వినాయక్‌నగర్ : తెలంగాణ రాష్ట్రమొస్తే దళితుడిని తొలి ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి మాట తప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పాలించే హక్కులేదని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు నాగభూషణం పేర్కొన్నారు. ఆయన వెంటనే గద్దె దిగాలని డిమాండ్ చేశారు. గురువారం జిల్లా కేంద్రంలోని పులాంగ్ చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల జెండాలను ఆవిష్కరించారు. కేసీఆర్ అధికార దాహంతో మాట తప్పారన్నారు. ఎంత మందికి డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇచ్చారో చెప్పాలన్నారు.
ఉద్యోగాలు భర్తీ చేయకుండా నిరుద్యోగులతో ఆడుకుంటున్నారన్నారు. కేసీఆర్ ఒక్క హామీనీ నిలబెట్టుకోలేదన్నారు. ప్రజలు ఇబ్బందులు ఎదుర్కుంటుంటే ప్రభుత్వం సంబురాలు నిర్వహించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. నిరసన తెలుపుతున్నవారిని నాలుగో టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకుని, సాయంత్రం సొంత పూచీకత్తుపై వదిలేశారు. ఆందోళనలో ఎమ్మార్పీఎస్ నాయకులు మైలారం బాలు మాదిగ, బరికుంట శ్రీనివాస్ మాదిగ, ప్రవీణ్ మాదిగ, యమున మాదిగ, తార మాదిగ, శివ మాదిగ, గంగాధర్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.
కేసీఆర్ గద్దె దిగాలి
Published Fri, Jun 3 2016 9:06 AM | Last Updated on Wed, Aug 15 2018 9:30 PM
Advertisement