China President Xi Jinping.. డ్రాగన్ కంట్రీ చైనాలో కరోనా కలకలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఒమిక్రాన్ వేరియంట్ల కారణంగా చైనీయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చైనాలో పాజిటివ్ కేసులు కూడా రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో చైనాలో ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ తన పదవికి రాజీనామా చేస్తున్నారనే వార్త చైనా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, కరోనా కట్టడిలో విఫలం కావడం, చైనా ఆర్థికవ్యవస్థ పతనానికి జిన్‌పింగ్ తప్పుడు నిర్ణయాలే కారణమని ఆ దేశ కమ్యూనిస్టు పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో వదంతులు ప్రచారంలో ఉన్నాయి.
కాగా, ఇటీవలే జరిగిన సీపీసీ పొలిట్ బ్యూరో స్టాండింగ్ కమిటీ సమావేశం అనంతరం ఈ ప్రచారం ఊపందుకుంది. మరోవైపు.. చైనాలో కరోనా కట్టడి కోసం జిన్‌పింగ్.. జీరో కొవిడ్ పాలసీ పేరుతో కఠిన ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. పాజిటివ్ వచ్చిన వారిని బలవంతంగా క్వారన్‌టైన్ కేంద్రాలకు తరలించారు. దీనికి సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి. దీంతో జిన్‌పింగ్‌పై చైనీయుల్లో తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఇక, కరోనా కారణంగా చైనాలో వ్యాపార సంస్థలు తీవ్రంగా నష్టపోయాయి. ఈ క్రమంలో ఆర్ధిక వ్యవస్థ దెబ్బతిన్నది. ఈ కారణంగా జిన్‌పింగ్ రాజీనామా చేస్తున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఇదిలా ఉండగా.. కెనడాకు చెందిన బ్లాగర్ ఆసక్తికర వ్యాఖ‍్యలు చేశాడు. చైనా కమ్యూనిస్టు పార్టీ.. ప్రస్తుత ప్రీమియర్ లీ కెకియాంగ్ను తదుపరి చైనా అధ్యక్షుడిగా పార్టీ నియమిస్తుందని పేర్కొన్నాడు. అంతకన్నా ముందు.. చైనా కమ్యూనిస్టు పార్టీ ఓ కీలక సమావేశాన్ని ఏర్పాటుచేసి జిన్‌పింగ్‌ను పదవి నుంచి తప్పుకోవాలని ఆదేశించనుందని బాంబు పేల్చాడు.
ఇది కూడా చదవండి: యూఏఈ నూతన అధ్యక్షుడిగా షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్
Comments
Please login to add a commentAdd a comment