో 2011 జనవరి నుంచి ఇండిపెండెంట్ డైరెక్టర్‌గాను, ఆడిట్ కమిటీకి ఛైర్‌పర్సన్‌గాను వ్యవహరిస్తున్నారు. శేషసాయిని తన వారసుడిగా ఎంచుకోవడం ద్వారా బోర్డు చాలా సరైన నిర్ణయం తీసుకుందని కేవీ కామత్ అన్నారు. ఆయన అనుభవం కంపెనీకి అన్నిరకాలుగా ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇన్నాళ్లుగా ఇన్ఫోసిస్‌కు సేవలందించిన కామత్‌కు చీఫ్ ఎగ్జిక్యూటివ్ విశాల్ సిక్కా కృతజ్ఞతలు తెలిపారు. అలాగే శేషసాయికి ఆహ్వానం పలికారు. -
బ్యాంకుల చైర్మన్ నియామక ప్రక్రియ షురూ!
న్యూఢిల్లీ: పలు ప్రభుత్వ రంగ బ్యాంకులకు నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్లను ఎంపికచేసే ప్రక్రియను ఆర్థిక మంత్రిత్వశాఖ చేపట్టింది. ఇందుకోసం పదవీ విరమణ చేసిన బ్యూరోక్రాట్స్, బ్యాంకర్లను గుర్తించే ప్రయత్నం ప్రారంభమైనట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ పోస్ట్‌ను విభజించాలన్న ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్ నియామకాలు చేపట్టాల్సిన అవసరం ఏర్పడింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, సిండికేట్ బ్యాంక్‌సహా ఎనిమిది బ్యాంకులకు ఈ నియామకాల అవసరం ఏర్పడిందని అధికార వర్గాలు తెలిపాయి. బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐడీబీఐ బ్యాంక్‌కు కూడా చైర్మన్ నియామకాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల బ్యాంకుల్లో మాజీ బ్యాంకర్లు లేదా, రిటైర్డ్ బ్యూరోక్రాట్స్ నియామకాల సందర్భాల్లో ఎటువంటి ఇంటర్వ్యూలూ నిర్వహించడం జరగదని సమాచారం. ఐదు ప్రభుత్వ రంగ సీఈఓ, మేనేజింగ్ డెరైక్టర్ల నియామకాలకు అర్హులైన అభ్యర్థుల కోసం మంత్రిత్వశాఖ ఇప్పటికే దరఖాస్తులను ఆహ్వానించింది. మంగళవారంతో ఇందుకు సంబంధించి గడువు ముగుస్తుంది.