సుజుకీ సీఈవో రాజీనామా! | Suzuki chairman to step down as CEO over false tests | Sakshi
Sakshi News home page

సుజుకీ సీఈవో రాజీనామా!

Published Wed, Jun 8 2016 3:53 PM | Last Updated on Mon, Sep 4 2017 2:00 AM

సుజుకీ సీఈవో రాజీనామా!

సుజుకీ సీఈవో రాజీనామా!

తప్పుడు మైలేజీ టెస్టింగ్ బయటపడిన కారణంగా సుజుకీ మోటార్ కార్పొరేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్, చైర్మన్ ఒసాము సుజుకీ, సీఈవో పదవికి రాజీనామా చేయబోతున్నారట. జపనీస్ ఆటోమొబైల్ సంస్థ సుజుకీ మోటార్స్ బుధవారం ఈ విషయాన్ని వెల్లడించింది.  అయితే సుజుకీ చైర్మన్‌ పదవిలో మాత్రం కొనసాగుతారని కంపెనీ చెప్పింది. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఒసాము హోండా రిటైర్ కాబోతున్నట్టు వెల్లడించింది. వార్షిక సర్వసభ్య సమావేశంలో షేర్ హోల్డర్స్ నుంచి అనుమతి లభించాక జూన్ 29 నుంచి సుజుకీ చైర్మన్ పాత్రలో మార్పు, వైస్ ప్రెసిడెంట్ పదవీవిరమణ అమల్లోకి వస్తాయని కంపెనీ పేర్కొంది. మైలేజ్ టెస్టింగ్ సిస్టమ్ ను మెరుగుపరచడం, ఇంజనీర్లకు మంచి శిక్షణ ఇవ్వడం వంటి మెరుగుదలలను చేపడతామని సుజుకీ చెప్పింది.  

జపాన్‌లోని కార్లకు ఇంధన సామర్ధ్యం, ఉద్గార పరీక్షలను నిర్దిష్ట ప్రమాణాలకు తగ్గట్లుగా నిర్వహించలేదని ప్రముఖ వాహన తయారీ కంపెనీ సుజుకీ మే నెలల్లో అంగీకరించింది. ప్రభుత్వం నిర్ణయించిన నిబంధనలను పాటించనందుకు సంజాయిషీ కూడా చెప్పింది. అయితే ఇది ఉద్దేశపూర్వకంగా చేయలేదని స్పష్టంచేసింది. 2010 నుంచి ఉన్న పరీక్షా పద్ధతులనే పాటిస్తూ వచ్చామని పేర్కొంది. 16 మోడళ్లు.. 20 లక్షల కార్లపైనే ఈ ప్రభావం ఉంటుందని తెలిపింది. ఈ మోసపూరిత చర్య వెల్లడవడంతో, గతవారం కంపెనీ ప్రధాన కార్యాలయంపై జపనీస్ ఇన్వెస్టిగేటర్స్ దాడులు కూడా చేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement